Begin typing your search above and press return to search.

మూడో ఏట కూటమి వేళకు వారికి గుడ్ న్యూస్

ఏపీలో టీడీపీ నాయకత్వంలో కూటమి ప్రభుత్వం కొలువు తీరి జూన్ 12 నాటికి రెండేళ్ళు పూర్తి అయి మూడవ ఏటలోకి అడుగుపెడుతుంది.

By:  Satya P   |   24 April 2026 9:13 AM IST
మూడో ఏట కూటమి వేళకు వారికి గుడ్ న్యూస్
X

ఏపీలో టీడీపీ నాయకత్వంలో కూటమి ప్రభుత్వం కొలువు తీరి జూన్ 12 నాటికి రెండేళ్ళు పూర్తి అయి మూడవ ఏటలోకి అడుగుపెడుతుంది. ఈ సందర్భంగా కీలక నిర్ణయాలకు ప్రకటించాలని కొన్ని వర్గాలకు శుభ వార్తలు వినిపించాలని కూటమి పెద్దలు ఆలోచిస్తున్నారు. ఈసారి కూటమి ప్రభుత్వం మూడవ వసంతాన్ని గ్రాండ్ గా నిర్వహించడంతో పాటు గత రెండేళ్లలో తాము ఏపీ ప్రజలకు ఏమి చేశామో చెప్పడం అలాగే ఏమి చేస్తామో కూడా వివరించడం జరుగుతుందని అంటున్నారు.

లక్షల్లో పెన్షన్లు :

ఈసారి కూటమి సామాజిక పెన్షన్ కోసం ఎదురుచూస్తున్న వారికి శుభవార్తను వినిపించనుంది. ఈ ఏడాది జూన్ నుంచి కొత్తవారికి పెన్షన్ ఇవ్వాలని నిర్ణయించింది. ముందుగా అర్హులుగా ఉన్న వితంతువులకు పింఛన్లు ఇవ్వాలని నిర్ణయించింది. ఇక ఏపీవ్యాప్తంగా చూస్తే ఒక లక్షా 53 వేల మంది దాకా వితంతువు పెన్షన్ కి అర్హులని ప్రభుత్వ వర్గాలు అంచనా వేశాయి. . వీరందరికీ పెన్షన్ మంజూరు చేయాలని భావిస్తున్నారు అని అంటున్నారు. ఈ విధంగా వీరికి నెలకు నాలుగు వేల మంది వంతున పెన్షన్ అందిస్తే కనుక కొత్తగా ప్రభుత్వ ఖజానాకు నెలకు 61 కోట్ల రూపాయలు ఖర్చు అవుతుందని లెక్క వేస్తున్నారు.

మరణించిన వెంటనే :

ఒక కుటుంబంలో సామాజిక పెన్షన్ తీసుకుంటున్న భర్త మరణిస్తే ఆ మరుసటి నెలలోనే అంటే మరణ ధ్రువీకరణ పత్రం జారీ అయిన వెంటనే సదరు సామాజిక పెన్షన్ ని అతని భార్య పేరు మీదకు ప్రభుత్వం బదలాయిస్తోంది. దీనికి స్పౌజ్ కేటగిరీగా పేరు పెట్టింది. అంటే ఆ కుటుంబం అప్పటి వరకూ అందుకుంటున్న పింఛను ఆసరా కోల్పోకుండా కూటమి ప్రభుత్వం ఈ విధంగా అండగా ఉంటోంది అన్న మాట. ఇలా ఇప్పటివరకు 2.30 లక్షల మందికి కొత్తగా పెన్షన్లు కూటమి ప్రభుత్వం అందించింది.

వితంతువు కేటగిరిలో :

అయితే పెన్షన్ అందుకోకుండానే భర్త చనిపోతే అతని భార్యకు వితంతు కేటగిరీలో వెంటనే పెన్షన్ రావడం లేదు. దాంతో వారంతా తమకు కూడా పెన్షన్ ఇవ్వాలని కోరుతున్నారు. వీరి కోసం కూటమి ఎమ్మెల్యేలు కూడా ప్రభుత్వానికి సిఫార్సు చేస్తున్నారు. దాంతో ప్రభుత్వం కీలకమైన నిర్ణయం తీసుకుంది అని అంటున్నారు. అదే వరసలో అర్హులైన దివ్యాంగులకు కొత్త పింఛన్లు అందించాలని ప్రభుత్వం నిర్ణయం తీసుకున్నట్లు తెలుస్తోంది. ఈ కేటగిరీలో కూడా ఇప్పటికే లక్షమంది దరఖాస్తు చేసుకున్నారు. ఇందులో అనర్హులను గుర్తించి పక్కాగా జాబితా తయారు చేసే పనిలో అధికారులు ఉన్నారు.

మొత్తం 28 కేటగిరీలు :

ఇదిలా ఉంటే సామాజిక పెన్షన్ లో ఏకంగా 28 కేటగిరీలు ఉన్నాయి. వారిలో వృద్ధులు, వితంతువులు, ఒంటరి మహిళలు, దివ్యాంగులు, ఆరోగ్య పింఛన్లు ఇలా అన్నీ కలిపి ప్రభుత్వం 28 కేటగిరీలను గుర్తించి వారికి ప్రతి నెలా పెన్షన్లు అందిస్తోంది. ఇపుడు చూస్తే ఈ 28 కేటగిరీలలో కలిపి కొత్తగా పెన్షన్ల కోసం దాదాపుగా 10 లక్షల మంది దరఖాస్తు చేసే అవకాశముంటుందని అధికారులు అంచనా వేస్తున్నారు. ఇలా వీరందరికీ పెన్షన్ ఇవ్వాలంటే నెలకు అదనంగా మరో నాలుగు వందల కోట్ల రూపాయలు వంతున ఏడాదికి నాలుగు వేల ఎనిమిది వందల కోట్ల రూపాయలు ఖర్చవుతుందని అధికారులు ఇప్పటికే కూటమి ప్రభుత్వానికి నివేదిక అందించారు. వీటిని పరిశీలించిన మీదట ప్రభుత్వం ఎంతమందికి కొత్త పెన్షన్ ఇస్తుంది అన్నది తెలుస్తుంది అంటున్నారు.