Begin typing your search above and press return to search.

ఏపీ ఇంటెలిజెన్స్ సర్వేలో అధికారం ఎవరిది......!?

ఏపీ ఇంటెలిజెన్స్ సర్వే చేసి తాజాగా ముఖ్యమంత్రి వైఎస్ జగన్ కి ఒక నివేదిక అందించినట్లుగా ప్రచారం సాగుతోంది.

By:  Tupaki Desk   |   25 March 2024 3:58 AM GMT
ఏపీ ఇంటెలిజెన్స్ సర్వేలో అధికారం ఎవరిది......!?
X

ఏపీ ఇంటెలిజెన్స్ సర్వే చేసి తాజాగా ముఖ్యమంత్రి వైఎస్ జగన్ కి ఒక నివేదిక అందించినట్లుగా ప్రచారం సాగుతోంది. ఈ సర్వే నివేదిక ప్రకారం ఏపీలో మరోసారి వైసీపీ అధికారంలోకి వస్తుందని తేలిందట. అంతే కాదు ఒక నంబర్ ని కూడా ఈ నివేదికలో ఇచ్చారని అంటున్నారు.

ఏపీలో పొత్తులు ఖరారు అయిన తరువాత టీడీపీ జనసేన బీజేపీ ఎక్కడ పోటీ చేస్తాయో కూడా ఫిక్స్ అయిన తరువాత జన అభిప్రాయాన్ని క్రోడీకరించి మరీ ఈ సర్వే చేసినట్లుగా చెబుతున్నారు. ఈ సర్వే ప్రకారం వైసీపీకి 110 నుంచి 115 దాకా సీట్లు వస్తాయని పేర్కొన్నారని టాక్.

ఈ సర్వే నివేదిక ప్రకారం కూటమికి 60 నుంచి 65 దాకా సీట్లు దక్కుతాయని పేర్కొన్నట్లుగా చెబుతున్నారు. అయితే వైసీపీ నేతలు మాత్రం తమకు 130కి పై దాటి సీట్లు వస్తాయని అంటున్నారు. ఏపీలో కూటమికి 50 మించి రావు అన్నది వైసీపీ నేతల ఆలోచనగా ఉంది అని అంటున్నారు.

మరో వైపు చూస్తే ఏపీలో వైసీపీకి రాయలసీమలో బలం చాలా ఉంది అని అంటున్నారు. అలాగే నెల్లూరు ప్రకాశం జిల్లాలలో గతం కంటే సీట్లు తగ్గినా మొత్తం 22 సీట్లలో మెజారిటీ వైసీపీ సొంతం అవుతాయని అంటున్నారు. ఇక గుంటూరు క్రిష్ణా జిల్లాలలో 33 సీట్లు ఉన్నాయి. ఇందులో కూడా టీడీపీకి ఎక్కువ సీట్లు వచ్చినా వైసీపీకి 13 నుంచి 15 దాకా తెచ్చుకుంటుందని అంటున్నారు.

ఉభయ గోదావరి జిల్లాలలో కూటమి సీట్లు అభ్యర్ధుల ఖరారు తరువాత సీన్ మారింది అని అంటున్నారు. మొదట్లో అయితే వైసీపీ సింగిల్ డిజిట్ కే పరిమితం అని అనుకున్నారు. కానీ ఇపుడు మొత్తం 34 సీట్లకు 12 నుంచి 14 దాకా రావచ్చు అని లెక్క కడుతున్నారు. అదే విధంగా చూస్తే ఉత్తరాంధ్రాలో ఉన్న 34 సీట్లలో వైసీపీకి 12 నుంచి 15 దాకా సీట్లు లభిస్తాయని అంటున్నారు. అందులో మెజారిటీ విజయనగరం జిల్లాలో వస్తాయని అంటున్నారు.

ఇక శ్రీకాకుళంలో సీట్ల ప్రకటన తరువాత టీడీపీకి ఇబ్బందులు స్టార్ట్ అయ్యాయని అంటున్నారు. ఓవరాల్ గా చూస్తే మాత్రం రాయలసీమ ఉత్తర కోస్తా దక్షిణ కోస్తా జిల్లాలలో వైసీపీకి 100 దాటి సీట్లు వస్తాయని అంటున్నారు. ఇక కూటమి అభ్యర్ధుల లుకలుకలతో వైసీపీకి మరో పది నుంచి పదిహేను సీట్లు పెరుగుతాయని అంటున్నారు. మొత్తానికి అనేక సర్వేల నివేదిక ఇలా ఉంది. ఇంటెలిజెన్స్ నివేదిక కూడా దాదాపుగా ఇలాగే ఉంది. వైసీపీ మాత్రం 130 ప్లస్ అంటోంది. చూడాలి మరి ఏమి జరుగుతుందో.