Begin typing your search above and press return to search.

40 సెకన్లలో కోరుకున్న కాఫీని అందించే చిట్టి

ఏపీ ప్రభుత్వం అత్యంత ప్రతిష్ఠాత్మకంగా భావిస్తున్న భాగస్వామ్య సదస్సు పండక్కి ఉక్కునగరమైన విశాఖ ముస్తాబైన సంగతి తెలిసిందే.

By:  Garuda Media   |   14 Nov 2025 9:24 AM IST
40 సెకన్లలో కోరుకున్న కాఫీని అందించే చిట్టి
X

ఏపీ ప్రభుత్వం అత్యంత ప్రతిష్ఠాత్మకంగా భావిస్తున్న భాగస్వామ్య సదస్సు పండక్కి ఉక్కునగరమైన విశాఖ ముస్తాబైన సంగతి తెలిసిందే. ఈ రోజు ఉపరాష్ట్రపతి ప్రారంభించే ఈ కార్యక్రమం కాన్ఫెడరేషన్ ఆఫ్ ఇండియన్ ఇండస్ట్రీ.. ఏపీ ప్రభుత్వం సంయుక్తంగా నిర్వహిస్తున్నారు. రెండు రోజులు జరిగే ఈ సదస్సు ద్వారా ఏపీకి భారీ ఎత్తున పెట్టుబడులు ఆశిస్తున్నారు. విశాఖను గ్లోబల్ ట్రేడ్ గేట్ వేగా మార్చేందుకు ప్రయత్నిస్తున్న ఏపీ ముఖ్యమంత్రి చంద్రబాబు.. ప్రపంచ వ్యాప్తంగా వచ్చే పలు సంస్థలతో 410కి పైగా ఎంవోయూలో చేసుకోనున్న సంగతి తెలిసిందే.

ఈ సదస్సు ద్వారా పదకొండు రంగాల్లో రూ.9.76 లక్షల కోట్ల పెట్టుబడులతో పాటు.. 7.48 లక్షల మందికి ఉద్యోగాలు లభిస్తాయని లెక్కలు వేసుకుంటున్నారు. మరో ఆసక్తికరమైన అంశం ఏమంటే.. ఈ సదస్సులో చేసుకునే ఎంవోయిల ద్వారా ఏపీలోని నాలుగు ప్రాంతాలు (సీమ, కోస్తా, దక్షిణ కోస్తా, సెంట్రల్ ఆంధ్రా) పెట్టుబడులు.. పరిశ్రమలు రానున్నట్లుగా చెబుతున్నారు. జాతీయ, అంతర్జాతీయ కంపెనీల ప్రతినిధులు హాజరయ్యే ఈ సదస్సులో ఏపీ ముఖ్యమంత్రి చంద్రబాబు చూపు పడే ఒక స్టాల్ ను ఏర్పాటు చేశారు.

దీని ప్రత్యేకత ఏమంటే.. కోరుకున్న కాఫీని 40 సెకన్లలో తయారు చేస్తోంది అక్కడున్న రోబో. ఏయూ ఇంజనీరింగ్ కళాశాల మైదానంలో పలు స్టాళ్లను ఏర్పాటు చేయగా.. ‘రోబోటిక్ కేఫే’ పలువురిని ఆకర్షిస్తోంది. మనుషుల అవసరం లేకుండా.. వినియోగదారులు కోరుకున్న కాఫీని తయారు చేసేలా రోబోను సిద్ధం చేశారు. నాలుగు ఫ్లేవర్లలో కాఫీని ఈ చిట్టి రోబో తయారు చేయనుంది.

ఈ తరహా స్టాల్ కు స్థలం కూడా పెద్ద అవసరం లేకుండా నిర్వాహకులు ప్లాన్ చేశారు. మాల్స్ మొదలుకొని పర్యాటక ప్రదేశాల్లో కేవలం వంద చదరపు అడుగుల విస్తీర్ణంలో దీన్ని ఏర్పాటు చేయొచ్చని చెబుతున్నారు. కోరుకున్న కాఫీని 40 సెకన్లలో తయారు చేసే ఈ చిట్టి రోబోను రష్యన్ కంపెనీ సహకారంతో ఈ స్టాల్ నిర్వాహకుడు ఐజాక్ చెబుతున్నారు. రాష్ట్ర ముఖ్యమంత్రి చంద్రబాబు చూపు పడేలా సిద్దం చేసిన ఈ స్టాల్.. ఆయన ఎలా రియాక్టు అవుతారో చూడాలి.