అంజాద్ ను గెలిపించేది ఆ నలుగురే.....!
ఆంధ్రప్రదేశ్ ఉప ముఖ్యమంత్రి సీఎంకు వీర విధేయుడు అయిన అంజాద్ బాష
By: Tupaki Desk | 27 Aug 2023 10:53 PM ISTఆంధ్రప్రదేశ్ ఉప ముఖ్యమంత్రి సీఎంకు వీర విధేయుడు అయిన అంజాద్ బాషను తెలుగుదేశం పార్టీకి చెందిన ఆ నలుగురే రాబోయే ఎన్నికల్లో గెలిపిస్తారని కడప నియోజకవర్గం వైసీపీ నాయకులు ధీమాగా ఉన్నారు. 2014-19మధ్య ఎమ్మెల్యే 2019నుంచి ఇప్పటి వరకు ఉపముఖ్యమంత్రిగా పనిచేస్తున్న అంజాద్ భాషా పట్ల గత కొంతకాలంగా సొంత పార్టీలోనే వ్యతిరేకత వ్యక్తం అవుతోంది. 49 మంది కార్పొరేటర్లలో దాదాపు 40 మంది ఆయన పట్ల అసంతృప్తితో ఉన్నారు వైయస్సార్ కాంగ్రెస్ పార్టీ జిల్లా అధ్యక్షుడి సమక్షంలో జరిగిన ఒక అంతర్గత సమావేశంలోవారు తమ అసంతృప్తిని బాహాటంగా వెళ్ళగక్కారు.
ఓటర్లలో ఆదరణ పరంగా చూస్తే గత నాలుగు సంవత్సరాల్లో ఆయన కడప నగరాభివృద్ధికి మరి ప్రధానంగా మైనారిటీల అభివృద్ధికి చేపట్టిన చర్యలు ఏమీ లేవని జనం పెదవి విరుస్తున్నారు. బార్బర్ షాపులు ఐస్ క్రీమ్ పార్లర్ లు వ్యాయామశాలలు టీ షాపులు ఇలా ప్రతి షాపు ప్రారంభోత్సవాలకు మాత్రమే ఆయన పరిమితి పరిమితమయ్యారని ఆయన కడప కటింగ్ భాష అని పార్టీ వర్గాలు వ్యంగ్యంగా. వ్యాఖ్యానిస్తున్నాయి.
రాబోయే ఎన్నికల్లో ఆయన గెలుపు పై సర్వత్ర అనుమానాలు వ్యక్తమవుతున్నాయి. ఈ అవకాశాన్ని సానుకూలంగా మలుచుకోవడంలో తెదేపా నాయకులు ఘోర వైఫల్యం చెందడం ఒక్కటే అంజాద్ భాషకు ఊరటనిస్తోంది. కడప నియోజకవర్గంలో ఆ నలుగురు గా పిలవబడుతున్న తెలుగుదేశం పార్టీ నాయకులు హరి ప్రసాద్ గోవర్ధన్ రెడ్డి అమీర్ బాబు లక్ష్మి రెడ్డి ఎప్పటిలాగే కడప టికెట్ తమకే కేటాయించాలని తెలుగుదేశం పార్టీ అధినేత చంద్రబాబు నాయుడికి లేఖలు ఇచ్చేశారు. ఆ నలుగురు తెలుగుదేశం పార్టీలో సీనియర్ నాయకులే అయినా వారి వారి డివిజన్లో కూడా ఇప్పటివరకు పార్టీ అభ్యర్థులను గెలిపించలేకపోవడం విశేషం. తెలుగుదేశం పార్టీ టికెట్ తన సతీమణికి ఇవ్వాలని ఆ పార్టీ జిల్లా అధ్యక్షుడు శ్రీనివాసరెడ్డి సైతం పార్టీ అధినేతకు విజ్ఞప్తి చేశారు.
ఆయన నాన్ లోకల్ పార్టీ అధికారంలో ఉన్నప్పుడు వైసిపి నాయకులకే పనులు చేసి పెట్టారు అన్న ప్రచారాన్ని ఆ నలుగురు నాయకులు విస్తృతంగా ప్రచారం చేశారు. మరో కీలక నేత ఉత్త నరసింహారెడ్డి లేదా ఆయన తనయులు ఈ టికెట్ ఆశిస్తున్న బలంగా ఆపాదిస్తున్నారు. టికెట్ నాకే కావాలి నాకే కావాలి అని అధినేత వెంటపడే ఈ నాయకులు అధికార పార్టీ వైఫల్యాలను ఎండగట్టడంలో అత్యంత దారుణంగా విఫలమయ్యారు. నియోజకవర్గంలోని ప్రజలు ఎదుర్కొంటున్న ఏ ఒక్క సమస్య మీద ఉపముఖ్యమంత్రిని గానీ నిలదీసిన పాపాన పోలేదు.
ఓటర్లలో ఏమాత్రం చరిష్మాలేని ఈ నాయకులకే తెలుగుదేశం పార్టీ టికెట్ ఖరారు అవుతుందని వైసిపి నాయకులు గంపడాశులు పెట్టుకున్నారు. వీరిలో ఎవరికి టికెట్ ఇచ్చినా వైసిపి అభ్యర్థి విజయం సాధించడం ఖాయమని వారు ధీమాగా ఉన్నారు. వైయస్ జగన్ కు వీర విధేయుడిగా ముద్రపడిన అంజాద్ భాష స్థానాన్ని మరొక నాయకుడితో భర్తీ చేసే అవకాశాలు కనుచూపుమేరలో కనిపించడం లేదు. సొంత పార్టీలో అడ్డు లేకపోవడం పక్ష పార్టీలో సమర్థులైన నాయకులు లేకపోవడం భాషకు కలిసి వచ్చే అంశాలు. దీనితో ప్రజల విశ్వాసాన్ని కోల్పోయిన ప్రత్యర్థి పార్టీకి చెందిన పార్టీకి చెందిన ఆ నలుగురే విజయం సాధించి పెడతారని 2024 ఎన్నికల్లో హ్యాట్రిక్ కొట్టడం ఖాయమని భాష ధీమాగా ఉన్నారు.
