మరో 20 రోజులే గడువు.. 'జిల్లాలను' ఏం చేస్తారు?
మార్కాపురంలో కొన్ని నియోజకవర్గాలు, మండలాలను కలపడంపై ఇక్కడి ప్రజల నుంచి వ్యతిరేకత వ చ్చింది. అదేవిధంగా పార్వతీపురం మన్యం జిల్లాలోనూ మండలాల విభజనను అక్కడి వారు తప్పుబట్టారు.
By: Garuda Media | 6 Dec 2025 9:00 PM ISTఏపీ ప్రభుత్వం తలపోస్తున్న జిల్లాల విభజన అంశం మరోసారి చర్చనీయాంశం అయింది. ఇటీవల రెండు కొత్త జిల్లాలను ఏర్పాటు చేయడంతోపాటు 5 డివిజన్లను కూడా కొత్తగా తీసుకువస్తున్నామని ప్రకటించింది. వీటిలో మార్కాపురం, మదనపల్లె జిల్లాలు ఉండగా.. నెల్లూరు, చిత్తూరు, ప్రకాశం జిల్లాల్లో డివిజన్లను కూడా ఏర్పాటు చేస్తున్నారు. ఈ ప్రక్రియకు ముగింపు పలకాలని భావించిన సమయంలో అనూహ్యంగా బ్రేక్ పడింది.
మార్కాపురంలో కొన్ని నియోజకవర్గాలు, మండలాలను కలపడంపై ఇక్కడి ప్రజల నుంచి వ్యతిరేకత వ చ్చింది. అదేవిధంగా పార్వతీపురం మన్యం జిల్లాలోనూ మండలాల విభజనను అక్కడి వారు తప్పుబ ట్టారు. దీంతో ప్రభుత్వం దీనిపై పునరాలోచన చేయనున్నట్టు పేర్కొంది. కానీ.. ఈ లోగా.. దీనిపై దృష్టి పెట్టిన వారు లేకుండా పోయారు. మంత్రి అనగాని సత్యప్రసాద్ నేతృత్వంలో కమిటీ ఏర్పడినా.. సీఎం చంద్రబాబు దీనిపై సమీక్షలు చేసినా.. ఇప్పటికీ పూర్తిస్థాయిలో నిర్ణయం తీసుకోలేదు.
ఇదిలావుంటే.. ఈ నెల 26 వరకు మాత్రమే కొత్త జిల్లాలు, డివిజన్లు, మండల కేంద్రాల ఏర్పాటుకు అవకా శం ఉంటుంది. దీనికి గాను మహా అయితే.. మరో 20 రోజుల సమయమే ఉంది. అప్పటిలోగా డివిజన్లు, జిల్లాల సరిహద్దులను సరిచేసి కేంద్ర గణాంక శాఖకు నివేదికను పంపించాల్సి ఉంటుంది. ఆ తర్వాత.. మార్పులు చేసేందుకు అవకాశం లేదు.
వచ్చే ఏడాది జనవరి-ఫిబ్రవరి మధ్య ఎప్పుడైనా జనాభా లెక్కల సేకరణ ఉంటుంది. ఈ నేపథ్యంలో సర్కారు జిల్లాల విభజన చేస్తుందా? లేక.. తర్వాత దీనిపై కసరత్తు చేస్తుందా? అనేది చూడాలి. ప్రస్తుతం ఈ విషయంలో ప్రభుత్వం మౌనంగా ఉందన్న సంకేతాలు వస్తున్నాయి.
