వైసీపీ మూడ్ చూసి కూటమి సంచలన నిర్ణయం
తాజాగా మున్సిపల్ శాఖ మంత్రి నారాయణ మీడియాతో మాట్లాడుతూ ఏపీలో లోకల్ బాడీ ఎలక్షన్స్ మీద కీలక వ్యాఖ్యలు చేశారు.
By: Tupaki Desk | 18 Sept 2025 9:25 AM ISTఏపీలో స్థానిక సంస్థల ఎన్నికలు ముందుకు తోసుకొస్తున్నాయని ప్రచారం అయితే పెద్ద ఎత్తున సాగింది. కొత్త ఏడాది వస్తూనే ఎన్నికల పర్వం ముగుస్తుంది అని అనుకున్నారు ఆ విధంగానే రాష్ట్ర ఎన్నికల సంఘం కూడా కసరత్తుని ప్రారంభించింది. ఏకంగా ఈవీఎంలను కూడా రెడీ చేస్తోంది. రాష్ట్రంలోని అన్ని మున్సిపాలిటీలు కార్పోరేషన్లకు ఎన్నికలు ముందుగానే నిర్వహించాలని కూడా భావించింది. అయితే ఇప్పుడు సడెన్ గా సంచలన నిర్ణయం దిశగా అడుగులు వేస్తోంది అని అంటున్నారు.
అదే కరెక్ట్ అని భావించి :
తాజాగా మున్సిపల్ శాఖ మంత్రి నారాయణ మీడియాతో మాట్లాడుతూ ఏపీలో లోకల్ బాడీ ఎలక్షన్స్ మీద కీలక వ్యాఖ్యలు చేశారు. వచ్చే ఏడాదిలోనే ఎన్నికలు జరుగుతాయని చెప్పారు. రాష్ట్రంలోని అన్ని కార్పోరేషన్లకు మునిసిపాలిటీలకు ఒకేసారి ఎన్నికలు నిర్వహిస్తామని ఆయన చెప్పుకొచ్చారు. వచ్చే ఏడాది మార్చి దాకా వాటి పాలక వర్గాలకు గడువు ఉంది. ఆ తరువాతనే ఎన్నికలు జరుగుతాయని హింట్ ఇచ్చేశారు.
జూన్ తరువాతనే :
దీనిని బట్టి చూస్తే వచ్చే ఏడాది జూన్ తరువాతనే లోకల్ బాడీ ఎన్నికలు జరిగే వీలు ఉందని అంటున్నారు. మార్చిలో పదవీకాలం పూర్తి అయినా ఏప్రిల్ నుంచి వేసవి కాలం మొదలవుతుంది, దాంతో ఆ సీజన్ లో ఎన్నికలకు వెళ్ళడం ఇబ్బంది అవుతుంది అనేక సమస్యలు కొత్తగా పుట్టుకుని వస్తాయని అంటున్నారు. దాంతో వానలు మెల్లగా మొదలై అంతా చల్లబడి కూల్ వెదర్ లోనే లోకల్ ఫైట్ నిర్వహిస్తే పూర్తి ఫలితాలు అనుకూలం అవుతాయని భావిస్తున్నారు అని అంటున్నారు.
వైసీపీ మూడ్ అదేనా :
లోకల్ బాడీ ఎన్నికల విషయంలో వైసీపీ నుంచి పెద్దగా ఆసక్తి కానీ ఉత్సాహం కానీ కనిపించడం లేదు అని అంటున్నారు పైగా అధికారంలో ఉన్న కూటమి మూడు పార్టీలతో వ్యవహారం దాంతో ఎంత కష్టపడినా ఫలితాలు ఏ విధంగా వస్తాయో తెలియదు అని అన్నది కూడా ఉంది. పైగా పోటీ చేసి ఇబ్బంది పడడం కంటే దూరంగా ఉండడం మేలు అన్న ఆలోచనలు కూడా ఆ పార్టీ చేస్తోంది అని ప్రచారం సాగుతున్న వేళ కూటమి కూడా ఇపుడే తొందర ఎందుకు ఎపుడైనా ఫలితం తమదే అన్న ధీమాగా ఉన్నట్లుగా చెబుతున్నారు.
అర్బన్ ఫుల్ క్లారిటీ :
ఇక మొదటి నుంచి అర్బన్ ఓటర్లు కూటమికి ఫేవర్ గానే ఉంటూ వస్తున్నారు. రూరల్ సెక్టార్ లో వైసీపీకి పట్టు ఉంది. ఇపుడు చేతిలో అధికారం ఉంది కాబట్టి అర్బన్ రూరల్ తేడా లేకుండా కూటమి మొత్తం గెలిచేస్తుంది అని లెక్కలేసుకుంటున్నారు. దాంతో ముందస్తు ఎన్నికలు అని హడావుడి పడే బదులు తాపీగా అన్ని విషయాలు చూసుకుంటూ బీసీ రిజర్వేషన్ మీద కూడా ఒక క్లారిటీతో నిర్ణయం తీసుకుటే అపుడు ఎన్నికలకు వెళ్తే రాజకీయంగా సామాజికంగా మేలు జరుగుతుందని భావిస్తోంది అని అంటున్నారు.
