Begin typing your search above and press return to search.

ఆటకు సై...కూటమి ఎమ్మెల్యేలు ఎమ్మెల్సీలు రెడీ !

ఆట విడుపు ఉండాలని అంటారు. అందరికీ ఇది అవసరం. ప్రజా ప్రతినిధులు అంటే నిరంతరం ఒత్తిడితో ఉంటారు.

By:  Satya P   |   24 Feb 2026 12:00 AM IST
ఆటకు సై...కూటమి ఎమ్మెల్యేలు ఎమ్మెల్సీలు రెడీ !
X

ఆట విడుపు ఉండాలని అంటారు. అందరికీ ఇది అవసరం. ప్రజా ప్రతినిధులు అంటే నిరంతరం ఒత్తిడితో ఉంటారు. వారు కూడా రిలాస్క్ కావాలి అంటే తప్పనిసరిగా ఆటలను ఆడాల్సిందే. దీంతో ఏపీలో కూటమి ప్రభుత్వం ప్రజా ప్రతినిధులకు ఆంధ్రప్రదేశ్ స్టేట్ లెజిస్లేచర్ స్పోర్ట్స్ 2026 పేరుతో భారీ ఎత్తున కార్యక్రమం నిర్వహిస్తోంది. ఈ పోటీలు ఈ నెల 24 నుంచి మొదలవుతున్నాయి. మూడు రోజుల పాటు జరుగుతాయి.

పెద్ద ఎత్తున ప్రజా ప్రతినిధులు :

ఇక ఈ క్రీడోత్సవాలలో క్రికెట్ కబడ్డీ వాలీబాల్ చెస్ బ్యాడ్మింటన్, టగ్ ఆఫ్ వార్, అథ్లెటిక్స్, క్యారమ్స్ వంటి మొత్తం 14 రకాల క్రీడాంశాలలో పోటీలు ఉంటాయి. ప్రజా ప్రతినిధుల మధ్య స్నేహపూర్వక వాతావరణాన్ని పెంపొందించేందుకు క్రీడలను ప్రోత్సహించేందుకు క్రీడోత్సవాన్ని నిర్వహిస్తున్నట్లుగా చెబుతున్నారు. విజయవాడలోని ఇందిరాగాంధీ మున్సిపల్ స్టేడియం,దండమూడి రాజగోపాలరావు ఇండోర్ స్టేడియం వేదికలుగా ఈ క్రీడా పోటీలు జరగనున్నాయి. స్పీకర్ అయ్యన్న పాత్రుడు ఈ క్రీడా ఉత్సవాన్ని ప్రారంభిస్తారు. మొత్తంగా అసెంబ్లీ మండలి కలుపుకుని 156 మంది శాసనసభ్యులు, శాసనమండలి సభ్యులు, రాష్ట్ర మంత్రులు ఈ క్రీడలలో పాల్గొననున్నారు. ముఖ్యమంత్రి చంద్రబాబు ఉప ముఖ్యమంత్రి పవన్ కళ్యాణ్, మంత్రి మంత్రి లోకేష్ తదితరులు ఈ వేడుకలో పాల్గొంటారు.

కెప్టెన్లుగా వారు :

ఇదిలా ఉంటే ప్రజా ప్రతినిధుల క్రికెట్‌లో మొత్తం ఆరు జట్లు పోటీ పడుతున్నాయి. అందులో ఏపీ టీడీపీ ప్రెసిడెంట్ పల్లా శ్రీనివాస్, మంత్రులు నాదెండ్ల మనోహర్, సత్య కుమార్ యాదవ్, కొలుసు పార్థసారథి, కొల్లు రవీంద్ర, అచ్చెన్నాయుడు కెప్టెన్లుగా వ్యవహరిస్తారు. కబడ్డీలో వాసంశెట్టి సుభాష్, భూమిరెడ్డి రామగోపాల్ రెడ్డి, బి.సి. జనార్దన్ రెడ్డి, రఘురామకృష్ణంరాజు నేతృత్వంలో నాలుగు జట్లు తలపడతాయి. హోం మంత్రి వంగలపూడి అనితతో పాటు మహిళా ఎమ్మెల్యేలు, మంత్రులు క్రికెట్, బ్యాడ్మింటన్ వంటి క్రీడలలో పాల్గొని తమ క్రీడా నైపుణ్యాన్ని చాటనున్నారు.

క్రీడా ఆంధ్రప్రదేశ్ గా :

ఏపీని క్రీడా ఆంధ్ర ప్రదెశ్ గా తీర్చిదిద్దాలని కూటమి ప్రభుత్వం లక్ష్యంగా పెట్టుకుందని అందులో భాగంగా నిత్యం బిజీగా ఉండే ప్రజా ప్రతినిధుల కోసం క్రీడోత్సవం నిర్వహించడం అన్నది కీలక పరిణామంగా ప్రభుత్వ పెద్దలు చెబుతున్నారు. ప్రతీఎ ఒక్కరిఈ క్రీడలు ఒక గొప్ప ఉపశమనాన్ని ఇస్తాయని అంటున్నారు. గెలుపోటముల కంటే అందరూ కలిసి ఆడుకోవడం, నవ్వుతూ గడపడమే ఈ క్రీడల ప్రధాన ఉద్దేశ్యం అన్నదే కూటమి ప్రభుత్వం ఉద్దేశ్యంగా ఉంది.

గత ఏడాది సైతం :

ఇదిలా ఉంటే కూటమి ప్రభుత్వం పూర్తి స్థాయి బడ్జెట్ ని 2025లో ప్రవేశపెట్టింది. అలా గత ఏడాది నిర్వహించిన క్రీడల విజయవంతం అయింది. ఆ స్ఫూర్తితోనే ఈ ఏడాది మరింత ఉత్సాహంగా వీటిని నిర్వహిస్తున్నామని చెబుతున్నారు. ప్రజా ప్రతినిధులు క్రీడలలో పాల్గొనడం ద్వారా ఒక సందేశం సమాజానికి ఇస్తారని అంటున్నారు. ప్రతీ ఒ క్కరూ సెల్ ఫోన్లకు అతుక్కుపోకుండా తమ దైనందిన జీవితంలో క్రీడలను భాగం చేసుకోవాలన్నదే ఆ సందేశం అని చెబుతున్నారు. మొత్తానికి ఈసారి క్రీడోత్సవం ఎంతో ఆసక్తిగా సాగుతుంది అని అంటున్నారు.