Begin typing your search above and press return to search.

ఏపీ లిక్కర్ కేసులో స్పీడ పెంచిన ఈడీ.. మరో కీలక అరెస్టు!

ఏపీ లిక్కర్ స్కాంలో మనీలాండరింగ్ ఆరోపణలపై కేసు నమోదు చేసిన ఎన్ఫోర్స్మెంట్ డైరెక్టర్ అరెస్టులతో హడలెత్తిస్తోంది. కేసులో కీలక నిందితుడిగా చెబుతున్న మాజీ మంత్రి కారుమూరి నాగేశ్వరరావు కుమారుడు సునీల్ ను గురువారం అరెస్టు చేసింది.

By:  Tupaki Political Desk   |   18 Jun 2026 9:33 PM IST
ఏపీ లిక్కర్ కేసులో స్పీడ పెంచిన ఈడీ.. మరో కీలక అరెస్టు!
X

ఏపీ లిక్కర్ స్కాంలో మనీలాండరింగ్ ఆరోపణలపై కేసు నమోదు చేసిన ఎన్ఫోర్స్మెంట్ డైరెక్టర్ అరెస్టులతో హడలెత్తిస్తోంది. కేసులో నిందితుడిగా చెబుతున్న మాజీ మంత్రి కారుమూరి నాగేశ్వరరావు కుమారుడు సునీల్ ను గురువారం అరెస్టు చేసింది. అనంతరం హైదరాబాద్ లోని నాంపల్లి సీబీఐ కోర్టులో హాజరుపరిచింది. నిందితుడు సునీల్ కు 14 రోజుల రిమాండ్ విధిస్తూ న్యాయాధికారి తీర్పు ఇవ్వడంతో ఆయనను చంచల్ గూడ జైలుకు తరలించారు. ఇదే కేసులో ఇప్పటికే ఏ1 రాజ్ కేసిరెడ్డి, ఏ2 వాసుదేవరెడ్డి అరెస్టు అయ్యారు.

మాజీ మంత్రి కారుమూరి నాగేశ్వరరావు కుమారుడు సునీల్ అరెస్టుతో లిక్కర్ కేసు కీలక మలుపు తిరిగిందని అంటున్నారు. సునీల్ ను ఇప్పటికే పలుమార్లు విచారించిన ఈడీ అధికారులు ఆయన అరెస్టుకు నిర్ణయం తీసుకోవడం సంచలనంగా మారింది. ఇక సునీల్ తండ్రి మాజీ మంత్రి కారుమూరి నాగేశ్వరరావును విచారించేందుకు అధికారులు నోటీసులు జారీ చేశారు. దీంతో ఈ పరిణామం ఎక్కడికి దారితీస్తుందోనని టెన్షన్ పడుతున్నారు. ఈ నెల 23న కారుమూరిని విచారించేందుకు నోటీసులు ఇచ్చినట్లు చెబుతున్నారు.

మద్యం రవాణా టెండర్ దక్కించుకున్న నిందితుడు కారుమూరి సునీల్ ఏ1 రాజ్ కసిరెడ్డితో కలిసి డబ్బు విదేశాలకు తరలించినట్లు ఈడీ అభియోగాలు మోపింది. లిక్కర్ రవాణా చార్జీలను భారీగా పెంచి ప్రభుత్వ నిధులను దారిమళ్లించారని నిందితులు ఆరోపణలు ఎదుర్కొంటున్నారు. వీరికి ఏ2 వాసుదేవరెడ్డి సహకరించారని ఈడీ ఎఫ్ఐఆర్ లో పేర్కొంది. వాసుదేవరెడ్డి గత ప్రభుత్వంలో ఏపీ బెవరేజెస్ కార్పొరేషన్ ఎండీగా పనిచేశారు. తాజా అరెస్టుతో ఈడీ కేసులో ముగ్గురు జైలుకు వెళ్లినట్లు అయింది. ఇకపై మరెందరిని లోపలు వేస్తారోనన్న టెన్షన్ నిందితులను వెంటాడుతోందని అంటున్నారు.

మాజీ మంత్రి సునీల్ అరెస్టుతో విపక్ష పార్టీలో కలకలం రేగింది. సునీల్ గత ఎన్నికల్లో ఏలూరు పార్లమెంటు నియోజకవర్గం నుంచి వైసీపీ అభ్యర్థిగా పోటీ చేసి ఓడిపోయారు. దీంతో ఆయన అరెస్టు రాజకీయంగా తీవ్ర చర్చకు దారితీసిందని అంటున్నారు. నిందితుడికి వైసీపీతో ప్రత్యక్ష సంబంధాలు ఉండటంతో ఆయన అరెస్టు రాజకీయ వివాదంగా మారే అవకాశాలు ఉన్నాయని అంటున్నారు. ఇక మాజీ మంత్రి కారుమూరిని కూడా విచారించేందుకు అధికారులు సిద్ధమవుతుండటం హీట్ పుట్టిస్తోంది. ఈ వ్యవహారంలో మాజీ మంత్రి కారుమూరి భవిష్యత్తుపై రకరకాల చర్చ జరుగుతోంది.