ఏపీ బీజేపీలో 'వాటాల' రాజకీయం ..!
ఇదేసమయంలో మాజీ మంత్రి, ఎమ్మెల్యే ఆదినారాయణ రెడ్డి కూడా సీరియస్‌గానే వ్యాఖ్యలు చేశారు.
By: Tupaki Desk | 3 July 2025 4:00 AM ISTఏపీ బీజేపీలో రాజకీయాలు అనూహ్యంగా మారాయి. పార్టీ చీఫ్‌గా పీవీఎన్ మాధవ్ పగ్గాలు చేపట్టిన మరుక్ష ణమే.. పార్టీలో సీనియర్ నాయకులు ఒక్కసారిగాతమకేదో స్వేచ్ఛ లభించినట్టుగా భావించినట్టు స్పష్ట మైంది. నిన్న మొన్నటి వరకు మౌనంగా ఉన్న నాయకులు కూడా యాక్టివ్ అయ్యారు. కూటమిలో లోపాల పై నిన్నటి వరకు నోరు విప్పని నాయకులు సైతం లోపాలు ఇవీ అంటూ.. జాబితా చెప్పుకొచ్చారు. అంతేకాదు.. కొన్ని కీలక వ్యాఖ్యలు కూడా చేశారు.
ఈ పరిస్థితి రాజకీయాల్లో చర్చగానే కాకుండా.. కూటమిలోనూ విస్మయాన్ని కలిగిస్తోంది. కూటమిగా బీజేపీని కలుపుకొని వెళ్లాల్సిన అవసరం కూటమికి ఉందంటూ.. విష్ణుకుమార్ రాజు చేసిన వ్యాఖ్యలు.. చాలా లోతు గా అర్ధాన్ని ఇస్తున్నాయి. బీజేపీ లేకపోతే.. కూటమి లేదని ఆయన చెప్పుకొచ్చారు. కూటమి కట్టకపోతే.. జగన్‌ను ఎదుర్కొనడం కూడా కష్టమేనని ఆయన పరోక్షంగా వ్యాఖ్యానించారు. సో.. దీనిని బట్టి.. బీజేపీ ప్రాధాన్యాన్ని ఆయన చెప్పుకోవాలని అనుకున్నారు. చెప్పారు.
ఇదేసమయంలో మాజీ మంత్రి, ఎమ్మెల్యే ఆదినారాయణ రెడ్డి కూడా సీరియస్‌గానే వ్యాఖ్యలు చేశారు. అందరినీ కలుపుకొని పోవాలంటూ.. ఆయన చేసిన కామెంట్లు.. గతంలో ఇలాంటి పరిస్థితి లేదా? అనే సందేహాలను తెరమీదికి తెచ్చింది. ఇక, ఇద్దరూ కామన్‌గా చేసిన వ్యాఖ్యల్లో ఏపీ బీజేపీ.. కూటమితో ఉం టుందని.. అయితే.. కూటమి తమను సముచితంగా గౌరవించాలని చెబుతున్నారు. మీరు 5 శాతం మంది మాత్రమే ఉన్నారని అవమానించేలా వ్యాఖ్యానిస్తున్నారన్నది వారి మాట.
ఉదాహరణకు నామినేటెడ్ పదవుల విషయంలో బీజేపీకి ఇప్పటి వరకు 5 శాతం చొప్పున పదవులు ఇస్తు న్నారు. అయితే.. దీనిని ఇప్పటి వరకు ఎలా సమర్థించినా.. ఎలా సర్దుకు పోయినా.. ఇక, నుంచి తమకు కూడా మెజారిటీ పార్టు దక్కాలని వారు కోరుతున్నారు. అంటే.. ఎమ్మెల్యేల సంఖ్యాబలంతో సంబంధం లేకుండానే.. పదవుల పంపిణీ జరగాలని, తమకు న్యాయం జరగాలని వారు కోరుతున్నారు. అయితే.. ఇది ఎంత వరకు సాధ్యం? కూటమిలో అందరినీ సంతృప్తి పరిచేస్థాయిలో పదవులు ఉన్నాయా? అనేది ప్రశ్న. ఏదేమైనా.. గతానికి భిన్నంగా అయితే.. రాజకీయాలు ఉండనున్నాయన్నది ఖాయం.
