Begin typing your search above and press return to search.

జగన్ అరెస్ట్....ఏపీ రాజకీయాల్లో సంచలనానికి తెర లేస్తుందా ?

అమరావతి పేరు పలకడం కూడా ఇష్టం లేని వారికి రాష్ట్రాన్ని పాలించే అర్హత ఎక్కడిది అని బాబు ప్రశ్నించారు.

By:  Satya P   |   9 April 2026 10:12 PM IST
జగన్ అరెస్ట్....ఏపీ రాజకీయాల్లో సంచలనానికి తెర లేస్తుందా ?
X

వైసీపీ అధినేత మాజీ సీఎం జగన్ అరెస్టు అన్నది చాలాకాలంగా ఒక హాట్ టాపిక్ గా నడుస్తూనే ఉంది. వైసీపీ 2024 ఎన్నికల్లో ఓటమి చెందగానే ఈ చర్చ ముందుకు వచ్చింది. ఇది అలా సాగుతూనే ఉంది. లిక్కర్ స్కాం లో అరెస్ట్ చేస్తారా లేదా మరో కేసులోనా ఇలా అనే విధాలుగా డిస్కషన్ జరుగుతూనే ఉంది. అది రెండేళ్ళుగా అదే వేడిగా వాడిగా ఉంది. ఇపుడు మరింతగా హీటెడ్ డిస్కషన్ స్థాయికి చేరుకోవడం విశేషం. ఈసారి జగన్ అరెస్ట్ అంటూ కామెంట్స్ చేసింది ఎవరో మామూలు నాయకుడు కాదు, ఏపీ ముఖ్యమంత్రి చంద్రబాబు. ఆయన ఈ మాటను అన్నారు అంటే ఎందుకు అలా చెప్పారు, దాని వెనక వ్యూహం ఏమిటి అన్నది అంతా చర్చిస్తున్నారు.

అరెస్టు పెద్ద కష్టం కాదు :

ఏపీ విపక్ష నేత జగన్ ని అరెస్టు చేయడం పెద్ద కష్టం కాదని బాబు సంచలన వ్యాఖ్యలు చేశారు. యాభై మందిని పోగేసుకొచ్చి శాంతి భద్రతలకు విఘాతం కలిగిస్తున్నారు. ఇలాంటి వ్యక్తులను అరెస్ట్ చేయడం నాకు పెద్ద కష్టం కాదని బాబు చెప్పడం విశేషం. కానీ తాను చట్ట ప్రకారమే వెళతానని ఆయన చెప్పుకొచ్చారు. ఏ తప్పు చేయని తనకు ఏ విధమైన నోటీస్ కూడా ఇవ్వకుండా జైల్లో పెట్టారని ఆయన వైసీపీ ప్రభుత్వం మీద ఫైర్ అయ్యారు. ఇక జగన్ వంటి నేతలను ప్రోత్సహిస్తే ఎవరికీ రక్షణ ఉండదని, అసలు భవిష్యత్ ఉండదని ఆయన అన్నారు. ఏపీ ప్రజలందరి జీవితాలు బాగుండాలంటే ఇలాంటి వ్యక్తులను మర్చిపోవాలని బాబు పిలుపు ఇచ్చారు. ఏ మాత్రం . ఏమారినా రాష్ట్రానికి తీవ్ర నష్టం జరుగుతుందని చంద్రబాబు హెచ్చరించారు.

జగన్ బయటకు రాగలరా:

అసలు ఒక రాజకీయ పార్టీ లేకపోతే జగన్ ఇంట్లో నుంచి బయటకు రాగలరా అని బాబు ప్రశ్నించారు. జగన్ వంటి వారు రాష్ట్రాన్ని సర్వనాశనం చేయాలని కుట్ర చేస్తున్నారని బాబు విమర్శించారు. తనది న్యాయబద్ధ పాలన అని ఆయన చెబుతూ తాను ప్రజాస్వామ్యాన్ని కాపాడతాను అని స్పష్టం చేశారు. అదే సమయంలో ప్రజలకు ఇబ్బందులు వస్తే నా ప్రాణాలను లెక్కచేయకుండా పోరాడాను అని గుర్తు చేశారు. ఈ రోజున రాష్ట్రాన్ని కాపాడుకోవాల్సిన బాధ్యత మనందరిపై ఉందని ఆయన అన్నారు. . జగన్ అప్పుడప్పుడు రాష్ట్రానికి వచ్చి బెదిరించి పారిపోతారని బాబు సెటైర్లు వేశారు. నిజానికి ఇలాంటి నేతలు మనకు అవసరమా అని ఆయన ప్రశ్నించారు.

రెండు లక్షల కోట్లంటూ తప్పుడు ప్రచారం :

అమరావతి పేరు పలకడం కూడా ఇష్టం లేని వారికి రాష్ట్రాన్ని పాలించే అర్హత ఎక్కడిది అని బాబు ప్రశ్నించారు. జగన్ లాంటి వెయ్యి మంది వారు వచ్చినా అమరావతి నిర్మాణం ఆగదని బాబు స్పష్టం చేశారు. మొన్నటి వరకూ మూడు రాజధానులు అన్నారని, ఇప్పుడు మావిగన్ అంటున్నారని బాబు మండిపడ్డారు. విజయవాడ, గుంటూరు సమీపంలో రాజధాని కట్టేందుకు తాను ఇచ్చిన పిలుపుతో 29 వేల మంది రైతులు 33 వేల ఎకరాల భూమి స్వచ్ఛందంగా ఇచ్చారని ఆయన గుర్తు చేశారు. దేవతల రాజధాని అమరావతి అని ఆయన చెప్పారు. ధాని మోదీ శంకుస్థాపన చేశారని చెప్పారు హైకోర్టు సుప్రీంకోర్టు అమరావతికి మద్దతుగా నిలిచాయని అన్నారు. అమరావతి నిర్మాణానికి రెండు లక్షలు ఖర్చు అని అసత్య ప్రచారం చేస్తున్నారని జగన్ మీద విమర్శలు చేశారు.

అమరావతే ఏపీ రాజధాని :

అమరావతే ఏపీ రాజధాని అని రాష్ట్రపతి ఆమోదం తెలిపారని బాబు చెప్పారు. పార్లమెంటులో అమరావతి చట్టబద్ధత బిల్లుకు 49 రాజకీయ పార్టీలు సపోర్ట్ చేస్తే ఒకే ఒక్క పార్టీ సపోర్ట్ చేయలేదని బాబు నిప్పులు చెరిగారు. ఇవన్నీ పక్కన పెడితే అనుకుంటే జగన్ ని అరెస్టు చేయగలను అన్న బాబు కామెంట్స్ మీద అయితే పెద్ద ఎత్తున చర్చ సాగుతోంది. మరి దాని పరిణామాలు పర్యవసానాలు ఎలా ఉంటాయో చూడాల్సి ఉంది అని అంటున్నారు.