Begin typing your search above and press return to search.

ఆర్ 5 జోన్ పై సుప్రీంకు...వైసీపీకి రిలీఫ్ వస్తుందా...?

అమరావతి రాజధాని పరిధిలోని ఆర్ 5 జోన్ అని క్రియేట్ చేసి పేదలకు వైసీపీ ప్రభుత్వం ఇళ్ల పట్టాలు ఇచ్చింది.

By:  Tupaki Desk   |   8 Aug 2023 3:37 PM GMT
ఆర్ 5 జోన్ పై సుప్రీంకు...వైసీపీకి రిలీఫ్ వస్తుందా...?
X

అమరావతి రాజధాని పరిధిలోని ఆర్ 5 జోన్ అని క్రియేట్ చేసి గుంటూర్ క్రిష్ణా జిల్లాలలోని పేదలకు వైసీపీ ప్రభుత్వం ఇళ్ల పట్టాలు ఇచ్చింది. అంతే కాదు శరవేగంగా వారికి ఇళ్ళ నిర్మాణం జరిగేలా చర్యలు చేపట్టింది. ఇటీవల ముఖ్యమంత్రి వైఎస్ జగన్ ఇళ్ళ నిర్మాణానికి శంకుస్థాపన చేశారు. అమరావతి అందరి రాజధాని అని ఎలుగెత్తి చాటారు.

దీని మీద హై కోర్టుకు వెళ్లిన రైతులు అక్కడ విజయం సాధించారు. రాష్ట్ర ప్రభుత్వం తలపెట్టిన ఇళ్ల నిర్మాణం మీద హై కోర్టు స్టే విధించింది. అక్కడ నిర్మాణాలు చేపట్టరాదని ఆదేశించింది. దెంతో వైసీపీ ప్రభుత్వానికి భారీ షాక్ తగిలినట్లు అయింది. దాంతో సుప్రీం కోర్టుకు ప్రభుత్వం వెళ్ళింది.

ఈ కేసు మీద సుప్రీం కోర్టుకు రిజిస్ట్రీ డైరీ నెంబర్‌ను కేటాయించింది. అయితే రాష్ట్ర ప్రభుత్వం పిటిషన్ వేస్తే తమ వాదనలు కూడా వినాలని అమరావతి రైతులు కోరుతున్నారు. ఇప్పటికే వారు సుప్రీంకోర్టులో కెవియట పిటిషన్ దాఖలు చేశారు. దాంతో ఈ కేసు విచారణ ఈ శుక్రవారం కానీ వచ్చే సోమవారం కానీ జరిగే అవకాశం ఉందని అంటున్నారు.

ఈ కేసు విషయంలో వైసీపీ ప్రభుత్వం పట్టుదలగా ఉంది. అమరావతి రాజధానిలో పేదలకు ఇళ్ల స్థలాల విషయంలో కూడా హై కోర్టులో ఊరట దక్కకపోతే సుప్రీం కోర్టుకు వెళ్ళి మరీ సాధించింది. అలా ఇళ్ళ పట్టాల కార్యక్రమం చేపట్టింది. అయితే నాడు ఇళ్ల పట్టాల విషయంలో హై కోర్టు ఇచ్చిన తీర్పు మీద సుప్రీం కోర్టు స్టే ఇచ్చింది. ఈ కేసులో తుది తీర్పునకు అంతా కట్టుబడి ఉండాలని పేర్కొంది.

ఇపుడు చూస్తే అక్కడ ఇళ్ల నిర్మాణాలను ప్రభుత్వం చేపడుతోంది. అయితే ఈ క్రమంలో రాష్ట్ర ప్రభుత్వం మాస్టర్ ప్లాన్ లో మార్పులు చేసింది అని రైతులు ఆరోపిస్తూ హై కోర్టు మెట్లెక్కారు. ఇపుడు సుప్రీం కోర్టులో కూడా వారు అదే పాయింట్ మీద వాదనలు వినిపించనున్నారు. మాస్టర్ ప్లాన్ లో మార్పులు చేయకూడదని రైతుల వాదన.

అంతే కాదు ఆర్ 5 జోన్ ని మాస్టర్ ప్లాన్ ప్రకారం వేరే అవసరాలకు కేటాయించారని అంటున్నారు. పేదలకు అమరావతి రాజధానిలో ఇళ్ల పట్టాలు ఇవ్వాల్సి వస్తే వేరే చోట ఇవ్వవచ్చు అన్నది కూడా ఇంకో పాయింట్. అంతే కాదు ఇతర జిల్లాల వారికి అమరావతిలో ఇళ్ల పట్టాలు ఇచ్చి ఇళ్ళు నిర్మించడం ఏంటి అన్నది రైతుల ప్రధాన ప్రశ్నగా ఉంది.

తాము ఏళ్ల తరబడి భూములు ఇచ్చి అక్కడ అభివృద్ధికి నోచుకోలేదని, కానీ కేవలం ఒక జోన్ ని క్రియేట్ చేసి అక్కడ ఇళ్ల నిర్మాణం పేరిట అభివృద్ధి వారికి చేయడమేంటి అన్నది రైతుల సూటి ప్రశ్నగా ఉంది. ఈ కేసులో అనేక టెక్నికల్ పాయింట్స్ ఉన్నాయి. ప్రభుత్వం మానవీయ కోణం నుంచి ఈ కేసులో వాదించనుంది. పేదలకు అమరావతి రాజధానిలో ఇళ్లు ఇవ్వకూడదా అన్నది ప్రభుత్వం వాదన. మరి ఎవరి వాదన నెగ్గుతుంది అన్నది చూడాలి. అమరావతిలో ఇళ్ల పట్టాలు ఇచ్చి ఇళ్ళ నిర్మాణానికి శ్రీకారం చుట్టిన ప్రభుత్వానికి అనుకూలంగా సుప్రీం కోర్టులో తీర్పు వస్తుందా లేక అమరావతి రైతులు అక్కడ గెలుస్తారా అన్నది చూడాల్సి ఉంది.