ఆగస్టులో స్థానిక ఎన్నికలకు ముహూర్తం ?
ఇదిలా ఉంటే రాష్ట్ర ఎన్నికల అధికారి నీలం సాహ్ని పదవీ కాలం ఈ నెలాఖరుతో పూర్తి అవుతుంది. దాంతో ఆమె ప్లేస్ లో కొత్త ఎన్నికల అధికారిగా నీరభ్ కుమార్ ప్రసాద్ కి అవకాశం ఇస్తారని ప్రచారం సాగుతోంది.
By: Satya P | 7 March 2026 7:00 AM ISTఏపీలో టీడీపీ కూటమి ప్రభుత్వం స్థానిక సంస్థల ఎన్నికలను ఆగస్టు నెలలో నిర్వహించేందుకు ఆలోచిస్తోంది అని ప్రచారం సాగుతోంది. దానికి రాజకీయ వ్యూహాలు ఇతర కారణాలు ఉన్నాయని అంటున్నారు. ముందుగా రాజకీయ కారణాలు తీసుకుంటే మునిసిపలి కార్పోరేషన్ ఎన్నికలు పంచాయతీలకు గడువు మార్చి ఏప్రిల్ తో ముగుస్తుంది. జిల్లా పరిషత్తులు మండల పరిషత్తులకు జూన్ దాకా సమయం ఉంది. దాంతో ఏవి ముందు నిర్వహించడం వల్ల లాభం అన్నది కూటమి ఎన్నికల వ్యూహంగా ఉంది అని అంటున్నారు.
సమ్మర్ బ్యాడ్ వెదర్ :
ఇక ఎన్నికలు నిర్వహించాలి అనుకుంటే ఆగస్టు తరువాతనే మంచి సీజన్ అని అంతా అంటున్నారు. వేసవిలో ఎన్నికలు పెడితే నీటి కొరత విద్యుత్ కోతలు ఇతర సమస్యలు అనేకం ఉంటాయని అంటున్నారు. దానితో పాటు మండే ఎండలతో జనాలు పోలింగ్ బూతులకు వచ్చి ఓట్లు క్యూలు కట్టి ఓట్లు వేయడం కష్తతరం అవుతుంది అని అంటున్నారు. అంతే కాదు పోలింగ్ శాతం మీద ఇది తీవ్ర ప్రభావం చూపిస్తుంది అని భావిస్తున్నారు. అందుకే ఎండలు బాగా తగ్గి కూల్ గా ఉండే సీజన్ లో అయితే ఎన్నికలు పెట్టినా కూటమి ప్రభుత్వానికి మంచి స్పందన లభిస్తుంది అని అంటున్నారు. పైగా అప్పటికి మండల జిల్లా పరిషత్తులకు కూడా గడువు తీరుతుందని ఈ లెక్కన ముందుగా జిల్లా మండల పరిషత్ ఎన్నికలతో స్థానిక సంస్థల ఎన్నికలకు తెర తీయవచ్చు అన్నది కూడా కూటమి వ్యూహంగా ఉంది అని అంటున్నారు.
నీలం సాహ్ని ప్లేస్ లో :
ఇదిలా ఉంటే రాష్ట్ర ఎన్నికల అధికారి నీలం సాహ్ని పదవీ కాలం ఈ నెలాఖరుతో పూర్తి అవుతుంది. దాంతో ఆమె ప్లేస్ లో కొత్త ఎన్నికల అధికారిగా నీరభ్ కుమార్ ప్రసాద్ కి అవకాశం ఇస్తారని ప్రచారం సాగుతోంది. దాంతో కొత్తగా వచ్చే ఎన్నికల అధికారి ఆధ్వర్యంలో ఎన్నికలకు వెళ్ళాలని కూడా కూటమి ప్రభుత్వం ఆలోచన చేస్తోంది అని అంటున్నారు.
ప్రత్యేక అధికారుల పాలన :
ఇక ఏప్రిల్ 2వ తేదీ నుంచి పంచాయతీల పదవీ కాలం పూర్తి అవుతోంది. దాంతో గ్రామాల్లో ప్రత్యేక అధికారులను నియమించి వారి ద్వారా పాలన చేస్తారు అని అంటున్నారు. మండల అధికారులను ప్రత్యేక అధికారులుగా నియమించవచ్చు అని చెబుతున్నారు. ఇక సుప్రీం కోర్టు ఆదేశాల మేరకు కూటమి ప్రభుత్వం రాజీవ్ రంజన్ మిశ్రా నాయకత్వంలో ఏకసభ్య కమిషన్ ని నియమించింది. ఈ కమిషన్ బీసీల రిజర్వేషన్ మీద తన నివేదికను ప్రభుత్వానికి అందచేస్తుంది. ఆ నివేదిక వచ్చాక బీసీలకు 34 శాతం రిజర్వేషన్లు అమలు చేయాలని ప్రభుత్వం ఆలోచన చేస్తోంది అని అంటున్నారు. మొత్తం మీద అనేక కారణాలతో ప్రభుత్వం ఎన్నికలను మరో నాలుగు నెలలకు వాయిదా వేస్తున్నట్లుగా చెబుతున్నారు.
