Begin typing your search above and press return to search.

రుషికొండపై ఆ ట్వీట్ రచ్చ..రోజా స్పందన

విశాఖలోని రుషికొండ సెక్రటేరియట్ నిర్మాణం చేపడుతున్నామని వైసీపీ అఫీషియల్ ట్విట్టర్ హ్యాండిల్ నిన్న పొరపాటున ఒక ట్వీట్ చేసింది.

By:  Tupaki Desk   |   13 Aug 2023 10:02 AM GMT
రుషికొండపై ఆ ట్వీట్ రచ్చ..రోజా స్పందన
X

విశాఖలోని రుషికొండ సెక్రటేరియట్ నిర్మాణం చేపడుతున్నామని వైసీపీ అఫీషియల్ ట్విట్టర్ హ్యాండిల్ నిన్న పొరపాటున ఒక ట్వీట్ చేసింది. అయితే, దీనిపై విమర్శలు రావడంతో వెంటనే దానిని డిలీట్ చేసింది. అయితే, అప్పటికే ఆ వ్యవహారంపై టీడీపీ సోషల్ మీడియా రంగంలోకి దిగి వైసీపీపై ట్రోలింగ్ మొదలుబెట్టింది. ఈ క్రమంలోనే ఆ ట్వీట్ వ్యవహారంపై మంత్రి రోజా స్పందించారు. ఆ ట్వీట్ ను పట్టుకొని ఈనాడు పత్రిక, టీడీపీ మీడియా రాద్ధాంతం చేస్తున్నాయని రోజా మండిపడ్డారు. ఆ చిన్న ట్వీట్ ను హైలైట్ చేసిన ఈనాడు..టూరిజం శాఖా మంత్రిగా తాను చెప్పిన మాటలు మాత్రం ప్రచురించలేదని దుయ్యబట్టారు.

రుషికొండ మీద టూరిజం ల్యాండ్ 69 ఎకరాలు ఉందని, 9 ఎకరాలకు అనుమతిచ్చారని, అయితే, కేవలం 2.7 ఎకరాల్లో జీ ప్లస్ 1 బిల్డింగ్ లు కడుతున్నాం అని చెప్పారు. 7 బిల్డింగులకు పర్మిషన్స్ వస్తే 4 బిల్డింగులు మాత్రమే కడుతున్నామని వివరించారు. అక్కడ హరిత రిసార్ట్స్, ప్రభుత్వ బిల్డింగులు పాతవయ్యాయని, రెనోవేట్ చేస్తుంటే పవన్ కు ఎందుకు కడుపుమంట అని ప్రశ్నించారు. జగన్ ఎక్కడ ఉండాలి...పరిపాలించాలి అన్నది ఓ కమిటీ నిర్ణయిస్తుందని, పవన్ కాదని చెప్పారు.

‘‘పనికిమాలిన పవన్ వార్డు మెంబర్ కూడా కాదు... అతను పిచ్చి పిచ్చిగా మాట్లాడితే ఈనాడులో రాస్తారు, కానీ,టూరిజం మంత్రి చెబితే రాయరు, ఈనాడు జర్నలిజం విలువలు దిగజారిపోయాయి...చంద్రబాబు, రఘురామ తదితరులు రుషికొండపై కోర్టులో కేసు వేశారు...కానీ, నిర్మాణాలు ఆపాలని కోర్టు స్టే ఇవ్వలేదు..హైకోర్టు అనుమతితో నిర్మాణాలు జరుగుతున్నాయి. ఎప్పటికప్పుడు కోర్టుకు ప్రోగ్రెస్ పై అపిడవిట్ సమర్పిస్తున్నాం..ఒకవేళ కోర్టు మార్పులు చేర్పులు సూచిస్తే...చేస్తాం..ఎన్జీటీ కూడా అనుమతిచ్చింది’’ అని రోజా అన్నారు .

విశాఖ బ్రాండ్ ను వారు దెబ్బతీస్తున్నారని, అబద్దాలు చెబితే చంద్రబాబు, పవన్ లను విశాఖ ప్రజలు తన్ని తరిమి కొడతారని అన్నారు. టీడీపీకి కావాల్సిన వాళ్లకు నిర్మాణాలు ఇచ్చినపుడు పర్యావరణం దెబ్బతినలేదా? అని పవన్ ను ప్రశ్నించారు రోజా. అమరావతి రియల్ ఎస్టేట్ రాజధాని దెబ్బతింటోందని విశాఖపై విషం చిమ్ముతున్నారని, పవన్, బాబు చెప్పే అబద్ధాలు ఈనాడులో రాస్తారని ఆరోపించారు. బాలయ్య అల్లుడు, లోకేష్ తోడల్లుడు భూములు కబ్జా చేస్తే పవన్ హెరిటేజ్ ఐస్ క్రీం.పెట్టుకున్నాడా?.త్వరలోనే పవన్ మెంటల్ హాస్పటల్ కు వెళతాడు అంటూ షాకింగ్ వ్యాఖ్యలు చేశారు.