Begin typing your search above and press return to search.

బీజేపీలో సోము బ్యాచ్ యాక్టివ్ అవుతుందా ... రీజ‌న్ ఏంటి... ?

ఏపీ బీజేపీలో వ‌ర్గ పోరు మామూలుగా లేదు. అంత‌ర్గ‌త క‌ల‌హాలు, కుమ్ములాట‌లు ఎక్కువ‌గానే ఉన్నాయి.

By:  Tupaki Desk   |   1 July 2025 12:09 AM IST
బీజేపీలో సోము బ్యాచ్ యాక్టివ్ అవుతుందా ... రీజ‌న్ ఏంటి... ?
X

ఏపీ బీజేపీలో వ‌ర్గ పోరు మామూలుగా లేదు. అంత‌ర్గ‌త క‌ల‌హాలు, కుమ్ములాట‌లు ఎక్కువ‌గానే ఉన్నాయి. ఆది నుంచి కూడా ప్ర‌స్తుత రాష్ట్ర చీఫ్ పురందేశ్వ‌రి అంటే గిట్ట‌ని వారు.. చాలా మంది ఉన్నారు. వీరిలో మాజీ పార్టీ చీఫ్, ప్ర‌స్తుత ఎమ్మెల్సీ సోము వీర్రాజు బ్యాచ్‌గా పేరు తెచ్చుకున్న‌వారు ఉన్నారు. సామాజిక వ‌ర్గాల‌ప‌రంగా కూడా.. వీరు ఓ కీల‌క సామాజిక వ‌ర్గం అంటే.. దూరం పెడ‌తారు. దీంతో ఈ బ్యాచ్ వ్య‌వ‌హా రం.. బీజేపీలో ఎప్పుడూ చ‌ర్చ‌గానే ఉంది.

ఒక ర‌కంగా చెప్పాలంటే.. సోము ఆదేశాలు, ఆయ‌న క‌నుస‌న్న‌ల్లోనే న‌డుస్తార‌న్న మాట కూడా వినిపిస్తుం ది. ఇలాంటివారిలో జీవీఎల్ న‌రసింహారావు, విష్ణువ‌ర్ధ‌న్‌రెడ్డి, పీవీఎన్ మాధ‌వ్‌, భాను ప్ర‌కాష్‌వంటివారు ఉన్నారు. అయితే.. వీరిలో భాను ప్ర‌కాష్‌.. సోమును వ‌దిలేసి మంత్రి స‌త్య‌కుమార్ వ‌ర్గంలో చేరిపోయార న్న టాక్ ఉంది. మిగిలిన వారు మాత్రం మ‌రికొంద‌రితో క‌లిసి సోము వ‌ర్గంగానే క‌నిపిస్తున్నారు. వీరికి ఏ ప‌నికావాల‌న్నా.. సోము చేస్తారు. సోము చెప్పిన‌ట్టు వీరు వింటారు.

అయితే. ఎవ‌రు ఏం చెప్పారు? వీరు ఏం విన్నారు? అనేది ప‌క్క‌న పెడితే.. ఎవ‌రు ఏం చేసినా.. అది పార్టీ మేలు కోసం అయితే ఎవ‌రికీ అభ్యంత‌రం లేదు. కానీ.. సోము కొన్నికార‌ణాల‌తో సైలెంట్ అయ్యారు. త‌న‌ను ఎమ్మెల్సీగా ప్ర‌తిపాదించ‌లేద‌న్న అక్క‌సు ఆయ‌న‌కు ఉంది. తాను నేరుగా ఢిల్లీకి వెళ్లి ప‌నులు చ‌క్క‌బెట్టుకున్నారు. దీంతో రాష్ట్ర నాయకుల‌తో ముఖ్యంగా ఓ సామాజిక వ‌ర్గం నాయ‌కుల‌తో సోముకు దాదాపు సంబంధాలు క‌ట్ అయ్యాయి.

ఈ క్ర‌మంలోనే రాష్ట్ర పార్టీ చీఫ్ ప‌గ్గాల విష‌యంలోనూ.. సోము ఢిల్లీలో చక్రం తిప్పార‌న్న‌ది జోరుగా విని పిస్తున్న మాట‌. ఈ క్ర‌మంలోనే ఆయ‌న రెడ్డి సామాజిక వ‌ర్గానికి చెందిన ఓ యువ నాయ‌కుడి పేరును కూడా ప్ర‌తిపాదించార‌ని స‌మాచారం. అయితే.. దీనికి అధిష్టానం ఒప్పుకోక‌పోవ‌డంతోనే బీసీ వ‌ర్గానికి చెందిన త‌న అనుచ‌రుడి పేరును ఆయ‌న ప్రతిపాదించార‌ని తెలిసింది. ఈ విష‌యంలో అధిష్టానం సానుకూలంగానే ఉంద‌ని చెబుతున్నారు. మొత్తంగా ఒక సామాజిక వ‌ర్గంపై కోపంతో సోము బ్యాచ్ సైలెంట్ కాగా.. ఇక నుంచి త‌మ వారికి పార్టీ చీఫ్ ప‌ద‌వి ద‌క్కితే.. అప్పుడు యాక్టివ్ అయ్యే అవ‌కాశం ఉంద‌ని అంటున్నారు.