మీరు చదవకపోతే.. నాకు మార్కులు తగ్గుతాయి: లోకేష్ ఇంట్రస్టింగ్ కామెంట్స్
ఏపీ విద్యాశాఖ మంత్రిగా ఉన్న నారా లోకేష్ ఇంట్రస్టింగ్ కామెంట్స్ చేశారు. తాజాగా బుధవారం ఆయన కృష్ణా జిల్లాలోని అవనిగడ్డలో పర్యటించారు.
By: Garuda Media | 24 Jun 2026 4:18 PM ISTఏపీ విద్యాశాఖ మంత్రిగా ఉన్న నారా లోకేష్ ఇంట్రస్టింగ్ కామెంట్స్ చేశారు. తాజాగా బుధవారం ఆయన కృష్ణా జిల్లాలోని అవనిగడ్డలో పర్యటించారు. ఈ సందర్భంగా.. ప్రభుత్వ పాఠశాలను సందర్శించి విద్యార్థు లతో ముఖాముఖి నిర్వహించారు. విద్యార్థులు బాగా చదివి మంచి ఫలితాలు సాధించాలని సూచించారు. అలా చేయకపోతే.. ముఖ్యమంత్రి తనకు మార్కులు తగ్గిస్తారని వ్యాఖ్యానించారు. విద్యార్థులు బాగా చదివితేనే మంత్రిగా తనకు మంచి మార్కులు వస్తాయని చెప్పారు. దీంతో విద్యార్థులు ఘొల్లున నవ్వారు.
అవనిగడ్డలోని మోపిదేవి మండలం కొక్కిలిగడ్డలో పి4 పథకంలో భాగంగా దాతల సహకారంతో రూ.1.4కోట్ల వ్యయంతో నూతనంగా నిర్మించిన జడ్ పీ హైస్కూలు నూతన భవనాలను మంత్రి లోకేష్ ప్రారంభించారు. ఈ సందర్భంగా 9,10 తరగతుల విద్యార్థులతో మంత్రి లోకేష్ మాట్లాడారు. విద్యార్థులంతా కష్టపడి చదివి పాస్ పర్సంటేజిని పెంచాలని సూచించారు. త్వరలోనే సర్వేపల్లి రాధాకృష్ణన్ విద్యా కిట్స్, బూట్లు అందజేస్తామన్నారు.
అందుకే ఈ శాఖ..
సమాజంలో మార్పు తెచ్చేందుకు తాను విద్యాశాఖను ఎంచుకున్నానని మంత్రి లోకేష్ చెప్పారు. దీనిని తాను ఛాలెంజ్ గా తీసుకున్నట్టు చెప్పారు. గత రెండేళ్లలో విద్యావ్యవస్థలో సంస్కరణలు తీసుకువచ్చా మని, టీచర్లు పూర్తిగా ఫలితాలపైనే శ్రద్ధ పెట్టాలన్నారు. రాష్ట్రవ్యాప్తంగా మౌలిక సదుపాయాలు మెరుగయ్యాయని, ఫలితాలు రాబట్టాలని సూచించారు. నూరు శాతం ఫలితాలే లక్ష్యంగా ఉపాధ్యాయులు పనిచేయాలన్నారు.
ప్రచారం చేయండి..
ప్రభుత్వ పాఠశాలల్లో సాధిస్తున్న ఫలితాలపై ప్రచారం చేయాలని ఉపాధ్యాయులకు లోకేష్ సూచించా రు. గతంలో ఎన్నడూ లేనివిధంగా ఈ సంవత్సరం ప్రభుత్వ పాఠశాలల్లో ప్రతిభ కనబర్చిన విద్యార్థుల ఫొటోలతో పత్రికల్లో యాడ్స్ ఇచ్చామని ఈ విధానాన్ని కొనసాగించాలని సూచించారు. వచ్చేనెల 16,17,18 తేదీల్లో రాష్ట్రవ్యాప్తంగా పేరెంట్ – టీచర్ మీటింగ్ సమావేశాలను నిర్వహించనున్నట్టు తెలిపారు.
