Begin typing your search above and press return to search.

సాంకేతిక పాల‌న‌.. స‌క్సెస్ అయ్యేనా.. ?

ఏపీ సీఎం చంద్ర‌బాబు మ‌రోసారి సాంకేతిక పాల‌న వైపు అడుగులు వేస్తున్నారు. ఇప్ప‌టికే వాట్సాప్ గ‌వర్నెన్స్ అంటూ.. గ‌త ఏడాది కింద‌టే సాంకేతిక పాల‌న‌ను ప్ర‌జ‌ల‌కు చేరువ చేశారు.

By:  Garuda Media   |   28 Jan 2026 7:00 AM IST
సాంకేతిక పాల‌న‌.. స‌క్సెస్ అయ్యేనా.. ?
X

ఏపీ సీఎం చంద్ర‌బాబు మ‌రోసారి సాంకేతిక పాల‌న వైపు అడుగులు వేస్తున్నారు. ఇప్ప‌టికే వాట్సాప్ గ‌వర్నెన్స్ అంటూ.. గ‌త ఏడాది కింద‌టే సాంకేతిక పాల‌న‌ను ప్ర‌జ‌ల‌కు చేరువ చేశారు. ప్ర‌స్తుతం 800 ర‌కాల సేవ‌ల‌ను వాట్సాప్ గ‌వ‌ర్నెన్స్ ద్వారా అందిస్తున్నామ‌ని చెబుతున్నారు. కానీ.. ఇది ఎంత వ‌ర‌కు ప్ర‌జ‌ల‌కు చేరువ అయింది? ఎంత మంది వాట్సాప్ గ‌వ‌ర్నెన్స్‌ను వినియోగించుకుంటున్నార‌న్న‌ది ప్ర‌శ్న‌గా మారిం ది. దీంతో సాంకేతిక పాల‌న ముందుకు సాగుతుందా? అనేది చ‌ర్చ‌నీయాంశం అయింది.

రాష్ట్రంలో 5 కోట్ల మంది ప్ర‌జ‌లు ఉన్నార‌ని అనుకుంటే.., వీరిలో 2.3 కోట్ల మందికి మాత్ర‌మే ఫోన్లు ఉన్నా యి. వీటిలోనూ 1.6 కోట్ల మంది మాత్ర‌మే స్మార్ట్ ఫోన్లు వినియోగిస్తున్నారు. మిగిలిన వారు ఇప్ప‌టికీ బ‌ట‌న్ ఫోన్లే వినియోగిస్తున్నారు. అదేస‌మ‌యంలో స్మార్ట్ ఫోన్లు వినియోగిస్తున్న వారిలోనూ కోటి మంది లోపే.. అన్ని ఫీచ‌ర్ల‌ను వినియోగిస్తున్నారు. ఫ‌లితంగా ప్ర‌భుత్వం ప్ర‌తిపాదించిన వాట్సాప్ గ‌వ‌ర్నెన్స్ ప్ర‌జ‌ల‌కు స‌మ‌ర్థ‌వంతంగా చేరువ కాలేద‌న్న‌ది తెలుస్తోంది.

ఈ కార‌ణంగానే ఇప్ప‌టికీ ఆఫీసులు.. పార్టీ కార్యాల‌యాల చుట్టూ ప్ర‌జ‌లు తిరుగుతున్నారు. ప్ర‌తి సోమ‌వారం నిర్వ‌హించే ప్ర‌జాద‌ర్బార్‌ల‌కు ప్ర‌జ‌లు పోటెత్తుతున్నారు. వేలాదిగా ఫిర్యాదులు అందుతున్నాయి. అవ‌న్నీ.. వాట్సాప్ గ‌వ‌ర్నెన్స్‌లో ఉన్న‌వే అయినా.. ప్ర‌జ‌ల‌కు చేరువ కావ‌డం లేద‌న్న విష‌యం స్ప‌ష్టంగా తెలుస్తోంది. అయిన‌ప్ప‌టికీ.. ఇప్పుడు మ‌రింత‌గా సాంకేతిక పాల‌న‌ను ప్ర‌జ‌ల‌కు చేరువ చేయాల‌ని చంద్ర‌బాబు త‌ల‌పిస్తున్నారు.

తాజాగా అధికారుల‌కు ఇదే దిశానిర్దేశం చేశారు. సాంకేతిక పాల‌న‌ను మ‌రింత చేరువ చేయాల‌ని ఆయ‌న సూచించారు. ప్ర‌జ‌ల‌కు-ప్ర‌భుత్వానికి మ‌ధ్య పేప‌ర్ లెస్ పాల‌న సాగాల‌ని కోరుతున్నాన‌న్నారు. కానీ, దీనివ ల్ల గ్రామీణ స్థాయి నుంచి ప‌ట్ట‌ణ స్థాయి వ‌ర‌కు ఎంత మందికి మేలు జ‌రుగుతోంద‌న్న విష‌యాన్ని మాత్రం ఆయ‌న విస్మరించారు. ప్ర‌స్తుతం.. రాష్ట్రంలో జ‌రుగుతున్న వాట్సాప్ గ‌వ‌ర్నెన్‌పై ప్ర‌చారానికి ఉన్నంత ప్రాధాన్యం పాల‌న ప‌రంగా ప్ర‌జ‌ల‌కు దానిని చేస్తేనే ప్ర‌యోజ‌నం చేకూరుతుంద‌ని అంటున్నారు ప‌రిశీల‌కులు.