Begin typing your search above and press return to search.

బాబు గారి బస్సు రయ్ రయ్ మని దూసుకొస్తోంది !

తాజాగా కర్నూల్ జిల్లా పర్యటనలో భాగంగా ఆయన జరిగిన సభలో మాట్లాడుతూ మహిళలకు ఉచిత బస్సు హామీపై కీలకమైన ప్రకటన చెశారు.

By:  Tupaki Desk   |   18 May 2025 8:45 AM IST
బాబు గారి బస్సు రయ్ రయ్ మని దూసుకొస్తోంది !
X

ఏపీలో టీడీపీ కూటమి సూపర్ సిక్స్ హామీలలో మరోదానిని నెరవేర్చుకుంటోంది. మహిళలకు ఉచిత బస్సు ప్రయాణం హామీని బాబు పక్కాగా నెరవేర్చనునారు. ఇందుకొసం ఆయన మంచి ముహూర్తం కూడా నిర్ణయించారు. తాజాగా కర్నూల్ జిల్లా పర్యటనలో భాగంగా ఆయన జరిగిన సభలో మాట్లాడుతూ మహిళలకు ఉచిత బస్సు హామీపై కీలకమైన ప్రకటన చెశారు. ఆగస్టు 15 నుంచి మహిళలకు ఉచిత బస్సు ప్రయాణం అంటూ బాబు మహిళలకు స్వాతంత్ర దినోత్సవ వరాన్ని ముందుగానే ఇచ్చేశారు.

ఆగస్టు 15 నుంచి ఆడబిడ్డలకు ఉచిత బస్సు ప్రయాణ సదుపాయం కల్పిస్తామని చంద్రబాబు చెప్పారు. ఇదిలా ఉండగా మహిళలకు ఉచిత బస్సు హామీని బాబు నెరవేర్చడం ద్వారా మహిళల కళ్ళలో ఆనందం నింపారు. ఇప్పటికే తల్లికి వందనం, అన్నదాతా సుఖీ భవ వంటి పధకాలను జూన్ నెలలో ప్రారంభిస్తున్నారు. దాంతో బాబు సూపర్ సిక్స్ హామీల విషయంలో తన చిత్తశుద్ధిని సాధించినట్లు అయింది అంటున్నారు.

ఇదిలా ఉండగా ఉచిత బస్సు ప్రయాణ ప్రకటనపై సీఎం చంద్రబాబుకు రవాణా మంత్రి మండిపల్లి రాంప్రసాద్ రెడ్డి ధన్యవాదాలు తెలిపారు. ఉచిత బస్సు అన్నది కేవలం ఒక సదుపాయం కాదు మహిళా సాధికారతకు అది అసలైన నిదర్శనం అని అన్నారు. చంద్రబాబుకు ప్రజల పట్ల ఉన్న అపేక్షకు ఆయన దృఢ సంకల్పానికి అసలైన నిదర్శనమని అన్నారు.

ఉచిత బస్సు ద్వారా మహిళకు, వృద్ధులకు ప్రయాణంలో భద్రత స్వేచ్చ చంద్రబాబు కల్పించారు అని అంటున్నారు. అంతే కాదు గ్రామాల నుంచి పట్టణాలకు ప్రయాణీంచేందుకు ఇది ఒక వరంగా మారుతుందని అన్నారు. ప్రతీ మహిళా కుటుంబంలో ఆర్ధికంగా భారం తగ్గించినట్లుగా కూడా ఈ పధకం వల్ల ఉంటుందని అన్నారు. తమ ప్రభుత్వం సామాజిక సాధికరతకు మహిళా వికాసానికి ఈ నిర్ణయం ఒక ఉదాహరణగా నిలుస్తుందని ఆయన అన్నారు. మొత్తానికి బాబు గారి బస్సు రయ్ రయ్ మని దూసుకొస్తోంది అని చెప్పాలి. ఇది మహిళామణుల కోరికలను తీర్చే ఒక ఆధునిక శకటంగా మారుతోంది అని అంటునారు.