టీడీపీ 'అధికార ప్రతినిధుల'కు పనితగ్గించేశారా ..!
దీంతో ఆయా పదవుల వ్యవహారంలోనే నాయకులు మునిగితేలుతున్నారు. ఇక, పదవులు రాని అధికార ప్రతినిధులు మౌనంగా ఉంటున్నారు.
By: Tupaki Desk | 14 May 2025 10:00 PM ISTఏపార్టీకైనా అధికార ప్రతినిధులు కీలకం. అధికారంలో ఉన్నా.. ప్రతిపక్షంలో ఉన్నా.. పార్టీల వాయిస్ విని పించేందుకు.. ప్రభుత్వ పనితీరును వివరించేందుకు కూడా అధికార ప్రతినిధులు కీలక రోల్ పోషిస్తారు. అంతేకాదు.. విమర్శలను కూడా తిప్పికొట్టేందుకు వీరు కీలకంగా వ్యవహరిస్తారు. అయితే.. తాజాగా గత ఏడా నుంచి కూడా రాష్ట్రంలో అధికార ప్రతినిధుల జోరు తగ్గిందనే చెప్పాలి. ఇటు అధికార పార్టీలోను.. అటు ప్రతిపక్ష వైసీపీలోనూ అధికార ప్రతినిధులు కనిపించడం లేదు.
అధికార పక్షాన్ని తీసుకుంటే.. టీడీపీలో ఎక్కువ మంది అధికార ప్రతినిధులు ఉన్నారు. తరచుగా మీడి యా ముందుకు వచ్చి.. అప్పట్లో వైసీపీ సర్కారును టార్గెట్ చేసిన విషయం తెలిసిందే. అంతేకాదు.. వైసీపీ విధానాలను కూడా ఎండగట్టారు. కానీ.. అధికార పక్షంలోకి రాగానే.. నాయకులు కనిపించడం లేదు. ఎవరూ కూడా.. పట్టించుకోవడం లేదన్నట్టుగానే వ్యవహరిస్తున్నారు. అయితే.. ప్రస్తుతం అధికార ప్రతినిధులు గా ఉన్న వారిలో చాలా మందికి నామినేటెడ్ పదవులు ఇచ్చారు.
దీంతో ఆయా పదవుల వ్యవహారంలోనే నాయకులు మునిగితేలుతున్నారు. ఇక, పదవులు రాని అధికార ప్రతినిధులు మౌనంగా ఉంటున్నారు. దీంతో టీడీపీ తరఫున అధికార ప్రతినిధులు ఎవరూ ముందుకు రావడం లేదు. కనిపించడమూ లేదు. మరోవైపు.. జనసేనలో పెద్దగా అధికార ప్రతినిధులు ఎవరూ లేరు. బీజేపీలో ఉన్నా.. వారు సొంత అజెండా ను అమలు చేస్తున్నారు. దీంతో మీడియా ముందుకు రావడం లేదు. విష్ణువర్ధన్ రెడ్డి సహా చాలా మంది ఫైర్ బ్రాండ్ లు సైలెంట్ అయ్యారు.
ఇక, వైసీపీ విషయానికి వస్తే.. ప్రస్తుతం ఈ పార్టీకి కీలకమైన సమయం నడుస్తోంది. పార్టీ వాయిస్‌ను విని పించాల్సిన అవసరం కూడా ఉంది. అయినప్పటికీ.. ఒకరిద్దరికి మాత్రమే పార్టీ పరిమితమైందని తెలు స్తోంది. దీంతో వారు మినహా ఇతర నాయకులు ఎవరూ మీడియా ముందుకు కనిపించడం లేదు. ఎలా చూసుకున్నా.. ఈ పరిణామం సరికాదన్న అభిప్రాయం వైసీపీలోనే వినిపిస్తోంది. అధికార పార్టీలో అధికార ప్రతినిధుల పాత్రను మంత్రులే పోషిస్తున్నారని.. వైసీపీలో ఎవరూ కనిపించడం లేదని తాజాగా మహిళా నాయకులు వెల్లడించడం గమనార్హం.
