ఏపీ బీజేపీలో మాధవ్.. నెట్టుకొస్తారా.. నెగ్గుకొస్తారా ..!
ఇంకో మాటలో చెప్పాలంటే.. క్షత్రియ, కాపు సామాజిక వర్గం.. బీజేపీని ఓన్ చేసుకున్న పరిస్థితి ఒకప్పుడు ఉంది.
By: Tupaki Desk | 3 July 2025 6:00 AM ISTఏపీ బీజేపీ చీఫ్‌గా పగ్గాలు చేపట్టారు పాకాల వెంకట నాగేంద్ర మాధవ్(పీవీఎన్ మాధవ్). ప్రస్తుతం ఉన్న పరిస్థితిలో మాధవ్ పగ్గాలు చేపట్టడం ఎవరికీ ఇబ్బంది లేకపోయినా.. వాస్తవ పరిస్థితిని గమనిస్తే.. మాత్రం పార్టీని ఎలా ముందుకు నడిపిస్తారన్నది మాత్రం ప్రశ్నగానే మిగులుతుంది. పార్టీలో గత ఎన్నికలకు ముందు నుంచి కూడా.. రెండు మూడు గ్రూపులు పనిచేస్తున్నాయి. ఈ వర్గ, గ్రూపు రాజకీయాలే పార్టీని క్షేత్రస్థాయిలో డెవలప్ కాకుండా అడ్డుకుంటున్నాయన్న చర్చ కూడా ఉంది.
వీటిలో ప్రధానంగా వ్యక్తుల ఆధారంగా ఏర్పడిన గ్రూపులు, సైద్ధాంతిక విధానాల ప్రాతిపదికన ఏర్పడిన గ్రూపులు. ఇక, సామాజిక వర్గాల ఆధారంగా కూడా గ్రూపులు ఏర్పడ్డాయి. ఇలా ఏపీ బీజేపీ ఎక్కడికక్కడ గ్రూపులు కట్టింది. ఎవరి లాభం వారు చూసుకుంటున్నారు. అదేసమయంలో అధిష్టానంలోని పెద్దలతో మచ్చిక పెంచుకుని .. చక్రాలు తిప్పుతున్న వారు కూడా ఉన్నారు. ఇలాంటివారిని లైన్‌లో పెట్టాల్సిన అవసరం పార్టీకి ఉందన్నది తరచుగా చెప్పుకొనే మాట.
కానీ, అంత తేలిక కాదు. రాష్ట్రంలో ఒకప్పుడు బీజేపీకి, ఇప్పుడున్న బీజేపీకి తేడా ఏంటంటే.. ఒకప్పుడు.. ఆర్ ఎస్ ఎస్ వాదంతో తెరమీదికి వచ్చిన నాయకులు పార్టీ తరఫున వాయిస్ వినిపించేవారు. కానీ, తర్వా త కాలంలో వ్యాపారులు, సామాజిక వర్గం పరంగా శాసించేవారు బీజేపీ బాటపట్టారు. చిత్రం ఏంటంటే.. ప్రస్తుతం ఎన్నికైన వారిలో ఎక్కువగా ఉన్నది కూడా వీరే. టికెట్లు దక్కించుకున్నది కూడా వీరే. సో.. ఇలాంటి వారి ఆధిపత్యాన్ని పాత కాపులు సహించలేక పోతున్నారు.
ఇంకో మాటలో చెప్పాలంటే.. క్షత్రియ, కాపు సామాజిక వర్గం.. బీజేపీని ఓన్ చేసుకున్న పరిస్థితి ఒకప్పుడు ఉంది. కానీ, తర్వాత కాలంలో కమ్మ సామాజిక వర్గం జోక్యంతో తమ హవాకు బ్రేకులు పడుతున్నాయన్న ది వారు చెబుతున్న మాట. ఈ నేపథ్యంలోనే ఎప్పటికప్పుడు రాష్ట్ర బీజేపీ చీఫ్‌పై ఒత్తిడి పెరుగుతూనే ఉంది. కానీ, గత చీఫ్‌లు వీటిని పెద్దగా పట్టించుకోలేదు.
దీంతో పార్టీ దూకుడు కూడా.. కొందరికే పరిమితం అయింది. ఇక, ఇప్పుడు మాధవ్ పైనే అందరూ ఆశలు పెట్టుకున్నారు. మరి మాధవ్ ఎలాంటి వ్యూహంతో ముందుకు సాగుతారు? అనేది చూడాలి. ఇతర నాయ కుల దూకుడుకు తానే అలవాటు పడి నెట్టుకురావడమా..? లేక, అందరూ తన మాట విని.. పార్టీ సిద్ధాంతా లకు అనుకూలంగా పనిచేయించేలా నెగ్గుకు వస్తారా? అనేది చూడాలి.
