Begin typing your search above and press return to search.

జగన్ కంటే ముందు అక్కడకి...!

విశాఖలో మకాం అని వైసీపీ అధినేత వైఎస్ జగన్ ఊరిస్తున్నారు. అది బహుశా అక్టోబర్ నెలలో నెరవేరవచ్చు అని వైసీపీ వర్గాలు అంటున్నాయి.

By:  Tupaki Desk   |   3 Sept 2023 3:29 PM
జగన్ కంటే ముందు అక్కడకి...!
X

విశాఖలో మకాం అని వైసీపీ అధినేత వైఎస్ జగన్ ఊరిస్తున్నారు. అది బహుశా అక్టోబర్ నెలలో నెరవేరవచ్చు అని వైసీపీ వర్గాలు అంటున్నాయి. అక్టోబర్ లో విజయదశమి వేళ జగన్ విశాఖ ఇంటి వారు అవుతారు అని అంటున్నారు. రుషికొండ వద్ద జగన్ క్యాంప్ ఆఫీసు కోసం ఆ సమీపంలోనే ఆయన నివాసం కోసం భవనాలు సిద్ధం అవుతున్నాయని తెలుస్తోంది.

ఈలోగా విశాఖ నడిబొడ్డున ఉన్న వైసీపీ జిల్లా పార్టీ ఆఫీస్ రుషికొండ వైపునకు తరలిపోయింది. జగన్ కంటే ముందే పార్టీ ఆఫీసుని అక్కడ ఏర్పాటు చేయడం ద్వారా సీఎం రాక ఖాయమని పార్టీ వర్గాలు సంకేతాలు ఇస్తున్నాయి.

పార్టీ కేంద్ర కార్యాలయం కూడా తాడేపల్లి నుంచి రుషికొండకు తరలివస్తుందని అంటున్నారు. దాని కోసం కొద్ది నెలల క్రితం భూమి పూజ చేసి నిర్మాణ పనులు ప్రారంభించారు. అది నిర్మాణ దశలో ఉండగానే విశాఖ పార్టీ ఆఫీసుని అక్కడకు షిఫ్ట్ చేస్తున్నారు.

ఇక మీదట విశాఖ వైసీపీ కార్యకలాపాలు అన్నీ కూడా అక్కడ నుంచే జరుగుతాయని అంటున్నారు. ఉత్తరాంధ్రా వైసీపీ ఇంచార్జి వైవీ సుబ్బారెడ్డి సైతం మధురవాడలో నివాసం ఉంటారని అంటున్నారు. విశాఖ శివారు ప్రాంతం అంతా ఇపుడు వైసీపీ రాజకీయ హడావుడితో కొత్త సందడి చేయనుంది అని అంటున్నారు ముఖ్యమంత్రి జగన్ కనుక మకాం విశాఖకు మారుస్తే పూర్తి స్థాయిలో వైసీపీ రాజకీయ హడావుడి కనిపిస్తుంది అంటున్నారు. ఈ మొత్తం ప్రాంతం అంతా భీమిలీ నియోజకవర్గం పరిధిలో ఉండడం విశేషం.