స్కిల్ స్కాం మీద అసెంబ్లీలో మాట్లాడని జగన్...ఎందుకంటే...?
అసెంబ్లీలో స్కిల్ స్కాం మీద గంటల పాటు బిగ్ డిబేట్ సాగింది. వైసీపీ మంత్రులు మాజీ మంత్రులు సీనియర్ నేతలు అంతా కలసి ఇది పెద్ద స్కాం అని తేల్చారు.
By: Tupaki Desk | 23 Sept 2023 11:00 AMఅసెంబ్లీలో స్కిల్ స్కాం మీద గంటల పాటు బిగ్ డిబేట్ సాగింది. వైసీపీ మంత్రులు మాజీ మంత్రులు సీనియర్ నేతలు అంతా కలసి ఇది పెద్ద స్కాం అని తేల్చారు. ఎలా చంద్రబాబు ఈ స్కాం లో పాత్ర వహించారో చెప్పారు. కేంద్ర ప్రభుత్వ దర్యాప్తు సంస్థలే ఈ స్కాం ని మొదట తేల్చాయని కూడా గుర్తు చేశారు.
ఈ స్కాం లో ఆధారాలు అన్నీ పక్కాగా ఉన్నాయని కూడా వారు వివరాలతో సహా సభ ముందు పెట్టారు. నిజానికి ఈ స్కాం మీద చర్చకు వైసీపీ ఉత్సాహం చూపించింది. టీడీపీ అయితే సభ నుంచి సస్పెండ్ అయి చర్చకు కలసి రాలేదు.
ఇక చంద్రబాబు అవినీతి మీద ముఖ్యమంత్రి జగన్ అసెంబ్లీలో పవర్ పాయింట్ ప్రజంటేషన్ ఇస్తారని కూడా ప్రచారం సాగింది. తీరా ఏపీలో బర్నింగ్ పాయింట్ గా ఉన్న ఈ స్కాం మీద డిబేట్ జరిగితే జగన్ మాత్రం ఫుల్ సైలెంట్ గా ఉంటూ వచ్చారు. ఆయన అసలు ఏమీ మాట్లాడలేదు.
జగన్ అయితే బాబు అవినీతి మీద చెడుగుడు ఆడుతారు అని కూడా అంతా అనుకున్నారు. ఎంత మంది ఈ స్కాం మీద మాట్లాడినా కూడా జగన్ స్పీచ్ ఉంటే ఆ కిక్కే వేరు అన్నది కూడా వైసీపీ తో సహా అంతా అంటారు. పైగా బ్యాడ్ ఫ్రైడే గా చంద్రబాబుకు మిగిలింది.
ఏపీ హై కోర్టులో క్వాష్ పిటిషన్ ని కొట్టివేశారు. అలాగే ఏసీబీ కోర్టు అయితే సీఐడీ కస్టడీకి ఇచ్చింది. దీంతో జగన్ స్పీచ్ లో మెరుపులు సిక్సర్లు, భార్తీ షాట్స్ ఉంటాయని అంతా ఆశించారు. కానీ జగన్ ఫుల్ సైలెంట్. ఎందుకిలా అంటే ఆయనకు వైరల్ ఫీవర్ అని అంటున్నారు.
గత మూడు రోజులుగా జగన్ వైరల్ ఫీవర్ తోనే ఉన్నారని అంటున్నారు. మంత్రివర్గ సమావేశం కూడా అలాగే నిర్వహినారని, తరువాత రెండు రోజుల పాటు జరిగిన అసెంబ్లీలో కూడా జగన్ చాలా కామ్ గా కూర్చుండిపోయారని అంటున్నారు. ఇక బాబు క్వాష్ పిటిషన్ ని హై కోర్టు కొట్టేసింది అన్న న్యూస్ బ్రేకింగ్ గా వస్తే ఆ ఇంఫర్మేషన్ కూడా ఆర్ధిక మంత్రి బుగ్గనకు ఇచ్చి ఆయనతోనే మాట్లాడించారని అంటున్నారు.
ఇక శని, ఆదివారాలు అసెంబ్లీకి సెలవు, దాంతో జగన్ ఫుల్ రెస్ట్ మోడ్ లో ఉన్నారు. సోమవారం నాటికి ఆయన వైరల్ ఫీవర్ జలుబు, దగ్గు వంటివి తగ్గుతాయని అంటున్నారు. దాంతో బాబు హయాంలో జరిగిన మరిన్ని స్కాముల చిట్టాను ఆయన సభ ముందు ఉంచి ధీటైన స్పీచ్ ఇస్తారని తెలుస్తోంది.
ముఖ్యంగా ఫైబర్ నెట్ స్కాం లో ఎవరి హస్తాలు ఉన్నాయో కూడా వివరించే ప్రయత్నం చేస్తారు అంటున్నారు. ఏది ఏమైనా ఈ అసెంబ్లీలో జగన్ స్పీచ్ ఉండాలని ఇంతటి కీలకమైన వేళ ఏపీ అంతా హీటెక్కిపోతున్న వేళ జగన్ మాట్లాడితే ఆ లెక్కే వేరు అని అంటున్నారు. సో జగన్ స్పీచ్ కోసం అంతా వెయింటింగ్ ఇక్కడ అంటున్నారు.