Begin typing your search above and press return to search.

షర్మిలను రీప్లేస్ చేసేది చింతా మోహనేనా ?

ఇలా ప్రతీ రోజూ జగన్ మీద అదే పనిగా విమర్శలు చేస్తూంటే అవి రొటీన్ అయి జనాల అటెన్షన్ ని కూడా కోల్పోతున్నాయని అంటున్నారు.

By:  Tupaki Desk   |   29 Jun 2025 9:45 AM IST
షర్మిలను రీప్లేస్ చేసేది చింతా మోహనేనా ?
X

ఏపీ కాంగ్రెస్ అధినేత్రిగా బాధ్యతను షర్మిలకు అప్పగించారు. దానికి రెండు ప్రధాన కారణాలు ఉన్నాయి. ఒకటి ఆమె దివంగత నేత మాజీ సీఎం వైఎస్సార్ కుమార్తె కావడం. రెండవది అప్పటి ఏపీ సీఎం జగన్ కి చెల్లెలు కావడం. అయితే ఈ రోజున జగన్ మాజీ సీఎం అయ్యారు. ఏపీలో కూటమి ప్రభుత్వం అధికారంలోకి వచ్చింది.

అయినా కూడా 2024 ఎన్నికలలో చేసిన మాదిరిగా షర్మిల జగన్ మీదనే తన గన్ ని గురి పెడుతున్నారు. ప్రతీ దానికీ జగన్ ప్రస్తావన తెస్తున్నారు. బీజేపీ నేరుగా పొత్తు పెట్టుకుని ప్రభుత్వం నడుపుతున్న టీడీపీని పక్కన పెట్టి వైసీపీ మీద విమర్శలు చేస్తున్నారు.

ఏపీలో ఏడాది పాలన కూటమి పూర్తి చేసుకున్నా ఇంకా జగనే అన్నింటికీ కారణం అని అంటున్నారు. ఇది రానూ రానూ జగన్ కే ప్లస్ అయ్యేలా ఉందని అంటున్నారు. ఎందుకంటే జగన్ షర్మిల మధ్య ఆస్తుల వివాదాలు ఉన్నాయని మొదట్లో అంతా అనుకున్నారు. అయితే అది నిజమే అయినా ఇపుడు ప్రతీ ఇంట్లో అది సాధారణ విషయంగా మారింది.

నిజంగా న్యాయం జరగాలీ అంటే కోర్టుల ద్వారానో లేక పెద్దల సమక్షంలోనో తేల్చుకుంటే బాగుంటుంది అని అంటున్నారు. అలా కాకుండా జగన్ ని ప్రతీ రోజూ విమర్శిస్తూ షర్మిల పీసీసీ చీఫ్ గా దానిని ఉపయోగించుకుంటున్నారు అని అంటున్నారు. స్వార్ధపరులలో జగన్ నంబర్ వన్ అని తాజాగా ఆమె ఘాటు విమర్శలు చేశారు.

ఇలా ప్రతీ రోజూ జగన్ మీద అదే పనిగా విమర్శలు చేస్తూంటే అవి రొటీన్ అయి జనాల అటెన్షన్ ని కూడా కోల్పోతున్నాయని అంటున్నారు. మరో వైపు చూస్తే జగన్ పట్ల సానుభూతిని సైతం పెంచేలా ఉన్నాయని అంటున్నారు. ఎందుకంటే లోపల ఏమి జరిగిందో తెలియదు కానీ బయటకు మాత్రం జగన్ పల్లెత్తు మాట అనడం లేదు దాంతో ఆయన మీద ఈ విమర్శలు ఏమిటి అన్నదే జనాలలో చర్చగా ఉంది.

ఇంకో వైపు చూస్తే కాంగ్రెస్ లో సీనియర్లు షర్మిలతో సంబంధం లేకుండా ప్రెస్ మీట్లు పెడుతున్నారు. టీడీపీ కూటమి మీద వారే భారీ విమర్శలు చేస్తున్నారు కడప జిల్లాకు చెందిన తులసిరెడ్డి అయితే చంద్రబాబుని పవన్ కళ్యాణ్ ని సైతం వదలకుండా విమర్శిస్తున్నారు.

ఇక కేంద్ర మాజీ మంత్రి చింతామోహన్ ది మరో రకమైన రాజకీయ దూకుడుగా ఉంది. ఆయన అమరావతి రాజధాని మీదనే విమర్శలు ఎక్కు పెడుతున్నారు. నారు. ఏపీలో ఏడాది కూటమి పాలన ఏమీ బాగులేదని అంటున్నారు. లా అండ్ ఆర్డర్ దెబ్బ తిందని కూడా అంటున్నారు అమరావతి రాజధాని మీద కర్నూల్ నుంచి ఒంగోలు దాకా జనాలు ఎవరూ సంతృప్తిగా లేరని చింతా మోహన్ అంటున్నారు.

చంద్రబాబు నీటిలో రాజధాని కడుతున్నారని కూడా ఎద్దేవా చేస్తున్నారు. అమరావతి పూర్తి అవడం కష్టమైన వ్యవహారం అని ఆయన అంటున్నారు. ఏపీలో అన్ని ప్రాంతాల ప్రజలకు న్యాయం చేయాలని డిమండ్ చేస్తున్నారు.

చూడబోతే రోజు రోజుకీ చింతా మోహన్ చేస్తున్న విమర్శలే ఫోకస్ అవుతున్నాయి. ఆయన చేస్తున్న ప్రకటనల మీదనే అంతా చర్చించుకుంటున్నారు. రాజకీయంగా యాభై ఏళ్ళ అనుభవం కలిగి కేంద్ర మంత్రి పదవిని నిర్వహించిన చింతా మోహన్ పీసీసీ రేసులో ఉన్నారా అన్న చర్చ వస్తోంది.

ఆయనకు ఈ కీలక పదవి ఇవ్వడం ద్వారా కాంగ్రెస్ లో కొత్త ఉత్సాహం తీసుకుని వస్తారా అన్నది కూడా అంతా చర్చిస్తున్నారు. ఏపీలో కాంగ్రెస్ కి కొత్త బలం రావాలంటే సూటీగా ధాటీగా కూటమి మీద విమర్శలు చేయాల్సి ఉంటుందని అంటున్నారు. ఆ అనుభవం నిండుగా ఉన్న చింతా మోహన్ కి ఆ పదవి అప్పగించినా ఆశ్చర్యం లేదు అని అంటున్నారు.