Begin typing your search above and press return to search.

అయినపట్టికీ భారత్ లో యాపిల్ ప్లాంట్ పెడితే..?

అవును... యాపిల్ తన ప్లాంటును భారత్ లో నిర్మించుకోవచ్చు కానీ ఆ టెక్ కంపెనీ సుంకాలు లేకుండా అమెరికాలో తన ఉత్పత్తులను విక్రయించడానికి వీలుండదని ట్రంప్ స్పష్టం చేసిన సంగతి తెలిసిందే.

By:  Tupaki Desk   |   25 May 2025 9:32 AM IST
అయినపట్టికీ భారత్  లో యాపిల్  ప్లాంట్  పెడితే..?
X

యాపిల్ తన ఐఫోన్లను అమెరికాలోనే ఉత్పత్తి చేసి, తమకు అమ్మితే సమస్యలేదు కానీ.. భారత్ లోనో, మరో చోటో ఉత్పత్తి చేసి అమెరికాలో అమ్మితే మాత్రం 25% సుంకం చెల్లించాలని డొనల్డ్ ట్రంప్ అల్టిమేటం జారీ చేసిన సంగతి తెలిసిందే. అయితే.. భారత్ లో యాపిల్ ప్లాంట్ పెట్టొచ్చని, సమస్య ఉండకపోవచ్చనే చర్చ తాజాగా తెరపైకి వచ్చింది.

అవును... యాపిల్ తన ప్లాంటును భారత్ లో నిర్మించుకోవచ్చు కానీ ఆ టెక్ కంపెనీ సుంకాలు లేకుండా అమెరికాలో తన ఉత్పత్తులను విక్రయించడానికి వీలుండదని ట్రంప్ స్పష్టం చేసిన సంగతి తెలిసిందే. ఈ రూల్ యాపిల్, శాంసంగ్ తో పాటు అన్ని సంస్థలకూ వర్తిస్తుందని అన్నారు. ఈ సమయంలో ఓ ఆసక్తికర నివేదిక తెరపైకి వచ్చింది!

ఇందులో భాగంగా... భారత్ లో తయారయ్యే ఐఫోన్లపై అమెరికా సుంకాలు విధించినప్పటికీ మన దేశంలో ఐఫోన్ల తయారీ ఖర్చు అమెరికాలో కంటే తక్కువే అవుతుందని గ్లోబల్ ట్రేడ్ రీసెర్చ్ ఇనిషియేటివ్ (జీ.టీ.ఆర్.ఐ) తన నివేదికలో వెల్లడించింది. దీనికి కారణం.. భారత్ లో తక్కువ ఉత్పత్తి వ్యయాలకు తోడు ప్రభుత్వ ప్రోత్సకాలని పేర్కొంది.

భారత్ లో ఒక ఐఫోన్ అసెంబ్లింగ్ చేయాడానికి అయ్యే ఖర్చు సుమారు 30 డాలర్లు అయితే.. అదే ఖర్చు అమెరికాలు 390 డాలర్లుగా ఉంటుందని తెలిపింది. కారణం.. భారత్ లో కార్మికుల జీతాలు తక్కువగా ఉండటమే అని క్లారిటీ ఇచ్చింది. ఉదాహరణకు భారత్ లో ఒక కార్మికుడికి నెల సంపాదన సగటున రూ.19,000 (23 డాలర్లు) అని తెలిపింది.

అదే అమెరికాలో అయితే.. అక్కడ కనీస వేతన చట్టాల ప్రకారం రూ.2.4 లక్షలు (2,900) డాలర్ల వరకూ ఉంటుందని వెల్లడించింది. దీనికితోడు భారత ప్రభుత్వం అందించే పీ.ఎల్.ఐ. పథకం కూడా యాపిల్ కు అదనపు లాభాల్ని అందిస్తోందని.. అందువల్ల ఐఫోన్లపై 25% సుంకం చెల్లించాల్సి వచ్చినా భారత్ లో చౌకగానే తయారవుతాయని వెల్లడించింది.

ఇక్కడ మరో విషయం ఏమిటంటే... ఐఫోన్ లను అమెరికాలోనే పూర్తిగా తయారుచేయడం ప్రారంభిస్తే వాటి ధరలు అమాంత పెరిగి, సాధారణ వినియోగదారులకు అందుబాటులో లేకుండా పోతాయని అంటున్నారు. ఓ నివేదిక ప్రకారం ఐఫోన్లు అన్నీ అమెరికాలోనే తయారైతే వాటి ధర సుమారు రూ.2.9 లక్షల వరకూ చేరే అవకాశం ఉందని అంటున్నారు!