Begin typing your search above and press return to search.

జగన్ లోకేష్ మధ్యలో పవన్ !

ఏపీలో ఈ ముగ్గురు నేతలూ మరిన్ని కాలాల పాటు రాజకీయంగా ఉండాలని అనుకుంటున్నారు.

By:  Tupaki Desk   |   7 July 2025 9:00 AM IST
జగన్ లోకేష్ మధ్యలో పవన్ !
X

ఏపీలో ఈ ముగ్గురు నేతలూ మరిన్ని కాలాల పాటు రాజకీయంగా ఉండాలని అనుకుంటున్నారు. భవిష్యత్తు రాజకీయాలలో తమదైన ముద్ర వేయాలని చూస్తున్నారు. జగన్ ఒకసారి సీఎంగా చేసి ఉన్నారు. అయితే ఆయన మరిన్ని చాన్సులు కావాలని చూస్తున్నారు. ఆయన 2029లో కచ్చితంగా తానే సీఎం అవుతాను అని ధీమాను కనబరుస్తున్నారు దాని కోసం చేయాల్సింది అంతా చేస్తున్నారు.

తన పార్టీని గాడిన పెట్టుకోవడంతో పాటు ప్రజలకు చేరువ అయ్యేలా చూసుకుంటున్నారు. మరో వైపు అధికార కూటమి మీద అంతకంతకు తన దూకుడుని పెంచుతున్నారు. కూటమిలో లుకలుకలు తనకు కలసిరాకపోతాయా అన్న వ్యూహం కూడా వైసీపీ అధినాయకత్వంలో ఉంది అని చెబుతారు. అంతే కాదు 2029 నాటికి 2024 పరిణామాలు ఉండవని కచ్చితంగా అది వైసీపీకి అనుకూలిస్తుందని జగన్ బలంగా నమ్ముతున్నారు.

ఇంకో వైపు చూస్తే వైసీపీకి ఏకైక అధినాయకుడిగా జగన్ కి సీఎం సీటు విషయంలో పేచీ పూచీ అయితే లేనే లేదు. భవిష్యత్తులో పొత్తులు ఉంటాయో లేదో ఎవరికి తెలియదు ఒక వేళ ఉన్నా అప్పర్ హ్యాండ్ వైసీపీదే అవుతుంది కాబట్టి ఆ డౌటూ అక్కరలేదు అని అంటున్నారు మరో వైపు చూస్తే వైసీపీ ఏపీలో కూటమికి ఏకైక ఆప్షన్ గా ఉండడం తమకే లాభిస్తుందని కూడా లెక్క ఉంది.

మరో వైపు చూస్తే నారా లోకేష్ ఉన్నారు. ఆయన పొలిటికల్ గా చూస్తే ఏపీలో రైజింగ్ స్టార్ గా ఉన్నారు. టీడీపీకి ఆయన ఏకైక వారసుడిగా ఉండడం ప్లస్ పాయింట్ గా ఉంది. అంతే కాదు చంద్రబాబు తరువాత లోకేష్ అన్నది పార్టీ జనం మాటగా ఉంది. దాంతో సొంత పార్టీలో ఎదురు లేని పరిస్థితి ఉంది. దానికి తోడు లోకేష్ తన నాయకత్వాన్ని అంతకంతకు పెంచుకుని పోతున్నారు.

ఈ విధంగా చూస్తే జగన్ కానీ లోకేష్ కానీ తమ పార్టీలలో స్ట్రాంగ్ పొజిషన్ లో ఉన్నారు అని అంటున్నారు. మామూలుగా అయితే ఫైట్ చంద్రబాబు జగన్ ల మధ్య నుంచి బాబు కనుక రాజకీయంగా సైడ్ అయి కుమారుడికి చాన్స్ ఇస్తే లోకేష్ జగన్ ల మధ్యకు మారాల్సి ఉంటుంది. కానీ ఏపీ రాజకీయాల్లో అలాంటి పరిస్థితి ఉందా అన్నదే చర్చ. ఎందుకంటే మధ్యలో పవన్ ఉన్నారు.

