Begin typing your search above and press return to search.

ఏపీలో పల్స్ అందక కన్ఫ్యూజన్ లో ఉన్నారా...!?

ఏపీలో ఎన్నికలు నిజంగా జరుగుతున్నాయా జరిగితే ఆ వేడి ఏది అన్న చర్చ అయితే రాజకీయ విశ్లేషకులలో ఉంది. ఏదో అలా నిర్లిప్తంగా సాగుతోంది అంతా.

By:  Tupaki Desk   |   10 March 2024 9:30 AM GMT
ఏపీలో పల్స్ అందక కన్ఫ్యూజన్ లో ఉన్నారా...!?
X

ఏపీలో ఎన్నికలు నిజంగా జరుగుతున్నాయా జరిగితే ఆ వేడి ఏది అన్న చర్చ అయితే రాజకీయ విశ్లేషకులలో ఉంది. ఏదో అలా నిర్లిప్తంగా సాగుతోంది అంతా. పోలింగ్ కి కౌంట్ డౌన్ స్టార్ట్ అయింది. గట్టిగా చూస్తే నలభై రోజులు కూడా లేదు. అంతా అయిపోతుంది. మరి అంత తక్కువ టైం ఉంటే ఏపీలో జనం పల్స్ మాత్రం ఎవరికీ తెలియడంలేదు.

జనాలు మొగ్గు ఎటు వైపు అన్నది కూడా అసలు అర్ధం కావడంలేదు. అధికార పార్టీ వైసీపీ పట్ల వ్యతిరేకత ఉందని విపక్షాలు చెబుతున్నాయి. కానీ అంతటి వ్యతిరేకత ఉంటే అది విపక్షానికి టర్న్ కావాలి కదా. కానీ చూడబోతే అలాంటి పరిస్థితి అయితే ఎక్కడా లేదు అనే అంటున్నారు. అదే విధంగా అధికార పక్షం వై నాట్ 175 అని నినదిస్తోంది. మరి అధికార పక్షానికి కూడా జనం అనుకూలత వెల్లువలా వస్తోందా అంటే ఆ సూచనలు కూడా కనిపించడం లేదు.

ఒక విధంగా చెప్పాలీ అంతా సైలెంట్ గా ఉంది. గుంభనంగా ఉంది. ఒక గంభీరమైన వాతావరణం ఉంది. దీన్ని ఎలా అభివర్ణించాలి అంటే తుపాను ముందు నిశ్శబ్దం అని. అంటే ప్రజల మనసులో తుఫాను ఉందా. అది ఎవరి వైపు మళ్ళుతుంది అన్నది దీని తరువాత వచ్చే ప్రశ్నలు. ఏపీలో ఈపాటికి అయితే జనాల మూడ్ చూసి ఫలానా పార్టీ గెలుస్తుంది అని చెప్పేసే సీన్ ఉండేది.

కాస్తా వెనక్కి వెళ్తే 2014లో టీడీపీకి ఇలాంటి వేవ్ పోలింగ్ కి రెండు నెలల ముందు మొదలైంది. 2019లో చూసుకున్నా జగన్ కి ఈ తరహా వేవ్ మూడు నెలల ముందే కనిపించింది. దాంతో జగన్ రాబోతున్నారు అని అంతా అంచనా కట్టారు. కానీ ఇపుడు అలాంటిది ఏమీ లేదు. ముప్పయి రోజుల వ్యవధిలో పోలింగ్ ఉంటే ఇంకా జనం మనసులో ఏముందో తలపండిన రాజకీయ నేతలు కూడా కనుక్కోలేకపోతున్నారు. అఫ్ కోర్స్ సర్వేలు వస్తున్నాయి.

కానీ అవి కూడా పూర్తిగా జనం మనసులోని భావాలని చెప్పలేకపోతున్నాయని అంటున్నారు. మరి ఏపీ జనాలు ఏమనుకుంటున్నారు. ఓటర్ల నాడి ఎలా ఉంది. అసలు దొరకడం లేదా అంటే నిజంగా అదే నిజం అంటున్నారు. ఇక ఏపీలో చూస్తే అధికార పక్షం తమది ఒంటరి పోరు అనే అంటోంది. విపక్షమే తలో రకంగా వ్యవహరిస్తోంది.

