Begin typing your search above and press return to search.

ఏపీ లో వార్డుల పునర్విభజన ప్రక్రియకు బ్రేక్.. ఏం జ‌రిగింది?

ఏపీ లో కీల‌క ప్ర‌క్రియ‌పై హైకోర్టు స్టే విధించింది. వ‌చ్చే సెప్టెంబ‌రు-అక్టోబ‌రు నాటికి.. రాష్ట్రంలో స్థానిక సంస్థ‌లతో పాటు.. గ్రామ పంచాయ‌తీల‌కు ఎన్నిక‌లు నిర్వ‌హించాల‌ని ప్ర‌భుత్వం నిర్ణ‌యించింది.

By:  Garuda Media   |   5 Jun 2026 9:52 AM IST
ఏపీ లో వార్డుల పునర్విభజన ప్రక్రియకు బ్రేక్.. ఏం జ‌రిగింది?
X

ఏపీ లో కీల‌క ప్ర‌క్రియ‌పై హైకోర్టు స్టే విధించింది. వ‌చ్చే సెప్టెంబ‌రు-అక్టోబ‌రు నాటికి.. రాష్ట్రంలో స్థానిక సంస్థ‌లతో పాటు.. గ్రామ పంచాయ‌తీల‌కు ఎన్నిక‌లు నిర్వ‌హించాల‌ని ప్ర‌భుత్వం నిర్ణ‌యించింది. ఈ క్ర‌మంలోనే.. కేంద్రం తీసుకురానున్న‌.. నియోజ‌క‌వ‌ర్గాల పున‌ర్విభ‌జ‌న‌కు అనుకూలంగా రాష్ట్రంలోని స్థానిక సంస్థ‌ల్లోనూ మార్పులు చేయాల‌ని నిర్ణ‌యించింది.

త‌ద్వారా కార్పొరేషన్లు, మున్సిపాలిటీల పరిధిలో.. వార్డుల పునర్విభజన ప్ర‌క్రియ‌ను చేప‌ట్టారు. గ‌త నెల లోనే ప్రారంభ‌మైన ఈ ప్ర‌క్రియ దాదాపు పూర్త‌య్యే ద‌శ‌కు చేరుకుంది. అయితే.. ఈ ప్ర‌క్రియ ప్రారంభించి న నాటి నుంచి వైసీపీ నాయ‌కులు, మాజీ కార్పొరేట‌ర్లు, కౌన్సిల‌ర్లు కూడా.. ఆందోళ‌న వ్య‌క్తం చేస్తున్నారు. విశాఖ‌ప‌ట్నం గ్రేట‌ర్‌కార్పొరేష‌న్‌ప‌రిధిలోను.. మ‌చిలీప‌ట్నం మునిసిపాలిటీ ప‌రిధిలోనూ.. వార్డుల విభ‌జ‌న స‌క్రంగా చేప‌ట్ట‌లేద‌ని ఆరోపిస్తూ.. గ‌తంలోనే హైకోర్టును ఆశ్ర‌యించారు.

దీని ని విచారించిన హైకోర్టు.. వాటి విభ‌జ‌న‌ను నిలిపివేసింది. తాజాగా మ‌రికొన్ని మునిసిపాలిటీలు, కార్పొ రేష‌న్ల‌పై కూడా కొంద‌రు హైకోర్టును ఆశ్ర‌యించారు. గుంటూరు, ఒంగోలు, ధర్మవరం, కడప, రాయచోటి.. ఏలూరు కార్పొరేషన్లు, మున్సిపాలిటీలలో జ‌రుగుతున్న పున‌ర్విభ‌జ‌న‌ను నిలిపి వేయాల‌ని కోరారు. వీటిపై విచార‌ణ చేసిన హైకోర్టు.. స‌ద‌రు ప్రాంతాల్లోనే కాకుండా.. మిగిలిన వాటిలోనూ పున‌ర్విభ‌జ‌న ప్ర‌క్రియ‌ను నిలిపి వేయాల‌ని ఆదేశాలు ఇచ్చింది. దీంతో రాష్ట్ర వ్యాప్తంగా వార్డులు, కార్పొరేష‌న్ల పున‌ర్విభ‌జ‌న నిలిచిపోయింది.

ఎందుకు?

వార్డు ల పునర్విభజన సహేతుకంగా జరగలేదని.. త‌మ‌కు అనుకూలంగా ఉన్న వార్డుల‌నే ల‌క్ష్యం గా చేసుకుని విభ‌జ‌న చేస్తున్నార‌న్న‌ది వైసీపీ నాయ‌కులు చేస్తున్న ఆరోప‌ణ‌. మ‌రోవైపు.. దీనిని బ‌లంగా అడ్డుకునేందుకు అధికారులు స‌రైన ఆధారాల‌ను హైకోర్టుకు చూపించ‌లేక పోయారు. దీనికి తోడు.. కేంద్రం వ‌చ్చే 2027 వ‌ర‌కు వార్డులు స‌హా.. రెవెన్యూ ప్రాంతాల‌ను, జిల్లాల‌ను కూడా విభ‌జించేందుకు వీల్లేద‌ని గ‌త ఏడాదే రాష్ట్రాల‌కు తేల్చి చెప్పింది. ఈ నేప‌థ్యంలోనే వైసీపీకి చెందిన నాయ‌కులు హైకోర్టులో పిటిషన్లు దాఖలుచేశారు.