Begin typing your search above and press return to search.

సెంటిమెంట్ కు తగ్గట్లే సోదరీమణుల అభిమానంతో జగన్ ఉక్కిరిబిక్కిరి

సెంటిమెంట్ కు శుభసూచకం జత కలిస్తే.. ఇప్పుడు అలాంటి సీన్ ఒకటి ఉమ్మడి తూర్పు గోదావరి జిల్లాలో చోటు చేసుకుంది.

By:  Tupaki Desk   |   31 Aug 2023 12:46 PM IST
సెంటిమెంట్ కు తగ్గట్లే సోదరీమణుల అభిమానంతో జగన్ ఉక్కిరిబిక్కిరి
X

సెంటిమెంట్ కు శుభసూచకం జత కలిస్తే.. ఇప్పుడు అలాంటి సీన్ ఒకటి ఉమ్మడి తూర్పు గోదావరి జిల్లాలో చోటు చేసుకుంది. ఏపీ ముఖ్యమంత్రి వైఎస్ జగన్మోహన్ రెడ్డి తాజాగా జరిపిన పర్యటన సందర్భంగా చోటు చేసుకున్న ఉదంతం అందరి నోట చర్చనీయాంశంగా మారింది. విపక్షాలు తనపై తీవ్రస్థాయిలో విరుచుకుపడుతున్నా.. క్షేత్ర స్థాయిలో తన మీద అభిమానం ఇసుమంత కూడా తగ్గలేదన్న విషయం తాజా పరిణామాన్ని చూస్తే అర్థమవుతుంది.

ఏపీ సీఎం జగన్ కు తూర్పు సెంటిమెంట్ ఎక్కువని చెబుతారు. తాను ప్రారంభించే కార్యక్రమం ఏదైనా.. వీలైనంతవరకు ఉమ్మడి తూర్పు గోదావరి జిల్లాకే ప్రాధాన్యత ఇవ్వటం కనిపిస్తుంది. అందుకు తగ్గట్లే ఆ జిల్లాకు చెందిన వారు జగన్ పట్ల ప్రత్యేక అభిమానాన్ని ప్రదర్శిస్తారు. తాజాగా కాకినాడ జిల్లా జగ్గంపేట మండలం ఇరుపాక వివాహ కార్యక్రమానికి హాజరైన సీఎం జగన్ ను చూసిన మహిళామణులు.. తాము రాఖీ కడతామని కోరారు.

వారి అభిమానాన్ని కాదనలేని జగన్.. అక్కడున్న మహిళలందరి చేత ఓపిగ్గా కూర్చొని రాఖీలు కట్టించుకున్నారు. ఈ సందర్భంగా అక్కడ హడావుడి నెలకొంది. ఒకరి తర్వాత ఒకరు చొప్పున రాఖీలు కట్టేస్తున్న వేళ.. టైం గడుస్తున్నకొద్దీ.. ఓపిగ్గా రాఖీలు కట్టించుకోవటం అందరిని ఆకర్షించింది. లేట్ అయిపోతుందన్న ఉద్దేశంతో కొందరు మహిళలు తొందరపడుతుంటే.. వారిని హడావుడి వద్దని చెబుతూ.. నెమ్మది తల్లీ.. పడిపోతారంటూ వారందరి చేత రాఖీలు కట్టించుకున్నారు. దీంతో.. అక్కడి మహిళల ఆనందానికి అంతు లేకుండా పోయింది. ముఖ్యమంత్రికి స్వయంగా రాఖీలు కట్టిన వైనాన్ని వారు తెగ ఆనందపడిపోతున్నారు.