'గిన్నీస్ రికార్డు' లక్ష్యంగా చంద్రబాబు అడుగులు..!
ఏపీ సీఎం చంద్రబాబు లక్ష్యాలు.. వ్యూహాలు ప్రపంచ స్థాయికి చేరుతున్న విషయం తెలిసిందే. ఆయన వేసే ప్రతి అడుగు కూడా ప్రపంచ స్థాయిలోనే ఉంటోంది.
By: Tupaki Desk | 30 May 2025 4:15 PM ISTఏపీ సీఎం చంద్రబాబు లక్ష్యాలు.. వ్యూహాలు ప్రపంచస్థాయికి చేరుతున్న విషయం తెలిసిందే. ఆయన వేసే ప్రతి అడుగు కూడా ప్రపంచస్థాయిలోనే ఉంటోంది. ఈ క్రమంలో అమరావతి రాజధాని ప్రపంచస్థా యి నగరంగా మారుతోంది. పెట్టుబడులు, పారిశ్రామికీకరణ వంటివి కూడా ప్రపంచ స్థాయిలోనే ఉంటున్నాయి. ఇప్పుడు తాజాగా మరో ప్రపంచ స్థాయి కార్యక్రమానికి శ్రీకారం చుట్టారు. అది కూడా గిన్నీస్ రికార్డు ను సాధించాలన్న లక్ష్యంతో ముందుకు సాగుతున్నారు.
అదే.. అంతర్జాతీయ యోగా దినోత్సవం. వచ్చే జూన్ 21న నిర్వహించే యోగాకు.. ఏపీ ఆతిథ్యమిస్తున్న విషయం తెలిసిందే. అంతర్జాతీయ యోగా దినోత్సవానికి ప్రధాని నరేంద్ర మోడీ సహా.. పలు దేశాల దౌత్యాధికారులు, రాయబారులు కూడా రానున్నారు. ఈ నేపథ్యంలో ఈ కార్యక్రమం ద్వారా ఏపీని ప్రపంచం లోనే అగ్రస్తానంలో నిలబెట్టేలా చంద్రబాబు ప్రయత్నాలు చేస్తున్నారు. మహానాడులోనూ ఈ విషయం ఆయన చెప్పుకొచ్చారు. ఇదిలావుంటే.. ఇప్పుడు ఈ కార్యక్రమాన్ని గిన్నీస్‌లో ఎక్కేలా ప్లాన్ ప్రకారం చేస్తున్నారు.
అంతర్జాతీయ యోగా దినోత్సవాన్ని జూన్ 21న విశాఖలో నిర్వహించాలని నిర్ణయించారు. ఆర్కే బీచ్‌లో సుమారు 5 లక్షల మందికిపైగా ఆధ్వర్యంలో నిర్వహించే ఈ యోగాకు అత్యంత ప్రాధాన్యంఇస్తున్న సీఎం చంద్రబాబు.. దీనిని గిన్నీస్ రికార్డుల్లో చేర్చేలా ప్రయత్నం చేస్తారు. అంతేకాదు.. ప్రధాని మోడీ సొంత రాష్ట్రం గుజరాత్‌లోని సూరత్‌లో నిర్వహించిన యోగా సందర్భంగా లక్షా 9 వందల మంది ఒకసారి పాల్గొ న్నారు. ఈ రికార్డు సహా.. అన్ని రికార్డులను అధిగమించాలని ప్రయత్నిస్తున్నారు.
దీనిలో భాగంగానే యోగాకు 5 లక్షల మందిని ఆహ్వానిస్తున్నారు. అంతేకాదు.. ప్రపంచ స్థాయిలో దీనిని నిర్వహించి.. గిన్నీస్ రికార్డును సొంతం చేసుకునేందుకు వీలుగా ఏర్పాట్లు చేస్తున్నారు. ఈ నేపథ్యంలోనే ఈవెంట్లను ఘనంగా నిర్వహించడంలో అనుభవం ఉన్న సంస్థలకు ప్రభుత్వం ఆహ్వానం పలికింది. వీరికి టెండర్లను ఇచ్చి.. యోగాను అంతర్జాతీయ స్థాయిలో నిర్వహించి.. గిన్నీస్ బుక్‌లో రికార్డు సృష్టించా లని.. తద్వారా ఏపీని అంతర్జాతీయ మ్యాప్‌లో అందరూ గుర్తుంచుకునేలా చేయాలని భావిస్తున్నారు.
