సన్నబియ్యం...లోకేష్ వరం
అయితే మధ్యాహ్న భోజనం మాత్రం నాణ్యత పరంగా ఎపుడూ విమర్శలు ఎదుర్కొంటోంది. ముఖ్యంగా అన్నం విషయంలో మార్పు చేయాలని కోరుతున్నారు.
By: Tupaki Desk | 14 Jun 2025 1:00 AM ISTఏపీలో బడులకు వెళ్ళే పిల్లలకు మంత్రి నారా లోకేష్ అపురూపమైన వరం ఇచ్చారు. ఇక మీదట వారు తినే మధ్యాహ్న భోజనం సన్నబియ్యం తో వండి వార్చి అందిస్తామని ప్రకటించారు. దాంతో సర్కార్ బడులకు వెళ్ళే లక్షలాది పేద విద్యార్ధులకు పూర్తి న్యాయం జరగనుంది అని అంటున్నారు.
ఏపీలో చాలా మంది పిల్లలు భోజనం లేక అవస్థలు పడుతున్నారు. వారి కోసమే మధ్యాహ్న భోజనం పధకం తీసుకుని వచ్చారు ఆ విధంగా ఆకలి తీరుస్తూ మరో వైపు విద్యాబుద్ధులు చెప్పించడం ద్వారా భావి భారత పౌరులను తీర్చిదిద్దాలనుకుంటోంది.
అయితే మధ్యాహ్న భోజనం మాత్రం నాణ్యత పరంగా ఎపుడూ విమర్శలు ఎదుర్కొంటోంది. ముఖ్యంగా అన్నం విషయంలో మార్పు చేయాలని కోరుతున్నారు. చిన్నారులు తినే విధంగా ఆహారం ఉండాలన్న డిమాండ్ కూడా ఉంది. అయితే గత ప్రభుత్వాలు ఆ విషయంలో పెద్దగా పట్టించుకోలేదు.
కానీ విద్యా శాఖ మంత్రిగా ఉన్న నారా లోకేష్ మాత్రం ఈ విషయాన్ని సీరియస్ గానే తీసుకున్నారు. అంతే ఆయన కూటమి ప్రభుత్వ పాలన రెండవ సంవత్సరంలోకి ప్రవేశిస్తున్న వేళ సన్న బియ్యం తో మధ్యాహ్న భోజనం ఇక మీదట ఉంటుందని శుభవార్త వినిపించారు.
దీంతో సర్కారు బడులు అన్నీ కూడా విద్యార్ధులతో నిండిపోవడం ఖాయమని అంటున్నారు. పేద విద్యార్ధులకు అయితే ఇది లోకేష్ ఇచ్చిన అద్భుత వరంగా భావిస్తున్నారు. ఇక ప్రతీ తరగతికి ఒక ఉపాధ్యాయుడు అన్న విధానాన్ని కూడా అమలు చేయడానికి ప్రభుత్వం నిర్ణయించింది అని లోకేష్ చెప్పారు. దీని వల్ల విద్యా నాణ్యత మరింతగా మెరుగుపడుతుందని విద్యార్ధుల మీద ఫోకస్ ఎక్కువగా ఉంటుందని అంటున్నారు.
అంతే కాదు ప్రభుత్వ పాఠశాలకు ఉచితంగా విద్యుత్ ని అందిస్తామని చెబుతున్నారు. దాంతో ప్రతీ క్లాస్ రూమ్ లో లైట్లు ఉంటాయి, అలాగే ఫ్యాన్లు తిరిగుతాయి. విద్యార్ధులకు ప్రైవేట్ పాఠశాలకు ధీటుగా సర్కార్ బడులను తయారు చేస్తామని లోకేష్ చెబుతున్నారు.
తల్లిదండ్రులు చేయాల్సింది తమ పిల్లలనౌ ప్రభుత్వ పాఠశాలకు పంపించడమే అని ఆయన పిలుపు ఇస్తున్నారు. విద్యార్ధులకు మంచి చదువుని అందించడంతో సర్కార్ బడులు రాజీ పడవని ఆయన హామీ ఇచ్చారు. ఈ బాధ్యతను ప్రభుత్వం తీసుకుందని ఆయన చెప్పారు.
ఇక తల్లికి వందనం పధకం కింద ఎంతమంది పిల్లలు ఉంటే అందరికీ వాటిని అందిస్తామని ఈ విషయంలో ఎలాంటి ఇబ్బంది లేదని ఆయన మరోసారి భరోసా ఇచ్చారు. మొత్తానికి ఏపీలో చూస్తే సర్కార్ బడులను ఏపీలో అన్ని విధాలుగా తీర్చిదిద్దాలన్న పట్టుదలతో యువ మంత్రి లోకేష్ ప్రయత్నిస్తున్నారు. అంతే కాదు విద్యా మంత్రిగా తనదైన ముద్ర వేయాలని అనుకుంటున్నారు. దాంతో ఇది ఇపుడు లక్షలాది పేద విద్యార్థులకు మంచి అవకాశంగా మారుతోంది.