ఆయన పార్టీగా జనసేన ఉంది. ఆ పార్టీకి బలమైన సామాజిక వర్గం వెన్ను దన్నుగా ఉంది. అంతే కాదు పవన్ సినీ గ్లామర్ పెట్టని కోటగా ఉంది. అపారమైన అభిమాన జనం ధనమే జనసేనకు పెట్టుబడిగా ఉంది. ఈ రకంగా ఏపీ రాజకీయాల్లో ఉన్న వేళ పవన్ ఒక విధంగా 2024 ఎన్నికల్లో గేమ్ చేంజర్ పాత్రను పోషించారు.

అయితే ఆయన ఫ్యూచర్ లో కూడా జగన్ కానీ లోకేష్ కానీ తాను కానీ సీఎం కావాలంటే కనుక కచ్చితంగా అది జనసేన చేతిలోనే ఉంది అన్న సంకేతాలు ఇస్తున్నారా అన్న చర్చ సాగుతోంది. పవన్ ఇటీవల కాలంలో జోరు పెంచారు. ఆయన మళ్ళీ వైసీపీ మీద హాట్ కామెంట్స్ చేస్తున్నారు. ఎట్టి పరిస్థితుల్లోనూ 2029 ఎన్నికల్లో వైసీపీని అధికారంలోకి రానీయమని చెబుతున్నారు.

అదే సమయంలో ఏపీలో కూటమి పాలన మరో పదిహేనేళ్ళ పాటు కొనసాగాలని బలంగా కోరుకుంటున్నట్లుగా పవన్ చెబుతున్నారు. దీంతోనే సరికొత్త చర్చ సాగుతోంది. జగన్ ని సీఎం కానీయమని అంటే అది ప్రత్యర్థి పార్టీ మీద సహజంగా చేసే ఘాటైన విమర్శగా ఉంటుంది. కానీ దానితో పాటుగా చంద్రబాబే మరోసారి సీఎం గా ఉండాలని ఆయన నాయకత్వంలో కూటమి ప్రభుత్వం పదిహేనేళ్ళ పాటు కొనసాగాలని పవన్ ఆకాంక్షిస్తున్నారు.

ఇక్కడే అసలైన రాజకీయ మెలిక ఉందా అన్న చర్చ నడుస్తోంది. బాబు సీఎం గా ఉంటేనే కూటమికి మద్దతు అన్నదేమైనా ఒక కండిషన్ గా ఉందా అన్నది కూడా విశ్లేషిస్తున్నారు. మాటవరకు బాబు మరింత కాలం ఉండాలని అనుకోవచ్చు. కానీ ఆయన వయసు రిత్యా చూస్తే అది సాధ్యపడుతుందా అన్నదే కదా ప్రశ్న. బాబు 2029 నాటికి చూస్తే 79 ఏళ్ళు నిండిన వారు. అక్కడ నుంచి మరో పదిహేనేళ్ళు అంటే ఆయన 90 ఏళ్ళు వచ్చేంతవరకూ సీఎం గా ఉండగలుగుతారా అన్నదే చర్చగా ఉంది.

నిజానికి టీడీపీలో అంతా కోరుకుంటున్నది 2029 తరువాత లోకేష్ సీఎం కావాలని అన్న ప్రచారం ఉంది. అయితే పవన్ మాత్రం చంద్రబాబు సీఎం కూటమి పదిహేనేళ్ళ పాలన అని గట్టిగా చెబుతూ వస్తున్నారు. దాంతో లోకేష్ సీఎం గా కూటమి నుంచి అవుతారా, అయితే ఎపుడు అన్న ప్రశ్నలు వస్తున్నాయి. ఇంకో వైపు చూస్తే జగన్ ని సీఎం ని మరోసారి కానీయమని పవన్ సవాల్ చేస్తున్నారు. అలా అటు జగన్ కే కాదు ఇటు లోకేష్ కి కూడా రాజకీయ అవాంతరాలు ఉంటాయా అన్న చర్చ సాగుతోంది.ఇలా మధ్యలో పవన్ ఉంటూ చేస్తున్న వ్యాఖ్యలు మాత్రం రాజకీయంగా సంచలనం రేపుతున్నాయని అంటున్నారు.