Begin typing your search above and press return to search.

ఉచిత బస్సు అక్కడ స్టార్ట్... ఇక్కడ స్టాప్

ఆగస్ట్ 15 నుంచి ఏపీలో ఉచిత బస్సు తిరుగుతుందని బాబు ప్రకటించారు. అంటే ఏపీలో టీడీపీ కూటమి అధికారంలోకి వచ్చిన 14 నెలల తర్వాత అన్న మాట.

By:  Tupaki Desk   |   19 May 2025 9:28 AM IST
AP Free Bus Scheme for Women Hype vs Reality
X

ఉచిత బస్సు మీద హైప్ పెంచేస్తున్నారు. అది కూడా టీడీపీ అనుకూల మీడియాలో. అయితే ఏపీలో టీడీపీ కూటమి ప్రభుత్వం ఉచిత బస్సుని మహిళలకు వర్తింపచేయడానికి ఒక ముహూర్తం ఎంచుకుంది దానిని స్వయంగా ముఖ్యమంత్రి హోదాలో చంద్రబాబు ప్రకటించడంతో అందరిలో ఆశలు పెరుగుతున్నాయి.

ఆగస్ట్ 15 నుంచి ఏపీలో ఉచిత బస్సు తిరుగుతుందని బాబు ప్రకటించారు. అంటే ఏపీలో టీడీపీ కూటమి అధికారంలోకి వచ్చిన 14 నెలల తర్వాత అన్న మాట. ఇక తెలంగాణాలో కర్ణాటకలో ఉచిత బస్సుని వెంటనే అమలు చేశారు. అంతే కాదు రాష్ట్రమంతా ఉచిత బస్సుని తిప్పుతున్నారు. అమ్మ వారి దర్శనానికి వెళ్ళాలన్న అమ్మ దగ్గరకు వెళ్ళాలన్నా మా ఆడబిడ్డలు ఒక్క పైసా ఖర్చు చేయకుండా ఉచితంగా బస్సు ఎక్కి గమ్యం చేరుకునే విధంగా ఉచిత బస్సు పధకాన్ని తెలంగాణాలో అమలు చేస్తున్నామని ముఖ్యమంత్రి రేవంత్ రెడ్డి గట్టిగా ప్రకటించారు.

మరి ఏపీలో చూస్తే ఉచిత బస్సు స్టార్ట్ అండ్ స్టాప్ లకు ఒక లెక్క విధానం ఉందని అంటున్నారు. అదేంటి అంటే చంద్రబాబు ఉచిత బస్సు ఏపీ వ్యాప్తంగా తిరగదు అని అంటున్నారు. ఇక్కడే షరతులు వర్తిస్తాయని చెబుతున్నారు. జిల్లాల వరకే ఉచిత బస్సు తిరుగుతుందని చెబుతున్నారు అది కూడా కొత్తగా ఏర్పాటు చేసిన జిల్లాల సరిహద్దుల వరకే అని అంటున్నారు.

అంటే ఉదాహరణకు విశాఖలో ఉచిత బస్సు పధకం అంటే అది అనకాపల్లి పొలిమేరల వరకూ అలాగే మరో వైపు చూస్తే తగరపువలస వరకే అని అంటున్నారు. ఇలా ఉచిత బస్సు పరిధిని చాలా వరకూ తగ్గించేశారు అని అంటున్నారు. నిజానికి జిల్లాలో అయితే రోజూ ప్రయాణం చేసే వారు ఎవరు ఉంటారు అన్నది చర్చగా ఉంది. అవసరం కూడా ఉండదని అంటున్నారు.

ఉమ్మడి పదమూడు జిల్లాలు 26 అయిన తరువాత ఒక ప్రాంతం నుంచి మరో ప్రాంతానికి వెళ్ళాలి అంటే కనీసం మూడు నాలుగు జిల్లాలను దాటుకుని వెళ్ళాల్సి ఉంటుంది. జిల్లాకే ఉచిత బస్సుని పరిమితం చేస్తే మిగిలిన మూడు జిల్లాలకు డబ్బు కట్టుకోవాల్సి ఉంటుందని అంటున్నారు.

ఇక ఉచిత బస్సు కోసం కేవలం ఎలక్ట్రికల్ వాహనాలను వాడుతారు అని అంటున్నారు. అంటే వీటిలోనే ఉచితంగా మహిళలు ప్రయాణం చేయాల్సి ఉంటుంది అన్న మాట. మామూలు ఆర్టీసీ బస్సులలో ఉచితం అంటే కుదరదు అని అంటున్నారు. ఇక ఉచిత బస్సుల విషయంలో మరిన్ని నిబంధలను కూడా అమలు చేయబోతున్నారు అని అంటున్నారు.

వీటిని రద్దీ ఎక్కువగా ఉండే విశాఖ విజయవాడ తిరుపతి వంటి నగరాలలలో ఎక్కువగా పంపిస్తారు అని అంటున్నారు. ఇక రద్దీ వేళలలోనే ఈ ఉచిత బస్సులు ఎక్కువగా తిరుగుతాయని అంటున్నారు. దీని అర్థం పని ఉన్న వారు వర్కింగ్ ఉమెన్స్ సద్వినియోగం చేసుకోవడానికే అని అంటున్నారు. పనీ పాటా లేకుండా తిరగడానికి అయితే పెద్దగా అవకాశం ఉండదని అంటున్నారు.

ఒక విధంగా ఇది మంచి విధానమే అయినా మహిళలకు తెలంగాణాలో అమలు అవుతున్న తీరుని చూసి తాము అన్నవరం వెళ్తాం, తిరుపతి వెళ్తాం, శ్రీశైలం వెళ్ళి దర్శనం చేసుకుని వస్తామని ఆశ పడుతున్నారు. ఎన్నికల్లో కూటమి నాయకులు అలాగే ప్రచారం చేశారు అని అంటున్నారు. మీరు రాష్ట్రంలో ఎక్కడ నుంచి ఎక్కడికైనా వెళ్ళేందుకు ఉచిత బస్సులు అని చెప్పారు తీరా దానిని జిల్లాలకు కుదిస్తే మహిళామతల్లులు హర్షిస్తారా అన్న చర్చ అయితే ఉంది. ఇక ఇవి కాకుండా మరిన్ని నిబంధనలు ఉండబోతున్నాయని అంటున్నారు. అవి అన్నీ చూశాక ఉచిత బస్సు మహిళాలకు హుషార్ తెస్తుందా ఉసూరుమనిపిస్తుందా అన్నది చూడాల్సి ఉంది.