Begin typing your search above and press return to search.

జగన్ మంచితనం....బాబు సంచలన వ్యాఖ్యలు!

రాజకీయ వేడి ఏమిటన్నది ఏపీలోనే చూడాలి. భీకరమైన పోరు ఇక్కడే సాగుతుంది. డైలాగ్ వార్ పీక్స్ కి చేరేది కూడా ఆంధ్రా గడ్డ మీదనే. పంచులకు కౌంటర్లకు సెటైరల్కు ఎక్కడా కొరత ఉండదు.

By:  Satya P   |   24 May 2026 4:00 AM IST
జగన్ మంచితనం....బాబు సంచలన వ్యాఖ్యలు!
X

రాజకీయ వేడి ఏమిటన్నది ఏపీలోనే చూడాలి. భీకరమైన పోరు ఇక్కడే సాగుతుంది. డైలాగ్ వార్ పీక్స్ కి చేరేది కూడా ఆంధ్రా గడ్డ మీదనే. పంచులకు కౌంటర్లకు సెటైరల్కు ఎక్కడా కొరత ఉండదు. వారిని వీరు వీరిని వారు ఇలా కౌంటర్లు పేలుస్తూంటే ఏపీ పాలిటిక్స్ హీట్ అలా వేసవి వేడిని దాటి ధాటీగా ఎక్కడికో పోతుంది. ఇదిలా ఉంటే తాజాగా వైసీపీ అధినేత జగన్ ప్రెస్ మీట్ పెట్టారు. అందులో సుదీర్ఘమైన స్పీచ్ ఇచ్చారు. అనేక అంశాలను కూడా ఆయన టచ్ చేశారు. మాది బాధిత కుటుంబం అన్నారు. మా తాత తండ్రి చిన్నాన్నలకు హత్య చేశారు అని చెప్పారు. టీడీపీ మీద ఘాటుగా విమర్శలు చేశారు. హత్యకు చేసే సంస్కృతి తమ తండ్రి వైఎస్సార్ నేర్పలేదని ప్రజలకు మంచి చేసి మంచి పేరు సంపాదించడమే తమకు వైఎస్సార్ నేర్పారని జగన్ అన్నారు. ఇక తాను మంచి వాడిని కాబట్టే తన తాత రాజారెడ్డిని హత్య చేసిన నిందితులు ఈ రోజుకీ ప్రశాంతంగా తిరుగుతున్నారని కూడా జగన్ చెప్పారు. ఇక జగన్ చేసిన ఈ మంచోడు కామెంట్స్ కి గట్టిగానే టీడీపీ అధినేత ముఖ్యమంత్రి చంద్రబాబు రిటార్ట్ ఇచ్చేశారు.

మంచోడినంటూ మాటలు :

తాను మంచి వాడిని అని జగన్ మీడియా ముందుకొచ్చి చెబుతున్న మాటలు అన్నీ ఒట్టివే అని ముఖ్యమంత్రి చంద్రబాబు అన్నారు. చిత్తూరు జిల్లా పూతలపట్టు నియోజకవర్గం యాదమరిలో నిర్వహించిన సంజీవని కార్యక్రమానికి బాబు హాజరయ్యారు. ఈ సందర్భంగా ఆయన మాట్లాడుతూ నోరు తెరిస్తే అబద్ధాలు చెబుతున్న వ్యక్తులు మీడియా ముందుకొచ్చి మంచోడినంటూ మాటలు చెబుతున్నారని జగన్ మీద హాట్ కామెంట్స్ చేశారు. ఇది గొడ్డలి పార్టీ నైజమని అన్నారు. వైసీపీ చేసిన 11 నిర్వాకాలు అధికారంలో ఉన్నపుడూ ప్రతిపక్షంలో ఉన్నపుడూ ఒకేలా కొనసాగుతున్నాయని అన్నారు. వైసీపీ అరాచక ఘటనలు అన్నీ ఇన్నీ కావని బాబు విమర్శించారు.

