Begin typing your search above and press return to search.

''పడుకున్నోళ్లకే టిక్కెట్లు''... మహిళా నేత సంచలన వ్యాఖ్యలు!

ప్రస్తుతం ఎన్నికలకు షెడ్యూల్ విడుదలైన నేపథ్యంలో దాదాపు ప్రతీ పార్టీలోనూ టిక్కెట్ల పంచాయతీ నడుస్తోన్న సంగతి తెలిసిందే

By:  Tupaki Desk   |   8 April 2024 11:30 PM GMT
పడుకున్నోళ్లకే టిక్కెట్లు... మహిళా నేత సంచలన వ్యాఖ్యలు!
X

ప్రస్తుతం ఎన్నికలకు షెడ్యూల్ విడుదలైన నేపథ్యంలో దాదాపు ప్రతీ పార్టీలోనూ టిక్కెట్ల పంచాయతీ నడుస్తోన్న సంగతి తెలిసిందే. ఇప్పటికే అభ్యర్థుల ఎంపిక పూర్తవ్వడం.. ఆయా నియోజకవర్గాలకు వారి వారి పేర్లు కన్ ఫాం చేయడం జరిగిన నేపథ్యంలో... టిక్కెట్లు దక్కని వారు చేస్తున్న వ్యాఖ్యలు, పనులు, తీసుకుంటున్న నిర్ణయాలు వైరల్ గా మారుతున్నాయి!

ఇందులో భాగంగా.. కొంతమంది రెబల్స్ గా మారుతుంటే.. ఇంకొంతమంది పార్టీలు మారుతుంటే.. మరికొంతమంది చాప కింద నీరులా తమ తమ అసంతృప్తి ఎఫెక్ట్ ను ఎన్నికల్లో చూపించే విధంగా ప్రయత్నాలు చేస్తున్నారని అంటున్నారు. అయితే ఈ సమస్య వైసీపీ, టీడీపీ, జనసేన, బీజేపీలతో పాటు కాంగ్రెస్ లోనూ మొదలైందని చెబుతున్నారు. ఈ క్రమంలో తనకు టిక్కెట్ దక్కలేదని కాంగ్రెస్ పార్టీకి చెందిన ఒక మహిళా నేత తీవ్ర వ్యాఖ్యలు చేశారు!

అవును... కాంగ్రెస్ పార్టీ ఎమ్మెల్యే టిక్కెట్లు సీనియర్లకు కాకుండా ఇతరులకు కట్టబెట్టారంటూ ఆ పార్టీ నేతలు ఫైర్ అయ్యారు. ఇందులో భాగంగా తాజాగా రాజమండ్రిలో జరిగిన కాంగ్రెస్ శ్రేణుల ఆత్మీయ సమావేశంలో వారిరువురూ పార్టీపై ఆగ్రహం వ్యక్తం చేశారు. ఈ సందర్భంగా... "వ్యభిచారం చేస్తే సీటిస్తారా?" అంటూ సీతానగరానికి చెందిన మేడిపూడి సూర్యకుమారి చేసిన వ్యాఖ్యలు ఇప్పుడు వైరల్ గా మారాయి.

ఈ సందర్భంగా తమకు టిక్కెట్ దక్కకపోవడంపై స్పందించిన సూర్యకుమారి... తన భర్త, తాను సుమారు 40 సంవత్సరాలుగా కాంగ్రెస్ పార్టీలో ఉన్నట్లు తెలిపారు. ఇదే సమయంలో ఉండవల్లి అరుణ్ కుమార్, కందుల దుర్గేష్, జక్కంపూడి రామ్మోహన్, రవీంద్రల గెలుపు కోసం తామెంతో కృషిచేశామని.. ఈ క్రమంలో 40 ఏళ్లలో సుమారు 40 ఎకరాలు, 100 కాసుల బంగారం అమ్మి పార్టీకి పనిచేశామని వెల్లడించారు.

ఈ సమయంలో... పార్టీకి ఇంకా ఏమి చేస్తే తమకు సీటిస్తారు అని అంటూ... వ్యభిచారం చేస్తే సీటిస్తారా అని ప్రశ్నించారు సూర్యకుమారి. పార్టీకోసం ఇంతకాలంగా కష్టపడుతున్న తమకు కాదని.. వాళ్ల పక్కలో పడుకున్నవారికి సీట్లు ఇచ్చారంటూ తీవ్ర ఆరోపణలు చేశారు. ఈ విషయాన్ని తాను సోనియా గాంధీ, రాహుల్ గాంధీల దృష్టికి తీసుకెళ్తానని వెల్లడించారు. దీంతో... ఈ వ్యాఖ్యలు తీవ్ర సంచలనంగా మారాయి!