Begin typing your search above and press return to search.

చంద్రబాబు హెలీకాప్టర్ పరిస్థితిపై కేంద్రం కీలక నిర్ణయం!

ఆంధ్రప్రదేశ్ ముఖ్యమంత్రి చంద్రబాబు నాయుడు వాడుతున్న హెలికాఫ్టర్ ఫిట్ నెస్ పై అనుమానాలు వ్యక్తమవుతున్నాయని అంటున్నారు.

By:  Tupaki Desk   |   13 May 2025 3:30 PM
చంద్రబాబు హెలీకాప్టర్  పరిస్థితిపై కేంద్రం కీలక నిర్ణయం!
X

ఆంధ్రప్రదేశ్ ముఖ్యమంత్రి చంద్రబాబు నాయుడు వాడుతున్న హెలికాఫ్టర్ ఫిట్ నెస్ పై అనుమానాలు వ్యక్తమవుతున్నాయని అంటున్నారు. ఇదేసమయంలో.. ఆయనతో పాటు పలువురు వీఐపీలు వాడుతున్న హెలికాప్టర్ ల ఫిట్ నెస్ ల పైనా అనుమానాలున్నాయని చెబుతున్నారు. ఈ నేపథ్యంలో ప్రభుతం కీలక నిర్ణయం తీసుకుంది. ఓ కమిటీని వేసింది.

అవును... ఏపీ సీఎం చంద్రబాబుతో సహా పలువురు వీఐపీలు వాడుతున్న హెలికాప్టర్ ఫిట్ నెస్ లపై అనుమానాలు వ్యక్తమవుతున్నాయి. ఈ హెలికాఫ్టర్ వాడకం వీరికి ఏమాత్రం సురక్షితం..? అనే విషయాలను తెలుసుకునేందుకు, ఆయా హెలికాఫ్టర్ ల సామర్థ్యాలను అధ్యయనం చేసేందుకు కేంద్రం ఓ కమిటీని ఏర్పాటు చేసింది.

దీంతో... సీఎం, వీఐపీలు వాడుతున్న హెలికాఫ్టర్ ల సామర్థ్యంపై ఈ కమిటీ తరలో నివేదిక ఇవ్వనుంది. ఇందులో భాగంగా... ఇప్పుడు వినియోగిస్తున్న హెలికాఫ్టర్ సామర్థ్యం ఎలా ఉంది.. కరెక్షన్స్ చేస్తే సరిపొతుందా.. లేక, పూర్తిగా మార్చాల్సిన అవసరం ఉందా.. ఒక వేళ మార్చాల్సి వస్తే ఎలాంటి హెలికాఫ్టర్ ఉండాలనే అంశంపై కమిటీ నివేదిక ఇవ్వనుంది!

దీనికి సంబంధించిన అధ్యయన కమిటీకి జనరల్ అడ్మినిస్ట్రేషన్ డిపార్ట్మెంట్ ప్రిన్సిపల్ సెక్రటరీ అధ్యక్షులుగా ఉండగా.. సభ్యులుగా.. పౌర విమానయన శాఖ నుంచి ఒక ప్రతినిధితో పాటు రాష్ట్ర ఆర్థిక శాఖ కార్యదర్శి, ఇంటెలిజెన్స్ ఏడీజీ ఉంటారని ప్రభుత్వం తెలిపింది. నివేదిక ఇవ్వడానికి ఈ కమిటీకి రెండు నెలల వ్యవధి ఉంది!