Begin typing your search above and press return to search.

కలెక్టర్ల సదస్సులో బాబుకు అరుదైన గౌరవం !

అమరావతిలోని రాష్ట్ర సచివాలయంలో రెండు రోజుల పాటు రాష్ట్ర స్థాయి కలెక్టర్ల సదస్సు జరుగుతోంది.

By:  Satya P   |   7 May 2026 11:30 PM IST
కలెక్టర్ల సదస్సులో బాబుకు అరుదైన గౌరవం !
X

అమరావతిలోని రాష్ట్ర సచివాలయంలో రెండు రోజుల పాటు రాష్ట్ర స్థాయి కలెక్టర్ల సదస్సు జరుగుతోంది. ఈ సందర్భంగా అరుదైన సంఘటన జరిగింది. కలెక్టర్లు అంతా సీఎం చంద్రబాబుకు ఒక అరుదైన గౌరవం అందించారు. సాధారణంగా కలెక్టర్లు ప్రోటోకాల్ ప్రకారం సీఎం కి గౌరవం ఇస్తూంటారు. అయితే ఈ సదస్సులో మాత్రం వారంతా మరింత ఎక్కువ గౌరవాభిమానాలు బాబు మీద చూపించడం విశేషంగా చెబుతున్నారు. అంతే కాదు దేశంలో ఏ ముఖ్యమంత్రికైనా ఇలా జరిగిందో లేదో తెలియదు కానీ బాబు మాత్రం ఈ గౌరవం అందుకోవడం గ్రేట్ అంటున్నారు. అది బాబుకే చెల్లిందని కూడా అంటున్నారు. ఇంతకీ ఏమి జరిగిందంటే.

బాబు ఈ గ్రేట్ అంటూ :

కలెక్టర్ల సదస్సులో ముఖ్యమంత్రి చంద్రబాబుకు మొత్తం 28 జిల్లాలకు చెందిన కలెక్టర్లు అంతా శుభాకాంక్షలు తెలిపారు. బాబు ఇటీవల ముంబై వేదికగా బిజినెస్ రిఫార్మర్ ఆఫ్ ద ఇయర్ – 2025 అవార్డు సాధించడం పట్ల వారంతా హర్షం వ్యక్తం చేశారు. అంతే కాదు గురువారం కలెక్టర్ల సదస్సు ప్రారంభం అవుతూనే చంద్రబాబుకు మంత్రులు, వివిధ శాఖల ఉన్నతాధికారులు, జిల్లా కలెక్టర్లు స్టాండింగ్ ఓవేషన్ ఇచ్చారు. ఈ గొప్ప అవార్డుని సాధించిన ముఖ్యమంత్రికి స్టాండింగ్ ఓవేషన్ తో ఈ విధంగా గౌరవం తెలిపారు అన్న మాట.

టీమ్ ఏపీకి అంకితం:

అయితే ముఖ్యమంత్రి చంద్రబాబు తనకు లభించిన ఈ స్టాండింగ్ ఒవేషన్ కి ఎంతో ఆనందించారు ఆ మీదట ఆయన మాట్లాడుతూ తనకు లభించిన ఈ అవార్డు టీమ్ ఏపీకి అంకితం అని హుందాగా ప్రకటించారు. అంతే కాదు మరిన్ని పెట్టుబడులు రాష్ట్రానికి వచ్చేందుకు ఇలాంటి అవార్డులు రావాలని చంద్రబాబు కలెక్టర్ల సదస్సులో అందరికీ సూచించారు. మంత్రుల నుంచి సీఎస్ మొదలుకుని గ్రామ స్థాయి అధికారి వరకూ అంతా కష్టపడి పని చేయడం వల్లే ఈ అవార్డు దక్కిందని బాబు అన్నారు. బిజినెస్ రిఫార్మర్ ఆఫ్ ద ఇయర్ పురస్కారం దక్కడం అందరి సమిష్టి కృషి అని బాబు చెప్పారు.

ఏపీ గురించి అంతా :

ఇక చూస్తే కనుక రెండేళ్ల క్రితం రాష్ట్రం గురించి ఏం మాట్లాడారు అన్నదికీ తెలిసిందే అని బాబు అంటూ ఇప్పుడు దేశమంతా ఏపీ అభివృద్ధి గురించి గొప్పగా మాట్లాడుతోందని, దానికి ఈ అవార్డు ఉదాహరణ అన్నారు. గతంలో ఇలాంటి అవార్డులు తీసుకోవడానికి ఇష్టపడేవాడిని కాదని బాబు చెప్పారు. కానీ ఇప్పుడు ఇలాంటి అవార్డులు మరిన్ని రావాలని కోరుకుంటున్నానని బాబు అన్నారు. ఈ విధంగా ఏపీకి ఎన్ని అవార్డులు వస్తే మన రాష్ట్రానికి అంత గుర్తింపు దక్కుతుందని బాబు అన్నారు. అంతే కాదు రానున్న రోజులలో ఏపీకి మరిన్ని పెట్టుబడులు వస్తాయని బాబు చెప్పారు. అందుకే మరిన్ని అవార్డులను మనం సాధించాలని కోరుకుంటున్నానని ఆయన అన్నారు.