Begin typing your search above and press return to search.

వైట్ ష‌ర్టేసిన క‌మెడియ‌న్ జ‌నాల్లో అలా!

'వైట్ ష‌ర్టేసిన ప్రతీవోడ్ ఫ్యాక్ష‌నిస్ట్ కాదు..పొలిటిషీన్ కాదు' అంటూ ఓ హీరో డైలాగ్ ని గుర్తు చేస్తున్నారు. మ‌రి వీటికి స‌ద‌రు క‌మెడియ‌న్ ఎలాంటి కౌంట‌ర్ వేస్తాడో చూడాలి.

By:  Tupaki Desk   |   18 April 2024 2:45 AM GMT
వైట్ ష‌ర్టేసిన క‌మెడియ‌న్ జ‌నాల్లో అలా!
X

ఏపీ ఎన్నిక‌ల నేప‌థ్యంలో అభిమాన క్యాడెంట్ పై ఎవ‌రి ప్రేమ వారు చాటుకుంటున్నారు. కొంత మంది నేరుగా నాయ‌కుడికి తోడుగా...అండ‌గా వెంటే ఉంటే? మ‌రికొంత మంది సోష‌ల్ మీడియా లో మీ వెంట మేమున్నామంటూ అదే వేదిక‌గా త‌మ క్యాడెండ్ ని గెలిపించాలంటూ ప్ర‌చారం చేస్తున్నారు. పిల‌వాలే గానీ మేము సైతం రంగంలోకి దిగేస్తామ‌ని గ‌ట్టునుండి క‌బుర్లు చెబుతోన్న గ్యాంగ్ ల‌కు కొద‌వ‌లేదు. నిజంగా అభిమానం ఉంటే పిల‌వాలా? వెళ్లి ప్ర‌చారం చేయోచ్చు క‌దా! అలాంటి ప‌నే ఓ క‌మెడియ‌న్ చేస్తున్నాడిప్పుడు.

అత‌న్ని పార్టీలోకి ర‌మ్మ‌ని గానీ... ప్ర‌చారం చేయ‌మ‌ని గానీ ఏనాడు అత‌ను కోర‌లేదు. త‌న‌కు తానుగానే అభిమానంతో వెళ్లి నేడు ఎంతో చ‌క్క‌గా ప్ర‌చారం చేస్తున్నాడు. త‌న అభిమాన క్యాండెట్ పోటీ చేస్తున్న నియోజ‌క వ‌ర్గాలో ఆ క‌మెడియ‌న్ డోర్ టూ డోర్ తిరిగేస్తున్నాడు. ఎన్నిక‌ల లోపు మొత్తం నియోజ‌క వ‌ర్గంలో ఒక్క గ‌డ‌ప కూడా వ‌దిలేలా లేడు. అంత గొప్ప అభిమానంతో ప్ర‌చారం చేస్తున్నాడు. బుల్లి తెర క‌మెడియ‌న్ గా పేరు గాంచ‌డంతో వెనుక జ‌నాలు కూడా బాగానే జ‌మ అవుతున్నారు.

కొంత‌మంది తానే స్వ‌యంగా నియమించుకున్న టీమ్ తో పాటు.. స్వ‌చ్ఛందంగానూ అత‌నితో పాలు పంచుకుం టున్నారు. అయితే ఎప్పుడూ రంగుల చొక్కాలు ధ‌రించే ఆ క‌మెడియ‌న్ ఒక్క‌సారిగా తెల్ల‌చొక్కా ధ‌రించి నియోజ క‌వ‌ర్గంలో తిరుగుతుంటే? కొన్ని ర‌కాల విమ‌ర్శ‌లు కూడా తెర‌పైకి వ‌స్తున్నాయి.

అత‌ని ఆహార్యం...తెల్ల చొక్కా చూసి ఇత‌డు పుల్ టైమ్ పొలిటీష‌నా? లేక పార్ట్ టైమ్ పోలిటీష‌య‌న్ నా? అంటూ ఎద్దేవా చేస్తున్నారు. ఇదే అదునుగా ఓ సినిమా లో ఫేమ‌స్ డైలాగ్ ని గుర్తు చేస్తున్నారు.

`వైట్ ష‌ర్టేసిన ప్రతీవోడ్ ఫ్యాక్ష‌నిస్ట్ కాదు..పొలిటిషీన్ కాదు` అంటూ ఓ హీరో డైలాగ్ ని గుర్తు చేస్తున్నారు. మ‌రి వీటికి స‌ద‌రు క‌మెడియ‌న్ ఎలాంటి కౌంట‌ర్ వేస్తాడో చూడాలి. కౌంట‌ర్ల‌కే కౌంట‌ర్ బాబు నంటు బుల్లి తెర వేదిక‌పై ఎన్నో సార్లు దంచికొట్టిన ఆ క‌మెడియ‌న్ వీటిని సీరియ‌స్ గా తీసుకుంటా? లైట్ తీసుకుంటాడా? అన్న‌ది చూడాలి.