Begin typing your search above and press return to search.

ఎమ్మెల్యేలు వ‌ర్సెస్ ప్ర‌భుత్వం.. ఏం జ‌రుగుతోంది?

కూట‌మి ప్ర‌భుత్వంలో ఎమ్మెల్యేలు.. వ‌ర్సెస్ స‌ర్కారు మ‌ధ్య అప్ర‌క‌టిత రాజ‌కీయ యుద్ధం కొన‌సాగుతోందా ? ప్ర‌భుత్వానికి భిన్నంగా ఎమ్మెల్యేలు వ్య‌వ‌హ‌రిస్తున్నారా? అంటే.. అనుకూల మీడియాల్లోనూ ఔన‌నే స‌మాధాన‌మే వినిపిస్తోంది.

By:  Garuda Media   |   1 Sept 2025 10:00 PM IST
ఎమ్మెల్యేలు వ‌ర్సెస్ ప్ర‌భుత్వం.. ఏం జ‌రుగుతోంది?
X

కూట‌మి ప్ర‌భుత్వంలో ఎమ్మెల్యేలు.. వ‌ర్సెస్ స‌ర్కారు మ‌ధ్య అప్ర‌క‌టిత రాజ‌కీయ యుద్ధం కొన‌సాగుతోందా ? ప్ర‌భుత్వానికి భిన్నంగా ఎమ్మెల్యేలు వ్య‌వ‌హ‌రిస్తున్నారా? అంటే.. అనుకూల మీడియాల్లోనూ ఔన‌నే స‌మాధాన‌మే వినిపిస్తోంది. నాయ‌కుల వ్య‌వ‌హారానికి.. ప్ర‌భుత్వ తీరుకు కూడా ఎక్క‌డా పొంత‌న లేకుండా పోయిందనేది ప్ర‌స్తుతం జ‌రుగుతున్న చ‌ర్చ‌. ఇంత‌కీ..ఎమ్మెల్యేలు ఏం చేస్తున్నారు? అంటే.. య‌థావిధిగా .. వారు సొంత ప‌నులు చేసుకుంటున్నారు. ఇదే గ‌తం నుంచి కూడా వినిపిస్తున్న మాట‌.

దాదాపు 12 నియోజ‌క‌వ‌ర్గాల్లో మ‌రింత ఎక్కువ‌గా ఎమ్మెల్యేలు దూకుడు ప్ర‌ద‌ర్శిస్తున్నారు. క‌ర్ర పెత్త‌నం చే స్తున్న వారు కొంద‌రు అయితే.. తీవ్ర విమ‌ర్శ‌ల పాలై.. స‌ర్కారును బోనెక్కిస్తున్న‌వారు మ‌రికొంద‌రు ఉన్నా రు. ఈ నేప‌థ్యంలోనే కూట‌మి స‌ర్కారు ఇబ్బందుల్లో ప‌డుతోంది. అయితే.. చిత్రం ఏంటంటే.. ఎలాంటి ఆరోప‌ణ‌లు ఎదుర్కోని వారి నుంచి ఇప్పుడు ప్ర‌భుత్వంపై ఒత్తిడి పెరుగుతోంది. కొంద‌రు చేస్తున్న త‌ప్పుల కార‌ణంగా త‌మ‌ను కూడా మీడియా నుంచి ఓ వ‌ర్గం ప్ర‌జ‌ల వ‌ర‌కు అనుమానంగా చూస్తున్నార‌న్న‌ది వారు చెబుతున్న మాట‌.

అందుకే.. త‌ప్పులు చేసిన ఎమ్మెల్యేల‌పై చ‌ర్య‌లు తీసుకోవాల‌ని కోరుతున్నారు. వాస్త‌వానికి ఇది నిజ‌మే. కొంద‌రు చేస్తున్న త‌ప్పుల కార‌ణంగా.. ఎమ్మెల్యేలు అంద‌రూ కూడా ఇబ్బందులు ఎదుర్కొంటున్నారు. వారు ఏ త‌ప్పు చేయ‌క‌పోయినా.. అనుమానాలు పెరుగుతున్నాయి. ఇదే విష‌యాన్ని ఓ మీడియా హైలెట్ చేసింది. ఒక‌రిద్ద‌రు చేస్తున్న త‌ప్పుల‌ను సీఎం చంద్ర‌బాబు ఉపేక్షిస్తున్నార‌ని.. కేవ‌లం హెచ్చ‌రిక‌లు, వార్నింగుల‌తో నే స‌రిపెడుతున్నార‌ని చెబుతోంది. అలా కాకుండా.. క‌ఠిన చ‌ర్య‌ల‌కు దిగాల‌న్న‌ది ఈ మీడియా సూచ‌న‌.

వాస్త‌వానికి చంద్ర‌బాబుకు ఉన్న మెజారిటీ చూస్తే.. బొటాబొటీ ఏమీ కాదు. 134 మంది ఎమ్మెల్యేలు గుండు గుత్త‌గా ఒక్క టీడీపీకే ఉన్నారు. అలాంట‌ప్పుడు.. ఓ ప‌ది ప‌దిహేను మంది త‌ప్పులు చేసే వారిని స‌స్పెండ్ చేసినా.. వారిని తీవ్రంగా మంద‌లించినా.. ఏమీ కాదు. అయినా.. చంద్ర‌బాబు ఉదాసీనంగా వ్య‌వ‌హ‌రిస్తు న్నార‌న్న‌ది ప్ర‌స్తుతం జ‌రుగుతున్న చ‌ర్చ‌. వాస్త‌వానికి.. చ‌ర్య‌లు తీసుకుంటే.. వారు లైన్‌లోకైనా వ‌స్తారు. లేదా పార్టీ నుంచి బ‌య‌ట‌కు అయినా.. వ‌స్తారు. ఈ రెండిట్లో ఏదో ఒక‌టి జ‌రుగుతుంది త‌ద్వారా పార్టీలో నాయ‌కులు ఊపిరి పీల్చుకోవ‌డంతోపాటు.. ఇత‌ర నాయ‌కులు కూడా అలెర్ట్ అవుతారు. మ‌రి ఈ విష‌యంపై చంద్ర‌బాబు దృష్టి పెడ‌తారో లేదో చూడాలి.