Begin typing your search above and press return to search.

సెప్టెంబర్ మూడవ వారంలో ఏపీ అసెంబ్లీ....కీలక బిల్లులుంటాయా...?

ఏపీ అసెంబ్లీ సమావేశాలు జరిగి దాదాపుగా ఆరు నెలలకు దగ్గర అవుతోంది. మార్చిలో జరిగిన బడ్జెట్ మీటింగ్ తరువాత అసెంబ్లీ సమావేశం కాలేదు.

By:  Tupaki Desk   |   31 Aug 2023 10:51 AM GMT
సెప్టెంబర్ మూడవ వారంలో ఏపీ అసెంబ్లీ....కీలక బిల్లులుంటాయా...?
X

ఏపీ అసెంబ్లీ సమావేశాలు జరిగి దాదాపుగా ఆరు నెలలకు దగ్గర అవుతోంది. మార్చిలో జరిగిన బడ్జెట్ మీటింగ్ తరువాత అసెంబ్లీ సమావేశం కాలేదు. రాజ్యాంగం ప్రకారం చూస్తే ఆరు నెలలకు ఒకసారి చట్ట సభలు సమావేశం కావాల్సి ఉంది. దీంతో సెప్టెంబర్ మూడవ వారంలో ఏపీ అసెంబ్లీ సమావేశాలు జరగనున్నాయని అంటున్నారు.

జగన్ విదేశీ పర్యటన సెప్టెంబర్ మొదటి వారంలో ఉంది. పది రోజుల పాటు జగన్ ఏపీలో ఉండరు. ఆయన వచ్చిన తరువాత వెంటనే మంత్రివర్గ సమావేశం నిర్వహిస్తారని అంటున్నారు. ఆ సమావేశంలోనే అసెంబ్లీ వర్షాకాల సమావేశాలు ఎపుడు నిర్వహించాలన్న దాని మీద ఒక నిర్ణయం తీసుకుంటారు అని అంటున్నారు.

ఇదిలా ఉండగా ఈసారి అసెంబ్లీ సమావేశాలలో పలు కీలక బిల్లులు ప్రవేశపెట్టే అవకాశాలు ఉన్నాయని అంటున్నారు. ఎందుకంటే వీలైతే వర్షాకాల సమావేశాలు ఆ మీదట ఓటాన్ అకౌట్ బడ్జెట్ కోసం అసెంబ్లీ సమావేశం కావడం తప్ప వేరే అవకాశాలు ఉండవు. ఓటాను అకౌంట్ సమావేశాలు అంటే ఎన్నికలు ముంచుకొచ్చినట్లే. అందువల్ల ఏవైనా బిల్లులు ఆమోదం పొందాలన్నా ఎన్నికల వేళ ప్రజల కోసం ఏమైనా నిర్ణయాలు తీసుకోవాలన్నా ఈ సమావేశాల్లోనే చేయాలి.

దాంతో ఆ విషయాలు కూడా మంత్రివర్గ సమావేశంలో చర్చిస్తారు అని తెలుస్తోంది. మూడు రాజధానులకు సంబంధించిన కేసు సుప్రీం కోర్టులో ఉంది. డిసెంబర్ వరకూ ఈ కేసు విచారణ వాయిదా పడిన నేపధ్యంలో ఆ దిశగా ఏమైనా చేసేందుకు ప్రభుత్వానికి వీలు లేదు అని అంటున్నారు. ఇక ముఖ్యమంత్రి విశాఖకు మకాం మార్చడం అన్నది పెండింగులో ఉంది. ఈ ఏడాది విజయదశమి నుంచి సీఎం విశాఖలోనే ఉంటారు అని అంటున్నారు.

క్యాంప్ ఆఫీస్ కూడా ఆయన విశాఖలో ఏర్పాటు చేసుకుంటారు అని అంటున్నారు. దాంతో ఈ విషయం మీద ఏమైనా అసెంబ్లీ సమావేశాలలో క్లారిటీ ఇచ్చే అవకాశాలు అయితే ఉన్నాయని అంటున్నారు. ఇంకో వైపు చూస్తే అసెంబ్లీ ఈ సారి అయిదారు రోజుల పాటు మాత్రమే నడిచే వీలుందని అంటున్నారు. ఇక శీతాకాల సమావేశాలు పెడితే డిసెంబర్ లో పెడతారు. లేకపోతే నేరుగా ఓటాను అకౌంట్ కోసం బడ్జెట్ సెషన్ మార్చిలో నిర్వహిస్తారు.

అయిదేళ్ల వైసీపీ ప్రభుత్వానికి ఎటు చూసినా ఏదైనా చట్టం చేయాలన్న ఈ సమావేశాలు అత్యంత కీలకంగా మారనున్నాయి. దాంతో జగన్ విదేశీ పర్యటన తరువాత అసెంబ్లీ మీట్ విషయంలో కూలంకషంగా చర్చించి ఫైనల్ డెసిషన్ తీసుకుంటారు అని అంటున్నారు. గత రెండేళ్ళుగా అసెంబ్లీకి హాజరు కాని చంద్రబాబు ఈసారి కూడా రాకపోవచ్చు. మొత్తం మీద చూస్తే అతి పెద్ద మెజారిటీతో గెలిచిన వైసీపీ అయిదేళ్ళ జమానాలో ఈసారి సమావేశాలు చాలా స్పెషల్ అని చెప్పాల్సి ఉంటుంది.