విద్యార్థులకు, తల్లితండ్రులకు లోకేష్ సూపర్ గుడ్ న్యూస్!
రాష్ట్రంలో కూటమి అధికారంలోకి వచ్చే నాటికి ఆర్ధిక పరిస్థితి చాలా అధ్వాన్నంగా ఉందని ఇప్పటికే ముఖ్యమంత్రి, మంత్రులు వెళ్లడించిన సంగతి తెలిసిందే.
By: Raja Ch | 11 Feb 2026 10:44 AM ISTరాష్ట్రంలో కూటమి అధికారంలోకి వచ్చే నాటికి ఆర్ధిక పరిస్థితి చాలా అధ్వాన్నంగా ఉందని ఇప్పటికే ముఖ్యమంత్రి, మంత్రులు వెళ్లడించిన సంగతి తెలిసిందే. అయినప్పటికీ ఎన్నికల్లో ఇచ్చిన మాటకు కట్టుబడి.. ఒక్కో ఇటుకా పేరుస్తూ.. రాష్ట్ర ఆర్థిక పరిస్థితిని గాడిన పెడుతూ.. మరోపక్క హామీలకు కట్టుబడి పాలన సాగుతున్న పరిస్థితి. ఈ నేపథ్యంలో తాజాగా మరో కీలక హామీని లోకేష్ నెరవేర్చారు. ఇందులో భాగంగా.. ఫీజు రీయింబర్స్ మెంట్ బకాయిల విడుదలకు గ్రీన్ సిగ్నల్ ఇచ్చారు.
అవును... రాష్ట్రంలోని విద్యార్థులకు కూటమి ప్రభుత్వం శుభవార్త చెప్పింది. ఇందులో భాగంగా... విద్యాశాఖ మంత్రి లోకేష్ ప్రత్యేక చొరవతో, సీఎం ఆదేశాల మేరకు రాష్ట్ర ప్రభుత్వం ఫీజు రీయింబర్స్ మెంట్ బకాయిల విడుదలకు గ్రీన్ సిగ్నల్ ఇచ్చింది. ఈ క్రమంలో.. 2024-25 విద్యా సంవత్సరానికి సంబంధించి బీసీ, ఆర్థికంగా బలహీన వర్గాలు, మైనారిటీ విద్యార్థుల కోసం రూ.1,198 కోట్ల రీయింబర్స్ మెంట్ ఆఫ్ ట్యూషన్ ఫీ (ఆర్టీఎఫ్) నిధులను ఆర్థిక శాఖ విడుదల చేసింది.
ఈ సందర్భంగా ‘ఎక్స్’ వేదికగా స్పందించిన ఏపీ విద్యాశాఖ మంత్రి నారా లోకేష్... ఆంధ్రప్రదేశ్ రాష్ట్రవ్యాప్తంగా ఉన్న లక్షలాది మంది విద్యార్థులకు తక్షణ సాయం అందిస్తూ ఫీజు రీయింబర్స్ మెంట్, స్కాలర్ షిప్ ల కోసం రూ.1,200 కోట్లను విడుదల చేసినట్లు తెలియజేయడానికి తాను ఎంతో సంతోషిస్తున్నట్లు తెలిపారు. ఇదే సమయంలో.. దీనికి సంబంధించిన బడ్జెట్ విడుదల ఉత్తర్యులు (బీ.ఆర్.ఓ) కూడా జారీ అయ్యాయని ప్రకటించారు.
ఈ సందర్భంగా... విద్యలో ఎవరికీ ఎటువంటి అడ్డంకులూ ఎదురుకావని.. పెండింగులో ఉన్న అన్ని బకాయిలను చెల్లించడం, భవిష్యత్తులోనూ సకాలంలో సహాయం అందేలా చూడటం తమ ప్రభుత్వ స్పష్టమైన నిబద్ధత అని.. ప్రతీ విద్యార్థికి, తల్లితండ్రులకు మంత్రి నారా లోకేష్ స్పష్టమైన హామీ ఇచ్చారు. ఇదే సమయంలో... పూర్తి విశ్వాసంతో చదువుకోవాలని.. మీ ప్రభుత్వం మీకు అండగా ఉంటుందని విద్యార్థులకు సూచించారు.
ఈ సందర్భంగా విడుదల చేసిన నిధుల వివరాలు ఈ విధంగా ఉన్నాయి..!
బీసీ విద్యార్థులకు: రూ.735 కోట్లు
ఈడబ్ల్యూఎస్ (ఈబీసీ & ఓసీ) విద్యార్థులకు: రూ.365 కోట్లు
క్రీస్టియన్, ముస్లిం మైనారిటీ విద్యార్థులకు: రూ.98 కోట్లు
