కరెక్ట్ టైం లో అలెర్ట్ అంటున్న జగన్!
వైసీపీ అధినేత జగన్ క్యాడర్ ని అలెర్ట్ చేసే పనిలో పడ్డారు.
By: Tupaki Desk | 30 Oct 2023 8:15 AM ISTవైసీపీ అధినేత జగన్ క్యాడర్ ని అలెర్ట్ చేసే పనిలో పడ్డారు. మార్చిలో ఎన్నికల నోటిఫికేషన్ వస్తుంది అంటే కచ్చితంగా 150 రోజుల కంటే ఎక్కువ అవకాశం లేదు. ఈ విషయం అందరికీ తెలుసు. అధికార పార్టీకి ఇంకా బాగా తెలుసు అని అంటున్నారు. అందువల్లనే జగన్ పార్టీని ఎన్నికల దిశగా నడిపించే ప్రయత్నం చేస్తున్నారు.
ఈ నెల 31న మొత్తం 175 నియోజకవర్గాలకు చెందిన వైసీపీ ఎమ్మెల్యేలు, పార్టీ ఇంచార్జిలతో వైసీపీ కీలక సమావేశాన్ని ఏర్పాటు చేసినట్లుగా తెలుస్తోంది. ఈ సమావేశంలో ఏపీలో 2023 ఓటర్ల ముసాయిదా జాబితా గురించి ప్రధానంగా చర్చిస్తారు అని అంటున్నారు. వైసీపీ ఓటర్లు సానుభూతిపరులు ఉన్నారా లేదా అన్నది ఒకటికి పది సార్లు చెక్ చేసుకోవడం మీద క్యాడర్ కి దిశా నిర్దేశం చేస్తారని అంటున్నారు
ఓట్లు ఏమైనా మిస్ అయితే ఆయా నియోజకవర్గం ఇంచార్జిలు బూత్ లెవెల్ వారీగా వాటిని తనిఖీ చేసి మధింపు చేసుకుని తిరిగి చేర్పించే పని చేయాలని పార్టీ సూచిస్తోంది అని అంటున్నారు దీంతో పాటుగా పార్టీ యంత్రాంగం మొత్తాన్ని ఇక మీదట మైక్రో లెవెల్ దాకా తీసుకెళ్ళే ప్రక్రియకు కూడా ఇదే సమావేశంలో శ్రీకారం చుడతారు అని అంటున్నారు.
ప్రతీ నియోజకవర్గాన్ని ఒక యూనిట్ గా తీసుకుని డైరెక్ట్ గా పార్టీ కేంద్ర కార్యాలయంతో అనుసంధానం చేయడం ద్వారా ఎప్పటికప్పుడు అలెర్ట్ చేయడం జరుగుతుంది అని అంటున్నారు. దీని వల్ల డైలీ పార్టీ యాక్టివిటీస్ ని పరుగులు పెట్టించడం జరుగుతుందని అంటున్నారు. అలాగే బూత్ లెవెల్ నుంచి స్టేట్ పార్టీ ఆఫీస్ దాకా కనెక్షన్ ఉండేలా చూసుకోవడం కూడా జరుగుతుంది అని అంటున్నారు.
ప్రతీ నియోజకవర్గానికి పార్టీ బాధ్యులను నియమిస్తారు అని అంటున్నారు. ఇప్పటిదాకా చూసుకుంటే రీజనల్ కో ఆర్డినేటర్లు, జిల్లా ప్రెసిడెంట్లు ఉంటూ వచ్చారు. ఇపుడు అసెంబ్లీ సెగ్మెంట్ల స్థాయిలో కూడా పార్టీ కో ఆర్డినేటర్లు వస్తారని అంటున్నారు. వీరు ఆయా అసెంబ్లీ సెగ్మెంట్లలో పార్టీని మొత్తం కో ఆర్డినేట్ చేస్తూ హై కమాండ్ ఇచ్చిన ఆదేశాలను తు చ తప్పకుండా అమలు చేసే పనిలో ఉంటారని అంటున్నారు.
అదే విధంగా ప్రతీ అసెంబ్లీ నియోజకవర్గంలో పార్టీ ఆఫీస్ ని ఏర్పాటు చేస్తారు. ఇప్పటిదాకా ఆయా ఎమ్మెల్యేలు ఇంచార్జిలు ఏర్పాటు చేసుకునేవారు. వర్గ పోరు ఉంటే కొందరు నాయకులు అటు వైపు చూసే పరిస్థితి ఉండేది కాదు. ఇపుడు అలా కాకుండా వైసీపీ ఆఫీస్ అంటే అందరికీ ఎంట్రీ ఉండేలా దీన్ని ఏర్పాటు చేస్తున్నారు అని అంటున్నారు. అదే విధంగా కంట్రోల్ రూం తరహలో ఈ ఆఫీస్ పనిచేసే విధంగా చర్యలు తీసుకుంటారని అంటున్నారు.
ప్రతీ నియోజకవర్గానికి చెందిన సమాచారం పార్టీ సెంట్రల్ ఆఫీస్ కి ఎప్పటికపుడు చేరడమే కాదు పై స్థాయి ఆదేశాలు కూడా గ్రౌండ్ లెవెల్ లో అమలు అయ్యేలా కూడా చర్యలు తీసుకుంటారని తెలుస్తోంది. మొత్తం మీద చూస్తే ఎన్నికలకు సర్వ సన్నద్ధం అయినట్లుగానే వైసీపీ ఈ తరహా సెటప్ ని రెడీ చేస్తోంది అని అంటున్నారు.
ఇప్పటి నుంచే దూకుడుగా వెళ్లడం ద్వారా జనంతో డైరెక్ట్ గా కనెక్ట్ అవడం ద్వారా అపోజిషన్ పార్టీలకు ఎక్కడా చాన్స్ ఇవ్వకూడదన్నదే వైసీపీ వ్యూహం అని అంటున్నారు. ఈసారి ఎన్నికల్లో వైసీపీ నమ్ముకుంది పూర్తి పాజిటివ్ ఓటునే. దాంతో నూటికి ఎనభై శాతం పాజిటివ్ ఓటింగ్ ఉందని, అదంతా తమకు టోటల్ గా టర్న్ అవుతుందని మరోసారి భారీ విక్టరీ కొడతామని వైసీపీ భావిస్తోంది. దానికి తగినట్లుగా పార్టీని మొత్తానికి కదిలించడానికే ఈ విప్లవాత్మకమైన చర్యలకు దిగుతోంది అని అంటున్నారు.
