Begin typing your search above and press return to search.

'అచ్చెన్న' త‌డ‌బ‌డి.. తిప్ప‌లు ముడిప‌డి.. !

కొన్నాళ్ల కింద‌ట‌.. సూప‌ర్ 6లో హామీ అయిన‌.. 'ఆడ‌బిడ్డ నిధి'పై సంచ‌ల‌న వ్యాఖ్య‌లు చేశారు. ఆడ‌బిడ్డ నిధి అమ‌లు చేయాలంటే.. రాష్ట్రాన్ని అమ్మేయాల‌ని అన్నారు.

By:  Tupaki Desk   |   10 Aug 2025 9:00 AM IST
అచ్చెన్న త‌డ‌బ‌డి.. తిప్ప‌లు ముడిప‌డి.. !
X

ఏపీ మంత్రి అచ్చెన్నాయుడు అసంతృప్తితో ఉన్నారో.. లేక‌.. త‌న‌కు ప్రాధాన్యం త‌గ్గుతోంద‌ని భావిస్తున్నా రో తెలియ‌దు కానీ.. ఆయ‌న చేస్తున్న వ్యాఖ్య‌లు స‌ర్కారును మాత్రం ఇర‌కాటంలో నెడుతున్నాయి. ఆయ న అసంతృప్తి స‌ర్కారుపై విమ‌ర్శ‌లు వ‌చ్చేలా చేస్తోంద‌ని టీడీపీ నాయ‌కులు కూడా వ్యాఖ్యానిస్తున్నారు. కొన్నాళ్ల కింద‌ట‌.. సూప‌ర్ 6లో హామీ అయిన‌.. 'ఆడ‌బిడ్డ నిధి'పై సంచ‌ల‌న వ్యాఖ్య‌లు చేశారు. ఆడ‌బిడ్డ నిధి అమ‌లు చేయాలంటే.. రాష్ట్రాన్ని అమ్మేయాల‌ని అన్నారు.

వాస్త‌వానికి ఎన్నిక‌ల‌కు ముందు భారీ ఎత్తున ఈ హామీపై చంద్ర‌బాబు ప్ర‌చారం చేశారు. ప్ర‌తి ఇంట్లో 18 ఏళ్లు నిండిన మ‌హిళ‌ల‌కు.. రూ.1500 చొప్పున నెల నెలా ఇస్తామ‌న్నారు. స‌రే.. ఇది సాధ్య‌మో.. అసాధ్య మో.. ప్ర‌జ‌లు కూడా ఎక్క‌డా దీనిపై ప్ర‌శ్న‌లు గుప్పించ‌డం లేదు. ఎవ‌రూ పెద్దగా ప‌ట్టించుకోవ‌డం కూడా లేదు. కానీ, శ్రీకాకుళంలో నిర్వ‌హించిన కార్య‌క్ర‌మంలో అచ్చెన్న‌.. ఈ ప‌థ‌కంపై సంచ‌ల‌న వ్యాఖ్య‌లు చేశారు. రాష్ట్రాన్ని అమ్మేస్తే.. త‌ప్ప ఈ ప‌థ‌కాన్ని అమ‌లు చేయ‌లేమ‌న్నారు.

ఈ వ్యాఖ్య‌ల‌పై అప్ప‌ట్లో తీవ్ర దుమారంరేగింది. సీఎం చంద్ర‌బాబు కూడా ఈ వ్య‌వ‌హారంపై అచ్చెన్నాయు డి నుంచి వివ‌ర‌ణ తీసుకున్నారు. ఇటీవ‌ల అన్న‌దాత సుఖీభ‌వ ప‌థ‌కం కింద రైతుల‌కు సొమ్ములు ఇచ్చి న కార్య‌క్ర‌మంలో అచ్చెన్నాయుడిని ప‌క్క‌న పెట్టేశారు. ఈ అంత‌రంతో అచ్చెన్న మ‌రింత ఆవేద‌న‌లో ఉన్నారు. తాజాగా ఆయ‌న వైసీపీ ప్ర‌భుత్వాన్ని విమ‌ర్శించ‌బోయి.. లేనిపోని వ్యాఖ్య‌లు చేశారు. వైసీపీ హ‌యాంలో వైద్య‌, విద్య రంగాలు భ్ర‌ష్టుప‌ట్టాయ‌ని.. రోగులు మ‌ర‌ణించార‌ని, విద్యార్థులు చ‌దువు మానేశార‌ని అన్నారు.

కానీ, ఈ వ్యాఖ్య‌లు చేసింది.. వైసీపీ హ‌యాంలో నాడు-నేడు ప‌థ‌కం కింద‌.. అభివృద్ధి చేసిన పాఠ‌శాల ఆవ ర‌ణ‌లో జ‌రిగిన కార్య‌క్ర‌మంలోనే. దీంతో స్థానికులు నివ్వెర పోయారు. ఇదేంది? అంటూ మొహాలు చూసు కున్నారు. ఇక‌, వైద్యం విష‌యంలో వైసీపీ హ‌యాంలో ఇంటింటికీ వైద్యుడిని పంపించే కార్య‌క్ర‌మాన్ని ప్రారంభించారు. ప్ర‌భుత్వ వైద్య శాల‌ల‌పై నిరంత‌ర నిఘా పెట్టారు. ఆరోగ్య‌శ్రీకింద వైద్యం అందించారు. ఈ విష‌యాన్ని అసెంబ్లీలో సీఎం చంద్ర‌బాబు కూడా చెప్పారు. ఆరోగ్య శ్రీని గ‌త ప్ర‌భుత్వం మాదిరే కొన‌సాగిస్తామ‌న్నారు. మ‌రి అచ్చెన్న చేసిన వ్యాఖ్య‌లు రాంగైపోయాయి. దీంతో సోష‌ల్ మీడియాలో విమ‌ర్శ‌లు కామ‌నేక‌దా!.