Begin typing your search above and press return to search.

సిక్కోలు వైసీపీ...బొత్స చేతిలోకి...?

విజయనగరం జిల్లాలో 2019 మాదిరిగా క్లీన్ స్వీప్ చేసి చూపిస్తామని బొత్స అనుచరులు అంటున్నా అంత కాకపోయినా మెజారిటీ సీట్లు తెప్పించేందుకు బొత్స ప్రయత్నం గట్టిగానే చేస్తున్నారు.

By:  Tupaki Desk   |   14 July 2023 4:25 PM GMT
సిక్కోలు వైసీపీ...బొత్స చేతిలోకి...?
X

ఉమ్మడి శ్రీకాకుళం జిల్లా వైసీపీకి 2019లో బాగా కలసివచ్చింది. మొత్తం పది సీట్లకు గానూ ఎనిమిది సీట్లను ఆ పార్టీ గెలుచుకుంది. దాంతో ఏపీలో బంపర్ మెజారిటీ దక్కింది. ఇక శ్రీకాకుళం నుంచి వైసీపీకి స్ట్రాంగ్ లీడర్స్ ఉన్నారు. మంత్రి ధర్మాన ప్రసాదరావు, మాజీ మంత్రి ధర్మాన క్రిష్ణదాస్ వంటి వారు సీనియర్లు, పార్టీని గాడిలో పెట్టేవారే. అయితే శ్రీకాకుళం పార్టీ పరిస్థితి మాత్రం పెద్దగా బాగులేదనే అంటున్నారు.

దాంతో జిల్లా ఇంచార్జి బాధ్యతలను బొత్స సత్యనారాయణకు జగన్ అప్పగించారు. ఆయన కూడా వస్తూ పోతూ ఉన్నారు. ఇపుడు జగన్ బొత్సకు మరో కీలకమైన బాధ్యత అప్పగించారు. మొత్తం పది నియోజకవర్గాలలో అభివృద్ధి కార్యక్రమాల మీద సమీక్ష చేయాలని సూచించారు. నియోజకవర్గంలో ఎక్కడ అభివృద్ధి ఆగింది. ఎక్కడ ఆ పనులు పూర్తి కాలేదు, సమస్యలు ఎక్కడ ఉన్నాయి. వాటి సంగతేంటి అన్నది కూడా ఈ రివ్యూ మీటింగుతో మొత్తం నివేదికలు కావాలని కోరారు.

దాంతో బొత్స వెంటనే పనిలోకి దిగిపోయారు. ఆయన ఫస్ట్ ఫస్ట్ నే స్పీకర్ తమ్మినేని సీతారాం నియోజకవర్గంతో మొదలెట్టారు. ఆముదాలవలస నుంచి ప్రారంభించి మొత్తం పది నియోజకవర్గాలలో అభివృద్ధి కార్యక్రమాల తీరుని బొత్స ఫుల్ గా రివ్యూ చేస్తారు అన్న మాట. అవసరం అయిన చోట నిధులను కేటాయించి మరీ పనులు జరిపించేందుకు కూడా సిద్ధంగా ప్రభుత్వం ఉంది అని అంటున్నారు.

దాంతో ప్రభుత్వ సంక్షేమంతో పాటు అభివృద్ధి పనుల తీరు మీద బొత్స అధికారులతో సమీక్ష నిర్వహించారు. ప్రతీ శుక్రవారం ఒక్కో నియోజకవర్గం వంతున మొత్తం పది వారాల్లో రివ్యూస్ ని పూర్తి చేస్తామని జిల్లాను అభివృద్ధి పధంలో పరుగులు పెట్టిస్తామని బొత్స అంటున్నారు. మరో వైపు చూస్తే జిల్లాలో టీడీపీ పుంజుకుంది అని నివేదికలు వస్తున్నాయి.

దానికి తగినట్లుగా ధర్మాన బ్రదర్స్ దూకుడు చేయడంలేదు అని నివేదికలు ఉన్నాయిట. దాంతో బొస్తను విజయనగరంతో పాటు శ్రీకాకుళం కూడా జాగ్రత్తగా చూసుకోమని జగన్ పంపించారు అని అంటున్నారు. విజయనగరం జిల్లాలో 2019 మాదిరిగా క్లీన్ స్వీప్ చేసి చూపిస్తామని బొత్స అనుచరులు అంటున్నా అంత కాకపోయినా మెజారిటీ సీట్లు తెప్పించేందుకు బొత్స ప్రయత్నం గట్టిగానే చేస్తున్నారు.

ఇక శ్రీకాకుళం జిల్లా చూస్తేనే సీన్ రివర్స్ అయ్యేట్టు ఉంది అని అంటున్నారు. ఈసారి ఆ రెండు సీట్లు వైసీపీకి ఎనిమిది సీట్లు టీడీపీకి వస్తాయని లోకల్ సర్వేశ్వరులు అంటున్నారు. దీంతో కంగారు పడిన అధినాయకత్వం బొత్సను శ్రీకాకుళం పంపిస్తోంది అని అంటున్నారు. ఇక కింజరాపు ఫ్యామిలీ మీద కూడా దూకుడు చేయాలని విమర్శలు ఎక్కుపెట్టాలని కూడా హై కమాండ్ నుంచి సూచనలు ఉన్నాయని అంటున్నారు.

ఆ పనిని ధర్మాన ఫ్యామిలీ సమర్ధంగా చేయలేకపోతోంది అని అంటున్నారు. లోపాయికారీ అవగాహన వల్లనే కింజరాపు ఫ్యామిలీని ఎదుర్కోవడం లేదు అన్న అనుమానాలు అయితే హై కమాండ్ లో ఉన్నాయని అంటున్నారు. ఏది ఏమైనా బొత్స ఇపుడు శ్రీకాకుళం మీద ఫుల్ ఫోకస్ పెట్టారు అని అంటున్నారు. మరి ధర్మాన సోదరులు ఎంతవరకూ సహకరిస్తారు అన్నది కూడా చూడాలని అంటున్నారు.