Begin typing your search above and press return to search.

ఏపీలో ఆ పార్టీతో బీఆర్ఎస్ పొత్తు... !

సీఎం కేసీఆర్ ఇత‌ర రాష్ట్రాల్లోనూ త‌మ పార్టీని పుంజుకునేలా చేస్తామ‌ని చెప్పారు.

By:  Tupaki Desk   |   29 July 2023 1:30 AM GMT
ఏపీలో ఆ పార్టీతో బీఆర్ఎస్ పొత్తు... !
X

మ‌రో 8 మాసాల్లో ఏపీ లో అసెంబ్లీ ఎన్నిక‌లు జ‌ర‌గ‌నున్నాయి. ఏపీ లో ఉన్న ప్ర‌ధాన పార్టీల్లో నాయ‌కులు స్టిక్ ఆన్ అయి ఉన్నారు. ఒక‌వేళ వారు కాద‌న్నా..పోటీకి నాయ‌కులు కూడా రెడీగానే ఉన్నారు. ఇక ఎటొచ్చీ.. అదృష్టం ప‌రిశీలించుకోవాల‌ని భావిస్తున్న‌వారికి వైసీపీ, టీడీపీల‌ లో చోటు ద‌క్కే అవ‌కాశం లేదు. దీంతో వారు జ‌న‌సేన వైపు చూస్తున్నారు. కానీ, ఈ పార్టీలోనూ ఇప్పటి వ‌ర‌కు టికెట్ల ప్ర‌స్తావ‌న లేదు.అస‌లు ఆ ఊసే జ‌న‌సేన అధినేత ప‌వ‌న్ క‌ళ్యాణ్ తెర‌మీదికి తేవ‌డం లేదు.

దీంతో వ‌చ్చే ఎన్నిక‌ల్లో పోటీ చేయాల‌ ని భావిస్తున్న కొంద‌రు నాయ‌కులు పొరుగు పార్టీల‌ పై ఆశ‌లు పెట్టుకున్నారు. ముఖ్యంగా మైనారిటీ వ‌ర్గాల నుంచి నాయ‌కులు .. గ‌త ఐదేళ్ల కాలం లో ఎక్కువ‌గా త‌యార‌య్యారు. కానీ, వీరికి స‌రైన వేదిక‌లే ల‌భించ‌డం లేద‌నే టాక్ వినిపిస్తోంది. ఈ నేప‌థ్యంలో ఇలాంటివారు.. హైద‌రాబాద్కు చెందిన ఎంఐఎం పై దృష్టి పెట్టారు. రాష్ట్రం లోని మైనారిటీ ప్ర‌భావిత నియోజ‌క‌వ‌ర్గాల్లో ఎంఐఎం పోటీ చేస్తే.. తాము రెడీ అంటూ.. సంకేతాలు కూడా పంపిస్తున్నారు.

ఇక‌, స‌రిహ‌ద్దు జిల్లాల్లోనూ కొంద‌రు నాయ‌కులు రెడీ గానే ఉన్నారు. అయితే, వీరికి కూడా సేమ్ స‌మ‌స్య ఎదుర‌వుతోంది. దీంతో వారు కూడా ఏదైనా పార్టీ త‌మ‌ కు ఆశ్ర‌యం ఇవ్వ‌క‌పోతుందా.. టికెట్‌ద‌క్క‌క పోతుందా? అని ఎదురు చూస్తున్నారు. ఇలాంటి వారు బీఆర్ఎస్‌ పై ఆశ‌లు పెట్టుకున్నారు. జాతీయ పార్టీగా అవ‌త‌రించిన త‌ర్వాత‌.. సీఎం కేసీఆర్ ఇత‌ర రాష్ట్రాల్లోనూ త‌మ పార్టీని పుంజుకునేలా చేస్తామ‌ని చెప్పారు. ఏపీ లోనూ స‌భ‌లు పెడ‌తామ‌ని సంకేతాలు ఇచ్చారు.

దీంతో నాయ‌కులు బీఆర్ఎస్ వైపు చూస్తున్నారు. కానీ, ఇప్ప‌టి వ‌ర‌కు దీనికి సంబంధించిన సంకేతాలు రాలేదు. ఎంఐఎం కూడా జాతీయ రాజ‌కీయాల‌ పైనే ఎక్కువ‌గా దృష్టి పెట్టింది. ఏపీలో ఈ రెండు పార్టీలు పోటీకి దిగితే.. మెజారిటీ నాయ‌కులు టికెట్లు ద‌క్కించుకునేందుకు రెడీ గానే ఉన్నారు. ఆర్థికంగా కూడా బ‌లంగా ఉన్న నాయ‌కులు... ఈ పార్టీలు ఎప్పుడెప్పుడు అడుగు వేస్తాయా? అని ఎదురు చూస్తున్నారు. కానీ.. ఆ రెండు పార్టీలు కూడా మొద‌ట్లో ఊపు చూపించినా.. ఇప్పుడు మాత్రంమౌనంగా ఉండ‌డం గ‌మ‌నార్హం.