Begin typing your search above and press return to search.

టీడీపీ టీజింగ్ కి జగన్ కౌంటర్ ?

తెలుగుదేశం పార్టీ ఈ మధ్య కాలంలో వైసీపీకి పొలిటికల్ గా విపరీతంగా టీజ్ చేస్తోంది. సాధారణంగా విమర్శలు ప్రతి విమర్శలు అన్నవి సహజం. కానీ అది మరింతగా పీక్స్ కి చేరుకుంది.

By:  Satya P   |   21 May 2026 8:15 AM IST
టీడీపీ టీజింగ్ కి జగన్ కౌంటర్ ?
X

తెలుగుదేశం పార్టీ ఈ మధ్య కాలంలో వైసీపీకి పొలిటికల్ గా విపరీతంగా టీజ్ చేస్తోంది. సాధారణంగా విమర్శలు ప్రతి విమర్శలు అన్నవి సహజం. కానీ అది మరింతగా పీక్స్ కి చేరుకుంది. ఏకంగా వైసీపీ అన్న పేరునే టీడీపీ జనానికి దూరం చేసే ఎత్తుగడకు సిద్ధపడింది. గొడ్డలి పార్టీ అంటూ గత కొంతకాలంగా టీడీపీ విపరీతమైన స్థాయిలోనే కామెంట్స్ చేస్తోంది. ఒక విధంగా గొడ్డలి అంటే వెంటనే వైసీపీ గుర్తుకు వచ్చేలా టీడీపీ ప్రచారం సాగుతోంది. అయితే దాని మీద వైసీపీ నుంచి సరైన కౌంటర్లు పడడం లేదు. వైసీపీ నుంచి పెద్దగా సౌండ్ కూడా ఉండటం లేదు. దాంతో అధినేత చంద్రబాబు నుంచి సాధారణ కార్యకర్త వరకూ గొడ్డలి పార్టీ అంటూ వైసీపీకి నామకరణం చేసి మరీ పేరుని ఫిక్స్ చేసేశారు.

బాబాయ్ గొడ్డలి అంటూ :

ఇప్పటికి ఏడేళ్ళ క్రితం 2019 ఎన్నికల ముందు జరిగిన వివేకానందరెడ్డి హత్య కేసుని ఉదహరిస్తూ గొడ్డలితో బాబాయ్ ని వేటు వేశారు అని అది తన మీద తోసేసే ప్రయత్నం చేశారు అని చంద్రబాబు బహిరంగ సభలలో చెబుతూ వస్తున్నారు. వైసీపీ వారే ఆ హత్య చేసి తనని లాగాలని చూశారని ఆయన విమర్శిస్తూ గొడ్డలి పార్టీ అని సెట్ చేశారు. ఆ తరువాత అరాచక పాలన అంటూ విమర్శలు పెంచి గొడ్డలి పార్టీతో అన్నీ అలాంటివే అని కూడా ముక్తాయిస్తున్నారు. ఇక మంత్రులు నాయకులు అంతా కూడా గొడ్డలి పార్టీ అంటూ వైసీపీ మీద బిగ్ సౌండ్ చేస్తున్నారు. వైసీపీ ఈ విమర్శలకు జవాబు చెప్పలేక తన మీద పడిన ఆ పేరుని తుడుచుకోలేక నానా రకాలుగా సతమతం అవుతోంది.

డిఫెన్స్ మోడ్ లోనే :

ఒక విధంగా చూస్తే వైసీపీ పూర్తి డిఫెన్స్ లో ఉంది. అధికార టీడీపీ చేసే విమర్శలకు వివరణ ఇచ్చుకునే ప్రయత్నంలోనే ఉంటోంది తప్ప అగ్రెస్సివ్ మోడ్ లోకి రాలేకపోతోంది. అఫెన్సివ్ గా దూకుడు చేయలేకపోతోంది. దాంతో టీడీపీ చేస్తున్న ప్రచారం జనంలో నలుగుతోంది. అది కాస్తా ఎంతదాకా వెళ్తోంది అన్నదే ఇపుడు వైసీపీలో చర్చగా ఉంది. అయితే వైసీపీ అధినాయకత్వం దీనికి కౌంటర్ సిద్ధం చేస్తోందా అన్నదే ఇపుడు చర్చగా ఉంది.

తూర్పార పడుతూనే :

టీడీపీ అయితే మారుతున్న కాలానికి అనుగుణంగా తన రాజకీయాన్ని మార్చుకుంటోంది. ట్రెడిషనల్ అవుట్ లుక్ నుంచి టెక్నికల్ సైడ్ తీసుకుని మరీ ప్రత్యర్ధి వైసీపీని కట్టడి చేస్తోంది. వైసీపీలో ఆ వ్యూహం కరవు అవుతోంది అని అంటున్నారు. ఎంతసేపూ అధికార పార్టీ మీద విమర్శలు చేయడం తప్పించి వైసీపీ నేతలు ఏమీ చేయలేకపోతున్నారు. ఈ క్రమంలో జగన్ ప్రెస్ మీట్ పెడుతున్నారు. చెప్పాలంటే చాలా కాలం తరువాత జగన్ మీడియా ముందుకు వస్తున్నారు. గత నెలలో ఆయన విదేశీ టూర్ చేశారు.

టీడీపీకి ఒక పేరు ని సెట్ చేసి :

దాని కంటే ముందు ఏప్రిల్ 1న అమరావతికి చట్టబద్ధత కల్పించే బిల్లు పార్లమెంట్ లో ప్రవేశపెట్టిన సందర్భంగా ఆయన ప్రెస్ మీట్ పెట్టారు. అంటే యాభై రోజులు పై దాటుతోంది అన్న మాట. ఇపుడు జగన్ మళ్ళీ ప్రెస్ మీట్ అంటే చాలా అంశాలే ఉంటాయని అంటున్నారు. అదే సమయంలో జగన్ గొడ్డలి పార్టీ అన్న టీడీపీ చేస్తున్న పొలిటికల్ టీజింగ్ ని ర్యాగింగ్ ని లైట్ తీసుకుంటారా లేక కౌంటర్ ఇస్తారా అన్నది చూడాల్సి ఉంది. అయితే వైసీపీ కూడా టీడీపీకి ఒక పేరు ని సెట్ చేసి ఉంచిందని అంటున్నారు. మది అది జగన్ రివీల్ చేయబోతున్నారా అన్నదే హాట్ టాపిక్ గా ఉంది. మరి ఆ పేరు ఏమిటో చూడాల్సిందే.