Begin typing your search above and press return to search.

పేదల కోసం కూటమి సర్కార్ గుడ్ న్యూస్

అలాంటి వారందరినీ పట్టణాలలో అయితే రెండు సెంట్లు గ్రామీణ ప్రాంతాలలో అయితే మూడు సెంట్ల స్థలం ఉచితంగా ఇస్తామని ముఖ్యమంత్రి చంద్రబాబు అసెంబ్లీలో కీలకమైన ప్రకటన చేశారు. రాష్ట్రంలో పేదలందరికీ నివాసం ఉండాలన్నది ప్రభుత్వం విధానంగా ఆయన చెప్పుకొచ్చారు.

By:  Satya P   |   27 Feb 2026 10:36 PM IST
పేదల కోసం కూటమి సర్కార్ గుడ్ న్యూస్
X

ఏపీలో పేదల కోసం టీడీపీ కూటమి ప్రభుత్వం గుడ్ న్యూస్ చెప్పింది. పేదలను ఒక ఇంటి వారిని చేస్తామని ప్రకటించింది. ఇల్లు లేని పేదలు ఉంటే కనుక వారికి సొంతింటి కలను నెరవేరుస్తామని కూడా స్పష్టం చేసింది. ఏపీలో చూస్తే ఏకంగా 2.20 లక్షల మంది పేదలకు సొంత ఇంటి స్థలాలు కూడా లేని పరిస్థితి ఉంది. అలాంటి వారందరినీ పట్టణాలలో అయితే రెండు సెంట్లు గ్రామీణ ప్రాంతాలలో అయితే మూడు సెంట్ల స్థలం ఉచితంగా ఇస్తామని ముఖ్యమంత్రి చంద్రబాబు అసెంబ్లీలో కీలకమైన ప్రకటన చేశారు. రాష్ట్రంలో పేదలందరికీ నివాసం ఉండాలన్నది ప్రభుత్వం విధానంగా ఆయన చెప్పుకొచ్చారు.

అదే ప్రభుత్వ లక్ష్యం :

ఏపీలో అందరికీ ఇళ్ళు ఇవ్వాలన్నది ప్రభుత్వం లక్ష్యమని చంద్రబాబు చెప్పారు. ఇప్పటికే లక్ష్లాది ఇళ్ళ నిర్మాణాలు పేదల కోసం రాష్ట్రంలో జరుగుతున్నాయని ఆయన వివరించారు. ఉగాదిలోగా మూడు లక్షల ఇళ్ళ లబ్దిదారులకు వాటిని అందించి ఆ ఇంట్లో గృహ ప్రవేశం చేయిస్తామని చంద్రబాబు చెప్పారు. అలాగే ఇదే ఏడాది జూన్ నాటికి 2.26 లక్షల్ ఇళ్ళు, సెప్టెంబర్ నాటికి 2.10 లక్షల ఇళ్ళకు గృహ ప్రవేశం చేయిస్తామ్ని కూడా బాబు చెప్పారు. మొత్తంగా చూస్తే కనుక 2026 ఏడాదిలో ఏక్నగా 10.63 లక్షల ఇళ్ళలో గృహ నిర్మాణాలు జరుగుతాయని బాబు స్పష్టమైన ప్రకటన చేశారు. ఆ దిశగా ప్రస్తుతం గృహ నిర్మాణం పనులు పెద్ద ఎత్తున సాగుతున్నాయని ఆయన అంటున్నారు.

ఇళ్ళు లేని వారి కోసం :

ఇదిలా ఉంటే ఏపీలో ఇళ్ళు లేని వారు ఎవరూ దిగులు చెందవద్దు అని చంద్రబాబు అన్నారు. వారంతా ఇళ్ళ కోసం దరఖాస్తు చేసుకోవాలని ఆయన కోరారు. కేంద్ర రాష్ట్ర ప్రభుత్వాలు పేదలకు ఇళ్ళు ఇవ్వాలని సంకల్పించాయని ముఖ్యమంత్రి గుర్తు చేశారు. ఇళ్ళ స్థలాలను ఉచితంగా ఇవ్వడమే కాకుండా 2029 లోగా పేదలందరికీ ఇళ్ళు కట్టించి ఇచ్చే బాధ్యతలను ప్రభుత్వం తీసుకుంటుంది అని బాబు చెప్పారు.

పేదలకు వరంగా :

ఒక విధంగా ముఖ్యమంత్రి చంద్రబాబు అసెంబ్లీలో చేసిన ఈ కీలక ప్రకటనతో పేదలకు అతి పెద్ద భరోసా దొరికినట్లు అయింది అని అంటున్నారు. ఈ రోజుకీ సొంత ఇల్లు లేని వారు ఎంతో మంది ఉన్నారు. వారందరికీ ఇళ్ళ స్థలాలే కాదు, ఇళ్ళు కట్టించి ఇస్తామని ప్రభుత్వం చెప్పడం అతి పెద్ద ఊరటగా భావించాల్సి ఉంది అని అంటున్నారు. అంతే కాదు పట్టణాలలో రెండు సెంట్లు అంటే ఖరీదైన విలువైన సంపద పేదలకు అందుతుందని అని అంటున్నారు. మొత్తం మీద చూస్తే ఏపీలో పేదలకు సొంతింటి కలను తీర్చే పనిలో ప్రభుత్వం వేగంగా అడుగులు వేస్తోంది.