Begin typing your search above and press return to search.

జగన్ అండర్ ప్లే పాలిటిక్స్ తో విపక్షాలకు కొత్త రిస్క్ ....!

వైసీపీ అధినేతగా ముఖ్యమంత్రిగా కూడా ఉన్న వైఎస్ జగన్ పక్కా ప్లాన్ తో దూసుకెళ్తున్నారు.

By:  Tupaki Desk   |   25 Oct 2023 3:30 AM GMT
జగన్  అండర్ ప్లే  పాలిటిక్స్ తో విపక్షాలకు కొత్త రిస్క్ ....!
X

వైసీపీ అధినేతగా ముఖ్యమంత్రిగా కూడా ఉన్న వైఎస్ జగన్ పక్కా ప్లాన్ తో దూసుకెళ్తున్నారు. విపక్షం కంటే ముందే జనంలోకి తన సైన్యాన్ని పంపిస్తున్నారు. నిజం చెప్పాలంటే గత రెండేళ్ళుగా ఆయన ఏపీలోని నాలుగు కోట్ల కుటుంబాల గడపనతో డైరెక్ట్ కనెక్షన్ పెట్టుకున్నారు. గడప గడపకు వైసీపీ ప్రభుత్వం అన్నది అందులో భాగమే.

ఇక వై నాట్ 175 అన్న నినాదంతో మరోసారి జనాలకు తమ పార్టీని పంపించారు. ఇక ఇపుడు సామాజిక బస్సు యాత్ర పేరుతో వైసీపీ వైపు ఉన్న వర్గాలను పటిష్టం చేసుకునే కొత్త ఎత్తుగడకు తెర తీశారు. ఇది రాష్ట్ర స్థాయి నుంచి గ్రామ స్థాయి వరకూ సాగుతుంది. మంత్రి నుంచి వార్డు మెంబర్ దాకా ఇందులో ఇన్వాల్వ్ అవుతున్నారు.

ఒక విధంగా చెప్పాలంటే పార్టీ మొత్తం కదులుతుంది. అలా డిజైన్ చేసిన ప్రోగ్రాం ఇది. విపక్షాల చేస్తున్న ప్రయత్నాలు యాత్రలు జనరలైజ్ చేస్తూ సాగుతూంటే వైసీపీ పక్కాగా కొన్ని సెక్షన్లను టార్గెట్ చేస్తూ ముందుకు సాగడంతోనే వైసీపీ అధినేత వ్యూహం ఏంటో తెలుస్తోంది అని అంటున్నారు.

ఈ నెల 26 నుంచి ఏపీ వ్యాప్తంగా వైసీపీ సామాజిక బస్సు యాత్ర మొదలవుతోంది. ఇక ఏపీలో ఈ బస్సు యాత్రను మూడు ప్రాంతాలలో ఒకేసారి ప్రారంభిస్తున్నారు. ఉత్తరాంధ్రా నుంచి శ్రీకాకుళం జిల్లాలో మూలన ఉన్న ఇచ్చాపురంలో ఈ బస్సు యాత్ర సాగనుంది. అలాగే కోస్తా జిల్లాలలో ఈ బస్సు యాత్ర తెనాలి నుంచి, రాయలసీమలో అనంతపురం జిల్లాలోని సింగనమల నుంచి మొదలవుతుంది.

ప్రతీ రోజూ ఒక్కో రీజియన్ లో ఒక్కో మీటింగ్ వంతున మూడు మీటింగ్స్ మూడు ప్రాంతాలలో సమాంతరంగా సాగుతాయి. అంటే రోజుకు మూడు వంతున అరవై రోజులలో ఈ సామాజిక బస్సు యాత్ర పూర్తి అయ్యేలా షెడ్యూల్ చెశారు. సెలవులు పండుగలు పక్కన పెడితే ఈ ఏడాది డిసెంబర్ 31తో ఈ బస్సు యాత్ర పూర్తి అయ్యేలా కూడా రూపకల్పన చేశారు.

ఈ బస్సు యాత్ర పూర్తి అయ్యేనాటికి బలమైన వర్గాలు నూటికి తొంబై శాతం ఉండే వర్గాలతో డైరెక్ట్ కనెక్షన్ వైసీపీకి ఏర్పడే విధంగా యాక్షన్ ప్లాన్ రూపొందించారు అన్న మాట. ఈ బస్సు యాత్రలో మంత్రుల నుంచి వార్డు మెంబర్ దాకా వారే సారధులు. ప్రతీ చోట లోకల్ లీడర్స్ ని ముందున పెడుతూ అందరినీ ఒక్కటిగా చేస్తూ పార్టీ ఫస్ట్ అన్నట్లుగా చెబుతూ సాగే ఈ సందేశ యాత్ర వైసీపీకి అతి ముఖ్య యాత్ర, బలోపేతం చేసే యాత్రగా చెబుతున్నారు. ఈ యాత్ర పూర్తిగా పాజిటివ్ మోడ్ లో సాగనుంది.

అంటే తాము అయిదేళ్ల కాలంలో చేసిన అభివృద్ధినే చెబుతూ సాగుతుంది అన్న మాట. ప్రత్యర్ధుల మీద విమర్శలు ఉండవు, మేము ఫలానా పని చేశామని చెప్పుకోవడం వల్ల పాజిటివ్ ఓటింగ్ రెట్టింపు అవుతుంది అన్నదే వైసీపీ ఆలోచన అంటున్నారు. ఏది ఏమైనా వైసీపీ సామాజిక బస్సు యాత్ర ఏపీ పాలిటిక్స్ లో అండర్ ప్లే చేస్తూ సాగనుంది. ఓవర్ ప్లే చేస్తూ సాగే రాజకీయాల వల్ల రాజకీయ లాభం తక్కువ ప్రచారం ఎక్కువ. అండర్ ప్లే పాలిటిక్స్ తో వైసీపీ తాను అనుకున్న లక్ష్యాన్ని రీచ్ కావడం కోసమే ఇలా చేసింది అని అంటున్నారు. చూడాలి మరి ఈ నెల 26 నుంచి వైసీపీ బస్సు యాత్ర ఏ తీరున సాగనుందో.