మంత్రులు కేరాఫ్ అమరావతి- అంతా రెడీ
ఏపీలో టీడీపీ కూటమి ప్రభుత్వం అమరావతి రాజధాని విషయంలో వేగంగా అడుగులు వేస్తోంది. నిర్మాణాలు సైతం ఊపందుకున్నాయి.
By: Satya P | 6 March 2026 5:05 PM ISTఏపీలో టీడీపీ కూటమి ప్రభుత్వం అమరావతి రాజధాని విషయంలో వేగంగా అడుగులు వేస్తోంది. నిర్మాణాలు సైతం ఊపందుకున్నాయి. అమరావతి రాజధానికి సంబంధించిన కార్యక్రమాలు అన్నీ పెద్ద ఎత్తున సాగుతున్నాయి. నిధులకు కొరత లేకుండా కూడా కూటమి ప్రభుత్వం చూసుకుంటోంది. ఇక ఇప్పటికే అమరావతిలో హైకోర్టు న్యాయమూర్తుల నివాస సముదాయాలు తయారు అయిపోయాయి. అదే విధంగా మంత్రులకు సంబంధించిన క్వార్టర్స్ నిర్మాణం కూడా తుది దశకు వచ్చింది అని అంటున్నారు.
వచ్చే సెషన్ నుంచి :
ఇదిలా ఉంటే వచ్చే అసెంబ్లీ సమావేశాల నాటికి ఏపీకి చెందిన మొత్తం 175 మంది ఎమ్మెల్యేలు, అలాగే 58 ఎమ్మెల్సీలు, మంత్రుల నివాస సముదాయాలు రెడీ అయ్యేలా నిర్మాణాలు జోరందుకున్నాయి. ఈ విషయాన్ని శాసనసభలో ముఖ్యమంత్రి చంద్రబాబు పేర్కొంటూ రాజధానిలోని మంత్రులు సహా అంతా ఇక మీదట క్వార్టర్లలో ఉండేలా చర్యలు చేపడుతున్నామని చెప్పారు.
పుష్కర కాలం తరువాత :
హైదరాబాద్ రాజధానిగా ఉండగా మంత్రులు అంతా అక్కడ ప్రభుత్వ క్వార్టర్లలో ఉండేవారు, అదే విధంగా ఎమ్మెల్యేలు కూడా ఉండేవారు. కానీ విభజన తరువాత ఏపీకి రాజధాని లేకపోవడం వల్ల రాజధానికి ఎవరు వచ్చినా ఇబ్బంది అవుతోంది. చాలా చోట్ల ప్రైవేట్ వసతి గృహాలను తీసుకుంటున్నారు. ఇపుడు ఆ పరిస్థితిని పూర్తిగా మార్చేలా అమరావతి రాజధానిలో నిర్మాణాలు తయారు అవుతున్నాయని అంటున్నారు. దీంతో ప్రభుత్వ క్వార్టర్లలో ఇక మీదట మంత్రులు శాసనసభ్యులను చూడవచ్చు అని అంటున్నారు.
మూడేళ్ళలో పూర్తిగా :
ఇక రానున్న మూడేళ్ళ కాలంలో అమ్రావతి రాజధాని పూర్తి అవుతుందని ముఖ్యమంత్రి చంద్రబాబు చెబుతున్నారు. మౌలిక సదుపాయాలతో పాటు అన్ని రకాల వసతులతో రాజధాని ఒక షేపునకు వస్తుందని అంటున్నారు. దాంతో ప్రభుత్వం తరఫున పూర్తి యాక్టివిటీ అయితే మొదలవుతుంది అని అంటున్నారు. అక్కడ ప్రభుత్వం తరఫున మంత్రులు ఎమ్మెల్యేలు, ఎమ్మెల్సీలు, అలాగే న్యాయ మూర్తులు, మరో వైపు ప్రభుత్వ ఉద్యోగులు అంతా క్వార్టర్లలో ఉండేందుకు అవసరమైన విధంగా తయారు అవుతుంది. అలాగే ఈ మూడేళ్ళలో ప్రభుత్వం చేపట్టే ప్రాజెక్టులు కూడా ఒక కొలిక్కి వస్తాయని అంటున్నారు. అలాగే ప్రభుత్వం చాలా చోట్ల ప్రైవేట్ సంస్థలకు ఇచ్చిన స్థలాలలో అభివృద్ధి ప్రాజెక్టులు కూడా వేగంగా తయారు అయ్యేందుకు అవకాశం ఉంది అని అంటున్నారు. కేంద్ర సహకారంతో అమరావతి రాజధానిని ట్రాక్ లో పెట్టామని మూడేళ్లలో రాజధానికి ఓ రూపు వస్తుందని బాబు చెప్పారు.
పోలవరం విషయంలో :
ఇక ఏపీలో జీవనాడిగా ఉన్న పోలవరం ప్రాజెక్టును కూడా వచ్చే ఏడాది జూన్ నాటికి జాతికి అంకితం చేసేలా పనులు వేగంగా చేపట్టామని చంద్రబాబు చెప్పారు. గోదావరి పుష్కరాల కంటే ముందే ప్రాజెక్టును జాతికి అంకితం చేసి నీళ్లు ఇస్తామని అన్నారు. ఈ విషయంలో ఎక్కడా లోటు పాట్లు లేకుండా చర్యలు తీసుకుంటామని బాబు చెప్పరు. దాంతో పోలవరం అమరావతి రాజధాని రెండూ పూర్తి అయితే ఏపీకి అన్ని విధాలుగా ప్రగతి కనిపిస్తుంది అని అంచనా వేస్తున్నారు. ఈ విషయంలో అయితే కూటమి ప్రభుత్వం సీరియస్ గానే ముందుకు అడుగులు వేస్తోంది.