గొడ్డలి పార్టీ గంగవెర్రులెత్తుతోంది :

రాష్ట్రంలో సూపర్ సిక్స్ పథకాలు సూపర్ హిట్ కావటంతో పాటు కూటమి చేపట్టిన అభివృద్ధి ప్రాజెక్టులను చూసి గొడ్డలి పార్టీ గంగవెర్రులెత్తుతోందని బాబు వ్యాఖ్యానించడం విశేషం. రాష్ట్రంలో ప్రజల ప్రాణాలు కాపాడే రాజకీయాలు ఒకవైపు సాగుతున్నాయని మరో వైపు ప్రజల్ని భయపెట్టే మోసం చేసే రాజకీయాలు చేస్తున్న వారు ఉన్నారని చంద్రబాబు ప్రజలకు గుర్తు చేశారు. ఈ విషయాలు ప్రజలు జాగ్రత్తగా గమనించాలని ఆయన కోరారు. ప్రజాస్వామ్యంలో గొడ్డలి పార్టీలకు చోటులేదని సమాజానికి గొడ్డలి పార్టీ హానికరమని బాబు స్పష్టం చేశారు. గొడ్డలి పార్టీ నెవర్ ఎగైన్ అంటూ ముఖ్యమంత్రి వ్యాఖ్యానించారు.

అన్నీ నాటకాలే :

ఆనాడు వివేకా హత్య నుంచి ఈ రోజు దాకా వైసీపీ ఆడిన నాటకాలు అన్నీ ఇన్నీ కావని చంద్రబాబు చెప్పారు. వివేకా హత్యలో నాటకాలు ఆడారు, నంగనాచి కబుర్లు చెప్పారని, కోడికత్తి డ్రామా గులకరాయి డ్రామా ప్రజలందరికీ జ్ఞాపకం ఉందని అన్నారు. దళిత డ్రైవర్ సుబ్రమణ్యం హత్య, డోర్ డెలివరీ చేసిన నిందితుడికి అండదండలు ఇచ్చారని నిందించారు. .మాస్క్ అడిగిన దళిత డాక్టర్ సుధాకర్ పై దాడి చేశారని, వేధించి ప్రాణాలు తీశారని బాబు గుర్తు చేశారు. .కుటుంబ బంధాలపై గొడ్డలి వేటు వేశారని, ఆస్తి ఇవ్వకుండా తల్లికి, చెల్లికి అన్యాయం చేశారని బాబు మండిపడ్డారు. హిందూ దేవుళ్లపై దాడులు చేశారని, అపవిత్ర కార్యక్రమాలతో పాటు కుట్రలు చేసి తప్పుడు ప్రచారాలు చేశారని అన్న్నారు. పోలవరం, అమరావతి, పెట్టుబడులు, అభివృద్దిపై గొడ్డలి పార్టీ వేటు వేసిందని బాబు విమర్శించారు. నందం సుబ్బయ్య, చంద్రయ్య, జల్లయ్యల పీకలు కోసి నడిరోడ్డుపై చంపేసి రక్తదాహం తీర్చుకున్నారని అన్నారు. గంజాయి బ్యాచ్ లకు ప్రోత్సాహం ఇచ్చారని, వైసీపీ కార్యకర్తలు రప్పా రప్పా రంకెలు వేశారని, . జంతు రక్తంతో కటౌట్ కు అభిషేకాలు చేశారని బాబు ఆరోపించారు. కారు కింద వారి పార్టీ కార్యకర్త సింగయ్యను తొక్కించారని, కడపలో పెద్ద దస్తగిరిని చంపేశారని, కులాలు, మతాలు, ప్రాంతాల మధ్య చిచ్చుకు రోజుకో నాటకం ఆడుతున్నారని బాబు మండిపడ్డారు.

నరకం చూపించారు :

వైసీపీ అయిదేళ్ల పాటు అధికారంలో ఉందని ఈ మొత్తం కాలంలో రాష్ట్రంలో ప్రతి ఒక్కరికి నిద్ర లేకుండా చేశారని అన్నారు. ప్రజలకు నరకం చూపించారని ఫైర్ అయ్యారు. కనీసం నోటీసు కూడా ఇవ్వకుండా తనను అరెస్టు చేసి జైల్లో పెట్టారని బాబు ఆరోపించారు. ప్రజలందరిలోనూ భయాందోళనలు కల్పించారని అన్నారు. ప్రజా ప్రభుత్వం అధికారంలోకి వస్తూనే స్వేచ్ఛ కల్పించామని బాబు స్పష్టం చేశారు. కూటమి ప్రభుత్వం హెల్తీ వెల్తీ హ్యాపీ ఆంధ్రప్రదేశ్ లక్ష్యంగా పనిచేస్తుందని బాబు చెప్పుకొచ్చారు. మొత్తానికి జగన్ మంచోడు కామెంట్స్ కి బాబు మార్క్ కౌంటర్ ఇచ్చేశారు అన్న మాట.