Begin typing your search above and press return to search.

హెల్త్ రికార్డుల డిజిటలైజేషన్...కూటమి కొత్త అడుగులు !

దాని వల్ల రానున్న రోజులలో ఏపీని ఆరోగ్యాంధ్రాగా మార్చేందుకు కూడా కూటమి ప్రభుత్వం చర్యలు తీసుకుంటోంది. జనవరి 1 నుంచి ప్రజల ఆరోగ్య రికార్డులను డిజిటలైజ్‌ చేస్తున్నామని ముఖ్యమంత్రి చంద్రబాబు తెలిపారు

By:  Satya P   |   13 Sept 2026 4:00 AM IST
హెల్త్ రికార్డుల డిజిటలైజేషన్...కూటమి కొత్త అడుగులు !
X

దేశంలో ఎక్కడా లేని విధంగా ఏపీలో ఆరోగ్య రంగంలో సరికొత్త అడుగులను కూటమి ప్రభుత్వం వేస్తోంది. దాదాపుగా అయిది కోట్లకు పైబడిన ఏపీ జనాభాకు సంబంధించి ప్రతీ ఒక్కరి ఆరోగ్యానికి సంబంధించి పూర్తి డేటాను సేకరించడమే కాదు వాటిని డిజిటలైజేషన్ చేయాలని నిర్ణయం తీసుకుంది. దీని వల్ల రాష్ట్రంలో వైద్యారోగ్య రంగానికి కొత్త రూపు రేఖలు రానున్నాయి. అలాగే టెక్నాలజీని అందుబాటులోకి తీసుకుంటూ ప్రజల ఆరోగ్య పరిస్థితులు ఎప్పటికపుడు డేటా ద్వారా తెలుసుకోవడమే కాదు నివారణకు నియంత్రయణకు మార్గం సుగగం అవుతుందని భావిస్తున్నారు. దాని వల్ల రానున్న రోజులలో ఏపీని ఆరోగ్యాంధ్రాగా మార్చేందుకు కూడా కూటమి ప్రభుత్వం చర్యలు తీసుకుంటోంది. జనవరి 1 నుంచి ప్రజల ఆరోగ్య రికార్డులను డిజిటలైజ్‌ చేస్తున్నామని ముఖ్యమంత్రి చంద్రబాబు తెలిపారు

మెరుగైన వైద్య సేవల కోసం :

ఆంధ్రాలో రానున్న కాలంలో వైద్యారోగ్య రంగంలో సాంకేతికతను విస్తృతంగా వినియోగించి ప్రజలకు మెరుగైన వైద్య సేవలు అందించడమే లక్ష్యంగా కూటమి ప్రభుత్వం ముందుకు సాగుతోందని ఆయన ప్రకటించారు. రాష్ట్ర వ్యాప్తంగా 249 కోట్ల రూపాయలతో వ్యయంతో ఏర్పాటు చేసిన 10 క్రిటికల్‌ కేర్‌ బ్లాకులు అలాగే 12 ఇంటిగ్రేటెడ్‌ పబ్లిక్‌ హెల్త్‌ ల్యాబరేటరీలను తాజాగా కేంద్ర మంత్రి జేపీ నడ్డాతో కలసి చంద్రబాబు ప్రారంభించారు . ఈ ప్రాజెక్టులతో రాష్ట్రంలో 500 క్రిటికల్‌ కేర్‌ బెడ్లు అందుబాటులోకి వచ్చాయి. అత్యాధునిక ఆపరేషన్‌ థియేటర్లు, అల్ట్రాసౌండ్‌ సదుపాయాలతో పాటు కార్డియాలజీ, నెఫ్రాలజీ, న్యూరాలజీ, న్యూరోసర్జరీ వంటి కీలక వైద్య విభాగాల సేవలు అందుబాటులోకి వచ్చాయని చంద్రబాబు తెలిపారు. దీంతో అత్యవసర పరిస్థితుల్లో పేద మధ్యతరగతి కుటుంబాలకు మెరుగైన వైద్యం మరింత చేరువ కానుంది. అత్యాధునిక వైద్యం కోసం సుదూర ప్రాంతాలకు వెళ్లాల్సిన ఇబ్బందులను తగ్గించేలా ఈ సదుపాయాలను కూటమి ప్రభుత్వం అందుబాటులోకి తెచ్చింది.

వంటశాలను ఫార్మసీగా

ఇదిలా ఉండగా చంద్రబాబు ఏపీ ప్రజలకు ఒక కీలక సలహా ఇచ్చారు. ప్రతీ ఒక్కరూ తీసుకునే ఆహారాన్ని ఔషధంగా భావించాలని సూచించారు. ఈ మేరకు ఆరోగ్య పద్దతులను మార్చుకోవాలని చెప్పారు. యోగా, ప్రాణాయామం, ధ్యానం వంటి వాటిని నిత్య జీవితంలో భాగం చేసుకోవాలని కూడా సూచించారు. యోగాభ్యాసంతో ఎనర్జీ లెవల్స్‌ పెరుగుతాయని అన్నారు. సంప్రదాయ పద్ధతులను పాటిస్తూనే సాంకేతికతను అందిపుచ్చుకుంటే ఆరోగ్యకరమైన సమాజాన్ని నిర్మించవచ్చని తెలిపారు. మరో వైపు చూస్తే వైద్యారోగ్య రంగంతో పాటు అన్ని రంగాల్లోనూ రాష్ట్రాన్ని అభివృద్ధి చేస్తున్నామని బాబు చెబుతున్నారు.

హెల్తీ–వెల్తీ–హ్యాపీ ఏపీ :

హెల్తీ–వెల్తీ–హ్యాపీ ఆంధ్రప్రదేశ్‌ దిశగా రాష్ట్రాన్ని అభివృద్ధి చేస్తామని బాబు స్పష్టం చేస్తున్నారు. ఇదిలా ఉంటే అమరావతి క్వాంటం బయో వ్యాలీకి జాతీయ గుర్తింపు ఇస్తే మరింతగా అభివృద్ధి సాధ్యమని అన్నారు. ఏపీలో చూస్తే కేంద్ర ప్రభుత్వం మంగళగిరి ఎయిమ్స్‌ను అద్భుతంగా అభివృద్ధి చేస్తోందని, జన ఔషధి కేంద్రాల ద్వారా పేదలకు మందులు అందుతున్నాయని చెప్పారు. అలాగే అభా కార్డుల ద్వారా మెరుగైన వైద్య సేవలు అందుబాటులోకి వస్తున్నాయని చంద్రబాబ్ తెలిపారు. అలాగే ఫార్మా రంగానికి ఆంధ్రప్రదేశ్‌ చిరునామాగా ఉందని మెడ్‌టెక్‌ పార్కు ద్వారా వైద్య పరికరాల ఉత్పత్తిని ప్రోత్సహిస్తున్నామని బాబు గుర్తు చేస్తున్నారు.