Begin typing your search above and press return to search.

'ఢిల్లీ'పై ప‌ట్టు బిగిస్తారా బాబూ ..!

ఇదే కాకుండా.. అమ‌రావతిలో క్వాంట‌మ్ వ్యాలీ ఏర్పాటు, ఏఐ యూనివ‌ర్సిటీ, ఐటీ పార్కు వంటి ప్రాజెక్టు ల‌పై చంద్ర‌బాబు చాలానే ఆశ‌లు పెట్టుకున్నారు.

By:  Tupaki Desk   |   3 July 2025 5:00 AM IST
ఢిల్లీపై ప‌ట్టు బిగిస్తారా బాబూ ..!
X

కూట‌మి ప్ర‌భుత్వంగా ముందుకు సాగుతున్న చంద్ర‌బాబుకు ఏడాది కాలంలో పెద్ద‌గా ఇబ్బందులు ఎదు రు కాలేదు. అన్నీ స‌ర్దుకు పోతున్నారు కూడా. కేంద్రం నుంచి రాష్ట్రానికి ఎంత కాద‌ని అనుకున్నా.. ఔన‌ని అనుకున్నా.. సాయం అయితే కావాల్సిందే క‌దా! ఈ విష‌యంలో త‌మ‌కు ఇబ్బంది లేకుండా.. త‌మ స‌మ స్య‌లు తెలుసుకుని కేంద్రం సాయం చేస్తుంద‌ని కూట‌మి ప్ర‌బుత్వానికి నేతృత్వం వ‌హిస్తున్న నాయ‌కుడి గా.. ముఖ్య‌మంత్రిగా చంద్ర‌బాబు భావించారు.

ఇక‌, ఏడాది కాలంగా.. కేంద్రం కూడా రాష్ట్రానికి అన్ని విధాలా స‌హ‌కారం అందిస్తూనే ఉంద‌ని సీఎం చం ద్రబాబు, డిప్యూటీ సీఎం ప‌వ‌న్ క‌ల్యాణ్ కూడా చెబుతున్నారు. పైకి వారు ఎలా చెబుతున్నా.. అంత‌ర్గ‌తం గా చూసుకుంటే మాత్రం కేంద్రం ఉంచి స‌హ‌కారం మ‌రింత పెర‌గాల్సిన అవ‌స‌రం ఉంద‌ని ప్ర‌భుత్వ వ‌ర్గాలే చెబుతున్నాయి. పోల‌వ‌రం, రాజ‌ధాని అమ‌రావ‌తి విష‌యాల్లో.. కేంద్రం స‌హ‌కారం మ‌రింత ఎక్కు వ‌గా కావాల్సి ఉంద‌ని అంటున్నాయి.

ఇదే కాకుండా.. అమ‌రావతిలో క్వాంట‌మ్ వ్యాలీ ఏర్పాటు, ఏఐ యూనివ‌ర్సిటీ, ఐటీ పార్కు వంటి ప్రాజెక్టు ల‌పై చంద్ర‌బాబు చాలానే ఆశ‌లు పెట్టుకున్నారు. వీటిని సాధించేందుకు ఆయ‌న ప్ర‌య‌త్నాలు చేస్తున్నా రు. అదేస‌మ‌యంలో ఏరోస్పేస్ టెక్నాల‌జీ, డీప్ టెక్ టెక్నాల‌జీ వంటివాటిని కూడా ఏపీలో ఏర్పాటు చేస్తా మని చెబుతున్నారు. అయితే.. వీట‌న్నిటికీ.. అనుమ‌తుల‌ను కేంద్రమే ఇవ్వాలి. ఇవ‌న్నీ కేంద్రం ప‌రిధిలో నే ఉంటాయి. ఇప్పుడున్న ప‌రిస్థితి స‌హ‌క‌రిస్తుంద‌ని కూట‌మి ప్ర‌భుత్వం ఆశ‌లు పెట్టుకుంది.

అయితే.. ఇవే ప్రాజెక్టుల‌ను వేరే రాష్ట్రాలుకూడా కోరుతున్నాయి. పైగా.. ఆయా ప్రాజెక్టులు ఏర్పాటు చేసేందుకు రాష్ట్ర ప్ర‌భుత్వాల‌కు నిధులు కూడా అవ‌స‌రం. సో.. ఇవ‌న్నీసాకారం కావాలంటే.. కేంద్రంపై ప‌ట్టు పెంచుకోవాల్సిన అవ‌స‌రం ఉంద‌ని అంటున్నారు. అంటే.. కేంద్రాన్ని ఒప్పించే విధంగా చంద్ర‌బాబు ఢిల్లీపై మ‌రింత ప‌ట్టు పెంచాల‌ని సూచిస్తున్నారు. త‌ద్వారా.. ఢిల్లీ నుంచి నిధులు, అనుమ‌తులు తెచ్చు కునే అవ‌కాశం ఉంటుంద‌ని చెబుతున్నారు. మ‌రి ఏం జ‌రుగుతుందో చూడాలి.