ఎన్నికలు వాయిదా...బాబు పవన్ సీరియస్ డిస్కషన్స్ !
ఏపీలో తొలి విడతలో జరిగే పట్టణ స్థానిక సంస్థల ఎన్నికలు తాత్కాలికంగా వాయిదా పడ్డాయి.
By: Satya P | 22 Oct 2026 12:44 PM ISTఏపీలో తొలి విడతలో జరిగే పట్టణ స్థానిక సంస్థల ఎన్నికలు తాత్కాలికంగా వాయిదా పడ్డాయి. వీటి మీద అన్నీ చర్చించి రాష్ట్ర ఎన్నికల సంఘం తుది నిర్ణయం తీసుకోనుంది. మొత్తం 87 మునిసిపాలిటీలు, 13 కార్పోరేషన్ల ఎన్నికలు వాయిదా పడడంతో ఏపీ రాజకీయం లో కొత్త చర్చ సాగుతోంది. అందరి చూపూ ఎస్ఈసీ వైపే ఉంది. ఎన్నికల సంఘం ఏ నిర్ణయం తీసుకుంటుంది అని అంతా ఆలోచిస్తున్నారు. సుప్రీంకోర్టు ఆదేశాల మేరకు ఎస్ ఈసీ కూడా అన్నీ అధ్యయనం చేసి ఆ మీదట ఎన్నికల ప్రక్రియ తిరిగి ప్రారంభించడానికి పూర్తి స్థాయిలో సన్నద్ధం అవుతోంది అని అంటున్నారు.
బాబుతో పవన్ :
ఇదిలా ఉంటే స్థానిక సంస్థల ఎన్నికలు తొలి విడత వాయిదా నేపథ్యంలో ముఖ్యమంత్రి టీడీపీ అధినేత చంద్రబాబు నివాసానికి డిప్యూటీ సీఎం జనసేన అధినేత పవన్ గురువారం వెళ్ళారు. సుప్రీంకోర్టు అదేశాల నేపధ్యంలో వాయిదా పడిన ఎన్నికలు, తదితర పరిణామాల మీద కూటమి మిత్రులు ఇద్దరూ సీరియస్ డిస్కషన్స్ జరిపారు అని అంటున్నారు. తాజా పరిణామాల గురించి కూడా అధినేతలు ఇద్దరి మధ్యలో చర్చ జరిగింది అని అంటున్నారు.
రెబెల్స్ విషయంలో :
ఇక ఏపీలో చూస్తే చాలా చోట్ల టీడీపీ కూటమిలో మూడు పార్టీల నుంచి పెద్ద ఎత్తున నామినేషన్లు పడ్డాయి. దాంతో రెబెల్స్ కూడా అంతే స్థాయిలో నామినేషన్లు వేశారు. తమకు సీటు వస్తుందని ముందే భావించి పోటీకి దిగిన వారు అంతా ఇపుడు రెబెల్స్ గా కొనసాగాలని చూస్తున్నారు. దాంతో వారికి నచ్చ చెప్పి ఎన్నికల బరి నుంచి తప్పించాలని కూటమి పార్టీలు భావిస్తున్నాయి. ఇదే విషయం మీద చంద్రబాబు పవన్ ల మధ్య చర్చ సాగింది అని అంటున్నారు. కూటమి ఐక్యంగా ముందుకు సాగాల్సిన అవసరాన్ని కూడా ఈ ఇద్దరు నేతలూ చర్చించారు అని అంటున్నారు. అలాగే రెండవ విడతలో భాగంగా జరిగే ఎంపీటీసీ, జడ్పీటీసీ ఎన్నికలపైనా ఈ ఇద్దరు నేతలు డిస్క్షన్స్ జరిపారు అని అంటున్నారు. ఇదిలా ఉంటే చంద్రబాబు నివాసానికి పవన్ ఎలాంటి సెక్యూరిటీ కాన్వాయ్ లేకుండా ఒంటిరిగా రావడం విశేషం. చంద్రబాబుతో చర్చలు జరిపిన అనంతరం పవన్ తిరిగి వెళ్లిపోయారు.
సమయం దొరికింది :
ఇక చూస్తే తొలి విడత ఎన్నికల్లో ఎక్కువ మంది రెబెల్స్ నామినేషన్లు వేశారు. సమయాభావం వల్ల వారికి నచ్చ చెప్పడం అన్నది పార్టీలకు కుదరదని అంతా అనుకున్నారు. ఇపుడు అనూహ్యంగా ఎస్ ఈసీ తొలి విడత ఎన్నికల ప్రక్రియను వాయిదా వేయడంతో కూటమి పార్టీలకు ఈ విధంగా వెసులుబాటు లభించింది అని అంటున్నారు. దాంతో టీడీపీ జనసేన అధినాయకత్వలు వంద సీట్లలో పరిస్థితులను పూర్తి స్థాయిలో ఫోకస్ పెట్టి రెబెల్స్ ని దారికి తెచ్చేందుకు చూస్తున్నారు అంటున్నారు. అలాగే కూటమి ఐక్యతను మరింతగా ముందుకు తీసుకుని పోవడానికి ఒక విధంగా ఈ గ్యాప్ అన్నది కలసి వచ్చింది అని అంటున్నారు.