రోజుకు ఒక పొత్తుతో ముందుకు సాగుతోంది. ఒక వైపు జగన్ ఉంటే రెండవ వైపు అంతా ఉన్నారు. ఏపీలో చిన్నా చితకా పార్టీల నుంచి టీడీపీ దాకా అంతా జగన్ మీదకు యుద్ధానికి వస్తున్నారు. వీరి మధ్య కూడా ఒక రకమైన అవగాహన ఉంది అని అంటున్నారు. టీడీపీ జనసేన గత సెప్టెంబర్ లో పొత్తులు పెట్టుకున్నాయి. ఇక లేటెస్ట్ గా చూస్తే బీజేపీ కూడా ఈ పొత్తులో కూడింది. దాంతో 2014 పొత్తు రిపీట్ అయింది అని అంటున్నారు.

ఇంకో వైపు వామపక్షాలు నిన్నటిదాకా టీడీపీతోనే ఉన్నాయి. వాటికి టీడీపీ అంటే ఏమీ వ్యతిరేకత లేదు. ఆ పార్టీ బీజేపీతో కలసి పొత్తులకు వెళ్తోంది అన్న ఆగ్రహమే ఉంది. ఈ రోజుకీ కామ్రేడ్స్ వైసీపీ కంటే టీడీపీనే కోరుకుంటాయి. సో అలా చూస్తే కనుక వైసీపీని పూర్తిగా వ్యతిరేకిస్తున్నది వామపక్షాలు గానే చూడాలి. ఎన్నికలు దగ్గర చేసి కాంగ్రెస్ ఏపీలో లేచి కూర్చునే ప్రయత్నం చేస్తోంది.

కాంగ్రెస్ కి వైఎస్సార్ తనయ షర్మిల నాయకత్వం వహిస్తున్నారు. దాంతో ఆ పార్టీకి ఎంతో కొంత గ్లామర్ పొలిటికల్ గా వచ్చింది. ఆ పార్టీ ఊసు కూడా వినిపిస్తోంది. ఇదిలా ఉండగా కాంగ్రెస్ కూడా వైసీపీని తుదికంటా వ్యతిరేకిస్తోంది. జగన్ దిగిపోతేనే అంతా మేలు అని భావిస్తోంది. షర్మిల అన్న ప్రభుత్వం ఓడిపోవాలని మనసా వాచా గట్టిగా కోరుకుంటున్నారు. ఇలా జగన్ మీద ఏడెనిమిది పార్టీలు దండెత్తి వస్తున్నాయి.

ఇలా ఏపీలో రాజకీయ ముఖ చిత్రం అంతా జగన్ కి వ్యతిరేకంగా ఉంది. జగన్ మాజీ సీఎం కావాలన్నదే అన్ని పార్టీల ఉద్దేశ్యం. ఇదిలా ఉంటే కొత్తగా జట్టు కట్టిన పాత మిత్రులు టీడీపీ జనసేన బీజేపీల మధ్య ఓట్ల బదిలీ ఎలా జరుగుతుంది అన్న ఆసక్తి అయితే అంతటా ఉంది.

ఈ మూడు పార్టీల ఓట్లు బదిలీ అయితేనే పొత్తు సక్సెస్ అయినట్లు. కానీ అలా జరగుతుందా అన్నదే పెద్ద చర్చ. జనసేనను గెలిపించడానికి టీడీపీ లోకల్ లీడర్స్ కి మనసు విశాలం కావాలి. బీజేపీని నెత్తిన పెట్టుకోవడానికి జనసేన టీడీపీ పార్టీలు హోల్ హార్టెడ్ గా పనిచేయాలి. అందువల్ల చూసుకుంటే కనుక ఈ ఓట్ల బదిలీ ఎలా జరుగుతుంది అన్నది బిగ్ క్వశ్చన్ గా ఉంది.

ఇదే ప్రతీ చోటా రచ్చ బండ వద్ద అలాగే టీ స్టాల్స్ వద్ద చర్చగా ఉంది. రాజకీయ వ్యూహకర్తలకు కూడా ఏపీ రాజకీయం అర్ధం కావడం లేదు. ఏపీలో ఇంతలా ఉన్న ఈ గందరగోళం లో ప్రజల తీర్పు ఎవరి వైపు అది ఎవరికి మేలు ఎవరికి చేటు అన్నదే ఉత్కంఠగా ఉంది.