Begin typing your search above and press return to search.

కడపలో ఫుల్ హీట్ - పులివెందుల మాయం ఖాయం ?

దేశవ్యాప్తంగా అసెంబ్లీ పార్లమెంట్ పునర్ విభజన ప్రక్రియ 2029 ఎన్నికల్లోనే జరిగి తీరుతుందని వార్తలు రావడం ఏపీ రాజకీయాలను కుదిపేస్తోంది.

By:  Satya P   |   29 March 2026 9:11 AM IST
కడపలో ఫుల్ హీట్ - పులివెందుల మాయం ఖాయం ?
X

దేశవ్యాప్తంగా అసెంబ్లీ పార్లమెంట్ పునర్ విభజన ప్రక్రియ 2029 ఎన్నికల్లోనే జరిగి తీరుతుందని వార్తలు రావడం ఏపీ రాజకీయాలను కుదిపేస్తోంది. ఎన్నికలతో సంబంధం లేకుండా మూడు వందల అరవై అయిదు రోజులూ అయిదేళ్ళూ ఎన్నికల వేడితో సలసలాడిపోయే ఏపీలో అసెంబ్లీ పార్లమెంట్ సీట్లు పెరుగుదల అంశం కొత్త చర్చకు దారి తీస్తోంది. ఈ సీట్ల పెంపు ఎవరి కొంప ముంచుతుంది ఎవరి జాతకం మారుస్తుంది అన్నదే అంతటా హీటెడ్ డిస్కషన్ గా ఉంది. ఏపీలో చూస్తే అటు కూటమి ఇటు వైసీపీ మోహరించి ఉన్నాయి. ఎవరిని ఎవరూ తీసిపోరన్నట్లుగా ఢీ కొడుతున్న వాతావరణం ఉంది. ఈ నేపధ్యంలో పెరిగే సీట్లు ఎవరికి ప్లస్ ఎవరికి మైనస్ అన్న చర్చ సైతం వాడిగా వేడిగా సాగుతోంది.

పులివెందుల కనుమరుగు :

పులివెందుల అన్నది వైఎస్సార్ కుటుంబానికి కంచుకోట. 1978లో తొలిసారి వైఎస్సార్ పులివెందుల నుంచి ఎమ్మెల్యేగా గెలిచారు. ఆయన ఆరు సార్లు పులివెందుల ఎమ్మెల్యేగా పనిచేశారు. మంత్రిగా రెండు సార్లు ముఖ్యమంత్రిగా పనిచేశారు. ఇక పులివెందుల నుంచి వైఎస్ వివేకానందరెడ్డి కూడా గెలిచారు. వైఎస్సార్ సతీమణి వైఎస్ విజయమ్మ కూడా పులివెందుల నుంచి ఒకసారి గెలిచారు వైఎస్సార్ కాంగ్రెస్ పార్టీ అధినేత వైఎస్ జగన్ పులివెందుల నుంచి హ్యాట్రిక్ ఎమ్మెల్యేగా విజయం సాధించారు ఇదిలా ఉంటే 2029 లో పులివెందుల సీటు ఉంటుందా లేదా అన్న చర్చకు తెర లేస్తోంది.

పట్టు తగ్గుతోందా :

వైఎస్ జగన్ విపక్షంలోకి వచ్చాక పులివెందులలో వైసీపీ పట్టు తగ్గుతోంది అన్న చర్చ సాగుతోంది. పులివెందుల జెడ్పీటీసీకి జరిగిన ఉప ఎన్నికల్లో వైసీపీకి డిపాజిట్లు కోల్పోవడం దారుణమైన పరిణామంగానే చూస్తున్నారు. అదే విధంగా కడప ఎంపీ అవినాష్ రెడ్డి ఉన్నా కూడా పులివెందుల మీద ఆయన పూర్తి రాజకీయ ఆధిపత్యం చూపించలేకపోతున్నారు అని అంటున్నారు. జగన్ కూడా ఎమ్మెల్యేగా గెలిచినా పులివెందుల పట్ల పెద్దగా పట్టనట్లుగా వ్యవహరించడం వల్ల కూడా గతంలో మాదిరిగా జనాలతో క్యాడర్ తో డైరెక్ట్ కనెక్షన్ తగ్గింది అని అంటున్నారు. ఈ నపధ్యంలో ఇటీవల కాలంలో జగన్ పులివెందులకు తరచూ వెళ్ళి వస్తున్నారు. తమ ప్రాభవాన్ని పెంచుకోవడానికి చూస్తున్నారు.

పెరుగుతున్న సీట్లు :

ఇదిలా ఉండగా కడప జిల్లాలో పది సీట్లు ఉంటే రానున్న ఎన్నికల్లో పదిహేను సీట్లుగా పెరుగుతాయని అంటున్నారు. అవే జరిగితే ప్రస్తుతం ఉన్న సీట్లు పోయి కొత్త సీట్లు వస్తాయని ఈ క్రమంలో చాలా సీట్లు పోతాయని కొత్త రూపంలో సీట్లు వస్తాయని అంటున్నారు. ఈ నేపధ్యంలో చాలా ఈక్వేషన్స్ కూడా ఇందులో అనేక విధాలుగా పనిచేస్తాయని అంటున్నారు. ఇక పదిహేను నియోజకవర్గాలను చేయాలంటే పెద్ద నియోజకవర్గాలలో పులివెందుల అందులో ఉంది. అలాగే రాజంపేట, బద్వేలు రాయచోటి కూడా ఉన్నాయి. ఇవన్నీ విభజిస్తారు అని అంటున్నారు. వీటిలో ఏయే మండలాలు కలుపుతారు, లేక ఇటు నుంచి అటు చేసో మార్పులు కీలకంగా చేస్తారు అని అంటున్నారు. అదే జరిగితే పులివెందుల అన్నది కూడా పూర్తిగా అంతర్ధానం అవుతుందని అంటున్నారు.

అదే జరిగితే :

జగన్ ని పులి వెందుల పులి అని అంటారు. మరి పులి వెందుల పేరు మారిపోతే అపుడు ఏమి జరుగుతుందని కూడా పెద్ద ఎత్తున చర్చ సాగుతోంది. చేయాలనుకుంటే పునర్ విభజనలో అధికార పార్టీకే ఎక్కువ అవకశాలు ఉంటాయని అంటున్నారు. అపుడు జగన్ వేరే చోటకు వెళ్ళి పోటీ చేయాల్సి ఉంటుందని అంటున్నారు. మొత్తం మీద చూస్తే హ్యాట్రిక్ ఎమ్మెల్యేగా జగన్ ఉన్న పులి వెందుల కనుక మాయం అయితే అది ఏపీ రాజకీయాల్లో హాటెస్ట్ టాపిక్ గా ఉండడం ఖాయమని అంటున్నారు. ఏమి జరుగుతుందో చూడాల్సి ఉంది అని అంటున్నారు.